న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sachin vs Kohli: సచిన్ మృధుస్వభావి.. కోహ్లీ అలా కాదు! గొప్ప ఉదాహరణ అదే: వెంకటేష్

Venkatesh Prasad Says Sachin Tendulkar is very soft, Virat Kohli is aggressive
Sachin Vs Kohli : ఆ రోజు Sachin ప్లేస్ లో Kohli ఉండి ఉంటేనా.. | Team India || Oneindia Telugu

హైదరాబాద్: భారత మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్, ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీల బ్యాటింగ్ శైలిని ఎంతో మంది పోల్చుతుంటారు. కొందరు సచిన్ గొప్పంటే.. మరికొందరు విరాట్ అని అంటారు. సుదీర్ఘంగా ఈ చర్చ జరుగుతూనే ఉంది. దిగ్గజాలు ఎవరి అభిప్రాయాలను వారు తెలుపుతుంటారు. ఈ క్రమంలో సచిన్-కోహ్లీల మధ్య వ్యత్యాసాన్ని భారత మాజీ స్పీడ్‌స్టర్ వెంకటేష్ ప్రసాద్ కూడా తాజాగా చెప్పుకొచ్చాడు. సచిన్-కోహ్లీ ఇద్దరూ మంచి బ్యాట్స్‌మన్‌ అని ప్రశంసించారు. బ్యాటింగ్ లెజెండ్స్ ఇద్దరూ టీమిండియాకు వెన్నముఖ అని పేర్కొన్నాడు. అయితే భావోద్వేగాల ప్రదర్శించడంలో ఇద్దరి శైలి వేరని వెంకటేష్ చెప్పుకొచ్చాడు.

సచిన్ మృధుస్వభావి

సచిన్ మృధుస్వభావి

గ్రేడ్ క్రికెటర్ పోడ్‌కాస్ట్‌లో వెంకటేష్ ప్రసాద్ మాట్లాడుతూ... 'నిజాయితీగా చెప్పాలంటే.. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇద్దరూ మంచి బ్యాట్స్‌మన్‌లు. అప్పుడు సచిన్.. ఇప్పుడు విరాట్ టీమిండియాకు వెన్నముఖ. సచిన్ చాలా మృధుస్వభావి. విరాట్ అలా కాదు.. దూకుడుగా ఉంటాడు. కానీ అది అతని స్వభావం కాదు. మైదానంలో మాత్రమే దూకుడు ప్రదర్శిస్తుంటాడు. ఎందుకంటే అతను ప్రతి గేమ్‌లోనూ మంచి ప్రదర్శన ఇచ్చి మ్యాచ్ గెలవాలనుకుంటాడు. ఇక సచిన్ ప్రతి గేమ్‌లోనూ బాగా రాణించాలనుకున్నాడు' అని అన్నాడు.

దూకుడుగా ఉంటాడు

దూకుడుగా ఉంటాడు

'భావోద్వేగాల ప్రదర్శించడంలో సచిన్-కోహ్లీల శైలి వేరు. సచిన్ భావోద్వేగాలను ప్రదర్శించడం మనం ఎక్కువగా చూసుండం. సెంచరీ చేసినా.. డకౌట్ అయినా లిటిల్ మాస్టర్ ఒకేలా ఉంటాడు. ఏ సందర్భంలో అయినా అతనిలో మనకు పెద్దగా భావోద్వేగం కనిపించదు. విరాట్ మాత్రం తనను తాను వ్యక్తపరచటానికి ఇష్టపడే వ్యక్తి. అందుకే మైదానంలో ఎప్పుడూ దూకుడుగా ఉంటాడు. ప్రతి సందర్భంలో తన ఆనందం, బాధను ప్రదర్శిస్తాడు. ఎప్పుడూ కూడా జట్టుకు విజయం అందించేందుకే చూస్తాడు. ఈ క్రమంలోనే ఆట పట్ల దూకుడుగా ఉంటాడు. దూకుడే అతని మంత్రం' అని వెంకటేష్ ప్రసాద్ పేర్కొన్నాడు.

IPL 2021: 'కచ్చితమైన బబుల్‌ నిబంధనలు పాటించాం.. ఎక్కడ తప్పు జరిగిందో తెలియట్లేదు'

విరాట్ అయితే

విరాట్ అయితే

'భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా వసీం అక్రమ్ వేసిన ఓ బౌన్సర్ సచిన్ తలను గట్టిగా తాకింది. బౌలర్‌ను ఏమీ అనకుండా స్ట్రైకింగ్‌కి వెళ్లిపోయాడు. అక్రమ్ తర్వాతి బంతిని కూడా అదే రీతిలో సాధించగా.. సచిన్ భారీ సిక్సర్ బాదాడు. అయినా కూడా సచిన్ నుంచి ఎటువంటి స్పందన లేదు. బహుశా విరాట్ అయితే పిడికిలిని చూపించేవాడు లేదా బౌలర్ వైపు అలా చూస్తూ ఉండేవాడు. వారు ఇద్దరు వేర్వేరు వ్యక్తులు. ఏదేమైనా టీమిండియాకు వారు ఎంతో చేశారు. గొప్ప ఆటగాళ్లు' అని వెంకటేష్ ప్రసాద్ చెప్పుకొచ్చాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు

అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు

2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 91 టెస్టులాడి 52.4 సగటుతో 7490 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు (7 డబుల్ సెంచరీలు), 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 254 వన్డేల్లో 59.1 సగటుతో 12169 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 62 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 90 టీ20లలో 52.6 సగటుతో 3159 రన్స్ చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 22 వేలకు పైగా పరుగులు చేశాడు. ఇక సచిన్ 100 సెంచరీలకు చేరువలో ఉన్నాడు. మరొక్కటి చేస్తే రికీ పాంటింగ్ సరసన చేరుతాడు.

Story first published: Saturday, May 8, 2021, 14:39 [IST]
Other articles published on May 8, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X