న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌తో ఒక్క టెస్టు కూడా ఆడకపోవడం దురదృష్టకరం: యాసిర్ షా

Unfortunate not to have played a single Test against India: Yasir Shah

హైదరాబాద్: అరంగేట్రం చేసినప్పటి నుండి టీమిండియాతో ఒక్క టెస్టు మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదని పాకిస్థాన్ లెగ్‌ స్పిన్నర్‌ యాసిర్‌ షా ఆవేదన వ్యక్తం చేశాడు. టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియాపై తన నైపుణ్యాలను పరీక్షించడానికి ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపాడు.

పృథ్వీ షా సలహాలు తీసుకున్న కెప్టెన్.. ఎందుకో తెలుసా?!!పృథ్వీ షా సలహాలు తీసుకున్న కెప్టెన్.. ఎందుకో తెలుసా?!!

33 ఏళ్ల యాసిర్ షా

33 ఏళ్ల యాసిర్ షా

33 ఏళ్ల యాసిర్ షా పాకిస్థాన్ తరుపున ఇప్పటివరకు 37 టెస్టులు ఆడి 207 వికెట్లు సాధించాడు. అయితే, భారత్‌తో కనీసం ఒక్క టెస్టు మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాకపోవడం దురదృష్టంగా యాసిర్‌ షా అభివర్ణించాడు. "టీమిండియాతో టెస్టు మ్యాచ్‌ కూడా ఆడకపోవడం నా కెరీర్‌లో ఒక దురదృష్టకరమైన ఘటనే" అని చెప్పాడు.

కోహ్లీకి బౌలింగ్‌ చేయాలని

కోహ్లీకి బౌలింగ్‌ చేయాలని

"టెస్టుల్లో కోహ్లీకి బౌలింగ్‌ చేయాలని ఎంతో ఆసక్తిగా ఉంది. కానీ, వారితో టెస్టు ఆడే అవకాశం ఇప్పటివరకూ రాలేదు. భారత్‌తో ఆడాలనే ఉత్సాహం నాలో చాలా ఉంది. ఆ జట్టులో చాలా మంది టాప్‌ ఆటగాళ్లు ఉన్నారు. ఒక లెగ్‌ స్పిన్నర్‌గా నేను కోరుకునేది ఇదే. కోహ్లీ వంటి అత్యుత్తమ ఆటగాడికి బౌలింగ్‌ చేయడం కంటే ఆనందం ఏముంటుంది" అని యాసిర్ షా అన్నాడు.

కొన్ని సమయాల్లో

కొన్ని సమయాల్లో

"మీరు కొన్ని సమయాల్లో అనుభూతి చెందుతారు. కానీ ఇది ఆటగాళ్ల నియంత్రణకు సంబంధించిన అంశం కాబట్టి మేము ఏమీ చేయలేము. అవును, త్వరలోనే భారత్‌తో ఆడే అవకాశం పాకిస్థాన్‌కు వస్తుందని ఆశిస్తున్నా" అని యాసిర్ షా పేర్కొన్నాడు. పాక్ తరఫున యాసిర్‌ షా 2011లో అరంగేట్రం చేశాడు.

2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల తర్వాత

2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల తర్వాత

అయితే, 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల తర్వాత పాక్‌తో భారత్‌ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడలేదు. దీంతో టీమిండియాతో టెస్టు క్రికెట్‌ను ఆడే అవకాశం యాసిర్‌కు రాలేదు. అయితే, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నిర్వహించే టోర్నీల్లో మాత్రం ఇరు జట్లు తలపడుతున్నాయి.

Story first published: Tuesday, December 17, 2019, 12:17 [IST]
Other articles published on Dec 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X