న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsNZ: అరంగేట్రం అదరహో.. రెండు కీలక వికెట్లు తీసిన ఉమ్రాన్ మాలిక్..!

Umran Malik shines in his ODI debut against Newazealand

వన్డే అరంగేట్రంలోనే ఉమ్రాన్ మాలిక్ సత్తా చాటాడు. తన తొలి వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిల్యాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు సత్తా చాటుతోంది. 307 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన కివీస్‌ను ఆరంభంలోనే శార్దూల్ ఠాకూర్ దెబ్బతీశాడు. అతని బౌలింగ్‌లో ప్రమాదకర ఫిన్ అలెన్ (22) పెవిలియన్ చేరాడు. శార్దూల్ విసిరిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన అతను కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు.
ఉమ్రాన్ తొలి వికెట్..

ఉమ్రాన్ తొలి వికెట్..

ఆ తర్వాత మరో వికెట్ పడకుండా డెవాన్ కాన్వే (24), కెప్టెన్ కేన్ విలియమ్సన్ జాగ్రత్తగా ఆడారు. ఇలా కివీస్ ఇన్నింగ్స్ సాఫీగా సాగిపోతోంది అనుకుంటున్న సమయంలో ఉమ్రాన్ మాలిక్ రంగంలోకి దిగాడు. తన పేస్‌తో కివీ బ్యాటర్లను తడబాటుకు గురి చేశాడు. ఈ క్రమంలోనే ఫుల్ లెంగ్త్‌లో ఆఫ్ సైడ్ వేసిన బంతిని డ్రైవ్ చేసేందుకు డెవాన్ కాన్వే ప్రయత్నించాడు. కానీ ఆ బంతిని చేరుకోలేకపోయాడు. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ పంత్ వైపు వెళ్లింది. అతను ఎలాంటి పొరపాటు చెయ్యకపోవడంతో కాన్వే నిరాశగా మైదానం వీడాడు.

కాసేపటికే మరొకటి..

కాసేపటికే మరొకటి..

అయితే ఆ తర్వాత కాసేపటికి మరోసారి ఉమ్రాన్ మాలిక్ తన సత్తా నిరూపించుకున్నాడు. జాగ్రత్తగా ఆడుతున్న డారియల్ మిచెల్‌ను బుట్టలో వేసుకున్నాడు. ఆఫ్ స్టంప్ ఆవలగా వచ్చిన షార్ట్ బాల్‌ను ఎక్స్‌ట్రా కవర్స్ దిశగా ఆడేందుకు మిచెల్ ప్రయత్నించాడు. కానీ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచి డీప్ బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా వెళ్లింది. అక్కడ ఉన్న సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ దీపక్ హుడా సులభంగా ఆ క్యాచ్ అందుకున్నాడు. దీంతో కివీస్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. దీంతో కివీస్ జట్టు 89 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం విలియమ్సన్‌కు వికెట్ కీపర్ టామ్ లాథమ్ జతకలిశాడు. వీళ్లిద్దరూ ఈ జట్టును ఎంత దూరం తీసుకెళ్తారో చూడాలి.

భారత ఇన్నింగ్స్..

భారత ఇన్నింగ్స్..

అంతకుమందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు శిఖర్ ధవన్ (72), శుభ్‌మన్ గిల్ (50), శ్రేయాస్ అయ్యర్ (80) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో మెరుగైన స్కోరు చేసింది. చివర్లో వాషింగ్టన్ సుందర్ (37) ధనాధన్ షాట్లతో నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 306 పరుగుల భారీ స్కోరు చేసింది. సంజూ శాంసన్ (36) ఫర్వాలేదనిపించగా.. రిషభ్ పంత్ (15) మరోసారి నిరాశ పరిచాడు. ఈ మ్యాచ్‌లో భారత యువ పేసర్లు ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్ ఇద్దరూ వన్డే ఫార్మాట్‌లో అరంగేట్రం చేశారు.

Story first published: Friday, November 25, 2022, 13:02 [IST]
Other articles published on Nov 25, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X