న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పేసర్‌గా అరుదైన ఘనత: ఎలైట్ జాబితాలోకి ఉమేశ్ యాదవ్

India vs West indies 2018 : Umesh yadav Joins In Elite List
Umesh Yadav Joins Elite List Of Indian Pacers After Match-Winning Performance In 2nd Test

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో వెస్టిండిస్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ అరుదైన ఘనత సాధించాడు. ఈ టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 72 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది.

<strong>6 బంతుల్లో 6 సిక్సర్లు: యువరాజ్ రికార్డు సమం, హజ్రతుల్లా రికార్డు</strong>6 బంతుల్లో 6 సిక్సర్లు: యువరాజ్ రికార్డు సమం, హజ్రతుల్లా రికార్డు

ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌( 33 నాటౌట్‌), పృథ్వీ షా(33 నాటౌట్‌)లు వికెట్‌ పడకుండా ఆడి టీమిండియాకు విజయాన్ని అందించారు. దీంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ టెస్టు విజయం సొంతగడ్డపై టీమిండియాకు వరుసగా పదో టెస్ట్ సిరీస్ విజయం కావడం విశేషం.

హైదరాబాద్ టెస్ట్‌లో 10 వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్

హైదరాబాద్ టెస్ట్‌లో 10 వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్

రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి పది వికెట్లు తీసి ఉమేశ్ యాదవ్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తద్వారా భారత్ తరుపున టెస్టుల్లో పది వికెట్లు సాధించిన ఎనిమిదో భారత పేసర్‌గా నిలిచాడు. ఇప్పటివరకూ భారత్‌ తరఫున ఏడుగురు మాత్రమే ఈ ఘనత సాధించారు.

తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు

తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు

హైదరాబాద్ టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన ఉమేశ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లతో వెస్టిండిస్ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. ఫలితంగా టెస్టుల్లో తొలిసారి ఉమేశ్ యాదవ్ పది వికెట్లు పడగొట్టాడు. అంతకముముందు కపిల్‌దేవ్‌, చేతన్‌ శర్మ, వెంకటేశ్‌ ప్రసాద్‌, జవగళ్‌ ప్రసాద్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, ఇషాంత్‌ శర్మ, జహీర్‌ ఖాన్‌లు మాత‍్రమే 10 వికెట్లు సాధించిన పేసర్లు.

రెండేసి సార్లు ఈ ఘనత సాధించిన కపిల్, ఇర్పాన్

రెండేసి సార్లు ఈ ఘనత సాధించిన కపిల్, ఇర్పాన్

ఇందులో కపిల్‌ దేవ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌లు రెండేసి సార్లు ఈ ఘనత సాధించారు. 1980లో చెన్నై వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ 11 వికెట్లు తీసి ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు. మూడేళ్ల తర్వాత అహ్మాదాబాద్ వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన టెస్టులో మళ్లీ కపిల్ పది వికెట్లు తీశాడు.

కొల్‌కతాలో 13 వికెట్లు పడగొట్టిన జవగళ్ శ్రీనాథ్

కొల్‌కతాలో 13 వికెట్లు పడగొట్టిన జవగళ్ శ్రీనాథ్

ఇక, 1999లో కోల్‌కతా వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జవగళ్ శ్రీనాథ్ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి మొత్తం 13 వికెట్లు పడగొట్టాడు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా వెస్టిండిస్‌తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 272 పరుగులతో భారత క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విజయం సాధించిన టీమిండియా రెండో టెస్ట్‌లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Story first published: Monday, October 15, 2018, 12:26 [IST]
Other articles published on Oct 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X