న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఉమేశ్.. స్వేచ్ఛనిస్తే చాలు.. రెచ్చిపోతాడు'

 Umesh Yadav is a captain’s fast bowler: Subroto Banerjee

న్యూ ఢిల్లీ: భారత పర్యటనలో ఉన్న వెస్టిండీస్‌ ఆతిథ్య భారత్‌తో టెస్టు సిరీస్‌లో తలపడింది. ఈ నేపథ్యంలో ఆదివారం ముగిసిన టెస్టు మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ 10 వికెట్లు పడగొట్టి మళ్లీ తన సత్తా నిరూపించుకున్నాడు. అతని ప్రదర్శనకు గానూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. తాను ఊహించిన దానికంటే మెరుగ్గా రాణించాడంటూ కితాబిచ్చాడు.

'ఆ విషయం చెప్తే కోహ్లీ, యువరాజ్‌లు నవ్వాపుకోలేదు'(వీడియో)'ఆ విషయం చెప్తే కోహ్లీ, యువరాజ్‌లు నవ్వాపుకోలేదు'(వీడియో)

మాజీ ఫాస్ట్ బౌలర్ సుభ్రతో బెనర్జీ సైతం ధీమా

మాజీ ఫాస్ట్ బౌలర్ సుభ్రతో బెనర్జీ సైతం ధీమా

దీంతో.. నవంబరులో ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లనున్న జట్టులో అతనికి చోటు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కెప్టెన్ సపోర్ట్ లభిస్తే ఉమేశ్ యాదవ్‌ మరింత మెరుగైన ప్రదర్శన చేయగలడని అందరితో పాటు మాజీ ఫాస్ట్ బౌలర్ సుభ్రతో బెనర్జీ సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు. పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా మెరుగ్గా రాణిస్తుండటంతో.. ఏడాదిన్నరకాలంగా ఉమేశ్ యాదవ్ రిజర్వ్ బెంచ్‌కే ఎక్కువగా పరిమితమైయ్యాడు.

 రెస్ట్ ఇవ్వడంతో మళ్లీ తుది జట్టులో చోటు

రెస్ట్ ఇవ్వడంతో మళ్లీ తుది జట్టులో చోటు

ఇటీవల ఆ ఇద్దరికీ రెస్ట్ ఇవ్వడంతో మళ్లీ తుది జట్టులో చోటు దక్కించుకుని బంతితో చెలరేగుతున్నాడు. ఇప్పటికే పలువురు ప్రముఖులంతా ఉమేశ్ యాదవ్ ఆస్ట్రేలియా పర్యటన ఖాయమని జోస్యం చెప్తుండగా.. ఇక సెలక్టర్ల నుంచి రావడం లాంచనీయంగానే కనిపిస్తోంది.

స్వేచ్ఛగా బౌలింగ్ చేయమని చెప్తే చాలు

స్వేచ్ఛగా బౌలింగ్ చేయమని చెప్తే చాలు

ఉమేశ్ యాదవ్‌కి కెప్టెన్ మద్దతుగా నిలిచి.. స్వేచ్ఛగా బౌలింగ్ చేయమని చెప్తే చాలు.. అతను అద్భుతాలు చేయగలడు. టెస్టుల్లో అతను ఓపికగా లాంగ్ స్పెల్ వేయగలడు. అంతేకాకుండా.. బంతిని సురక్షిత ప్రదేశంలో విసురుతూ.. బ్యాట్స్‌మెన్‌ని బోల్తా కొట్టించగలడు. హైదరాబాద్ టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఉమేశ్‌కి మద్దతుగా నిలిచి ఫలితం రాబట్టాడు. ఇక ఆస్ట్రేలియా పర్యటనకి అతను ఎంపికవడం లాంఛనమే' అని బెనర్జీ వెల్లడించాడు.

40 టెస్టులాడి 117 వికెట్లు

40 టెస్టులాడి 117 వికెట్లు

2011లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన ఉమేశ్ యాదవ్.. కెరీర్‌లో ఇప్పటి వరకు 40 టెస్టులాడి 117 వికెట్లు పడగొట్టాడు. అయితే.. ఒక టెస్టు మ్యాచ్‌‌లో (రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి) 10 వికెట్లు పడగొట్టం మాత్రం ఇదే తొలిసారి.

Story first published: Tuesday, October 16, 2018, 18:27 [IST]
Other articles published on Oct 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X