Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నెటిజన్లు కామెంట్లు: హ్యారీ పొట్టర్‌గా మారిన రోహిత్ శర్మను చూశారా?

Twitterati turns meme makers, transforms Rohit Sharma into Harry Potter

హైదరాబాద్: రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినివ్వడంతో వెస్టిండిస్‌తో ముగిసిన మూడు టీ20ల సిరిస్‌కు రోహిత్ శర్మను సెలక్టర్లు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తనకు ఎంతగానో అచ్చొచ్చిన పొట్టి ఫార్మాట్‌లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా తానెంటో నిరూపించుకున్నాడు.

ఓపెనర్‌గానే కాదు, కెప్టెన్‌గా కూడా తనకు తిరుగులేదని మరోసారి ఈ సిరిస్‌తో నిరూపించుకున్నాడు. మూడు టీ20ల సిరిస్‌ను 3-0తో నెగ్గి పర్యాటక వెస్టిండిస్ జట్టుపై క్లీన్‌స్వీప్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఈ విజయం భారత జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.

టీ20ల్లో నాలుగు సెంచరీలు బాదిన రోహిత్ శర్మ

ఈ మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా లక్నో వేదికగా జరిగిన రెండో టీ20లో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. టీ20ల్లో రోహిత్ శర్మకు ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. గత ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన ఆఖరి టీ20లో వెస్టిండిస్‌పై 6 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. తద్వారా టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో అత్యధిక సార్లు గెలిచిన జాబితాలో టీమిండియా రెండో స్థానంలో నిలిచింది.

3-0తో టీమిండియాను గెలిపించిన కెప్టెన్ రోహిత్

భారత్‌ జట్టు మూడుసార్లు 3-0తో టీ20 సిరీస్‌ను గెలవగా, పాకిస్తాన్‌ ఐదుసార్లు విజయం సాధించింది. అప్ఘానిస్తాన్‌తో కలిసి భారత్‌ సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, ఐర్లాండ్‌, న్యూజిలాండ్‌, యూఏఈ, వెస్టిండీస్‌లు ఒక్కోసారి మాత్రమే 3-0తో టీ20 సిరీస్‌లను గెలిచాయి. అంతేకాదు టీమిండియా వరుసగా 12 అంతర్జాతీయ టీ20ల్లో విజయం సాధించింది.

తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో

తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక టీ20 మ్యాచ్‌లు గెలిపించిన భారత కెప్టెన్‌గా నిలిచాడు. ఆఖరి టీ20లో రోహిత్ శర్మ ఓ క్యాచ్‌ను అందుకునే క్రమంలో గాల్లోకి ఎగిరిన ఓ ఫోటోను బీసీసీఐ తన అధికారిక ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. వాషింగ్టన్ సుందర్ వేసిన మూడో ఓవర్‌లో విండిస్ బ్యాట్స్‌మన్ హెట్‌మెయిర్ బాదిన బంతిని ఆపే క్రమంలో తీసిన ఫోటో ఇది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

రోహిత్ శర్మను హ్యారీ పోట్టర్‌తో పోల్చిన నెటిజన్లు

ఈ ఫోటోపై నెటిజన్లు రోహిత్ శర్మను హ్యారీ పోట్టర్‌తో పోలుస్తూ తమదైన శైలిలో కామెంట్లు పోస్టు చేస్తున్నారు.

Story first published: Tuesday, November 13, 2018, 17:48 [IST]
Other articles published on Nov 13, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+