షమీని కాంట్రాక్టు నుంచి తప్పించిన బీసీసీఐ: నెటిజన్లు మండిపాటు

Posted By:
Twitter Reactions: Mohammed Shami’s central contract withheld after wife’s accusations

హైదరాబాద్: తన భర్త క్రికెట్ మహమ్మద్ షమీకి చాలా మంది అమ్మాయితో వివాహేతర సంబంధాలున్నాయంటూ షమీ భార్య హసిన్‌ జహాన్‌ ఆరోపిస్తూ కొందరు యువుతులు, మహిళల వివరాలు, ఫోన్‌ నెంబర్లను సోషల్ మీడియాలో పోస్టు చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు.

క్రికెటర్ షమీకి షాక్ మీద షాక్: అటు భార్య, ఇటు బీసీసీఐ

షమీ ఓ శృంగార పురుషుడని వ్యాఖ్యానించిన జహాన్‌.. విడాకులు ఇవ్వాలంటూ తనను షమీ కుటుంబం తనను వేధిస్తోందని ఆమె ఆరోపించారు. తనను చిత్రహింసలకు గురిచేశాడని, భార్యగా ఏనాడు చూడలేదని వాపోయింది. తన చివరిశ్వాస వరకు భర్తతో కలిసేవుంటానని, అతడికి విడాకులు ఇవ్వబోనని స్పష్టం చేశారు.

తన భర్త చేసిన అకృత్యాలకు సంబంధించిన ఆధారాలన్నీ తన దగ్గర ఉన్నాయని, వీటితో అతడిని కోర్టుకు లాగుతానని ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్యూలో ఆమె వెల్లడించింది. హసిన్‌ జహాన్‌ చేసిన తీవ్ర ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీమిండియా పేసర్ మహమ్మద్ షమీకి బీసీసీఐ సైతం భారీ షాకిచ్చింది.

టార్చర్, చంపేందుకు యత్నం: క్రికెటర్ షమీ అక్రమ సంబంధాలపై భార్య సంచలన వ్యాఖ్యలు

2017 అక్టోబర్ నుంచి సెప్టెంబరు 2018 వరకు ఆటగాళ్లకు ప్రకటించిన వార్షిక కాంట్రాక్టుల నుంచి బీసీసీఐ షమీని తప్పించింది. టీమిండియాలో కీలక సభ్యుడైన షమికి ఏ విభాగంలోనూ చోటు లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలోనే షమీ పేరును జాబితా నుంచి తప్పించినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి.

కోర్టుకీడుస్తా, కంఠంలో ప్రాణముండగా విడాకులివ్వను: షమీ భార్య

ఈ వివాదంపై విచారణ పూర్తయ్యే వరకు షమీకి కాంట్రాక్టు దక్కదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. 'షమీ వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఆరోపణలను, వార్తలను బోర్డు పరిగణనలోకి తీసుకుంది. దీంతో షమీ కాంట్రాక్ట్‌ను నిలిపే విషయంలో సందిగ్ధ స్థితిలో నిలిచాం. క్రికెటర్ల కాంట్రాక్టులు రూపొందించిన రోజే షమీ భార్య అతడిపై తీవ్ర ఆరోపణలు చేశారు. షమీ భార్య ఆరోపణలకు, షమీ కాంట్రాక్ట్‌ నిర్ణయానికి ఎలాంటి సంబంధం లేదు' అని అన్నారు.

గతేడాది కాంట్రాక్ట్‌ ప్రకారం షమీ గ్రేడ్‌ బీ లో కొనసాగాడు. టెస్టు క్రికెట్‌లో భారత్‌కు కీలక బౌలర్‌గా షమీ తన స్థానాన్ని పదిలం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన సఫారీ పర్యటనలో కూడా షమీ ఫరవాలేదనిపించాడు. షమీ భారత్ తరఫున ఇప్పటివరకు 30 టెస్టులు, 50 వన్డేలు, 7 టీ20ల్లో ఆడాడు. అయితే, బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

భార్య చేసిన ఆరోపణలతో షమీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటున్నాడు. భారత జట్టులోని ఆటగాళ్లతో కూడిన నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లలో షమీని దుమ్మెత్తి పోస్తున్నారు. అందుకు సంబంధించిన ఇమేజి మీకోసం...

Twitter Reactions: Mohammed Shami’s central contract withheld after wife’s accusations
Story first published: Thursday, March 8, 2018, 12:50 [IST]
Other articles published on Mar 8, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి