న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆంధ్ర ఆటగాళ్లకు బీసీసీఐ జట్ల ఎంపికలో ప్రాధాన్యం

Three teams picked for Duleep Trophy after BCCI had decided to have four

హైదరాబాద్: దేశవాళీ క్రికెట్లో సత్తాచాటుతున్న ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ) ఆటగాళ్లకు బీసీసీఐ జట్ల ఎంపికలో ప్రాధాన్యం లభించింది. బీసీసీఐకి సంభందించిన వివిధ జట్లలో మొత్తం ఆరుగురు ఆంధ్ర ఆటగాళ్లు ఎంపికయ్యారు. ఆంధ్ర నుంచి హనుమ విహారి, కేఎస్‌ భరత్‌, రిక్కీ భుయ్‌, అయ్యప్ప, పృథ్వీరాజ్‌, కర్ణ్‌శర్మ.. హైదరాబాద్‌ నుంచి మొహ్మద్‌ సిరాజ్‌, సందీప్‌లకు వివిధ జట్లలో చోటు లభించింది.

శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్సీ వహించనున్న ‘ఎ’ జట్టు:

శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్సీ వహించనున్న ‘ఎ’ జట్టు:

వచ్చే నెలలో దక్షిణాఫ్రికా ‘ఎ'తో జరుగనున్న రెండు అనధికారిక టెస్టుల్లో పాల్గొనే భారత ‘ఎ' జట్టును జాతీయ సెలెక్టర్లు సోమవారం కోల్‌కతాలో ప్రకటించారు. ఆగస్టు 4 నుంచి బెల్గామ్, 10 నుంచి బెంగళూరులో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ముంబై బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్సీ వహించనున్న ‘ఎ' జట్టులో హైదరాబాద్‌ ప్లేయర్‌ సిరాజ్, ఆంధ్ర ఆటగాళ్లు హనుమ విహారి, కోన శ్రీకర్‌ భరత్‌లకు చోటు దక్కింది.

కోహ్లి సూచన మేరకు చాహల్‌ను:

కోహ్లి సూచన మేరకు చాహల్‌ను:

టీమిండియా కెప్టెన్‌ కోహ్లి సూచన మేరకు స్పిన్నర్‌ యజువేంద్ర చాహల్‌ను ఎంపిక చేశారు. డోప్‌ పరీక్షల్లో పట్టుబడి సస్పెన్షన్‌ ఎదుర్కొంటున్న పంజాబ్‌ వికెట్‌ కీపర్‌ అభిషేక్‌ గుప్తాను దులీప్‌ ట్రోఫీకి ఎంపిక చేయడం వివాదాస్పదమైంది. దులీప్‌ ట్రోఫీలో పాల్గొనే ఇండియా రెడ్‌ జట్టుకు సోమవారం సెలెక్షన్‌ కమిటీ అభిషేక్‌ను ఎంపిక చేసింది. ఐతే డోపింగ్‌ ఆరోపణలతో అభిషేక్‌ను 8 నెలలు సస్పెండ్‌ చేసింది బీసీసీఐ.

విజయవాడ వేదికగా దులీప్‌ ట్రోఫీ

విజయవాడ వేదికగా దులీప్‌ ట్రోఫీ

సెప్టెంబరు 14న అతడి సస్పెన్షన్‌ ముగియనుండగా.. ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 8 వరకు దులీప్‌ ట్రోఫీ జరుగనుంది. అభిషేక్‌ గురించి తమకు ఆలస్యంగా తెలిసిందని, అతడి స్థానంలో అక్షయ్‌ వాడ్కర్‌ను ఎంపిక చేశామని సెలక్టర్లు తర్వాత ప్రకటించారు. ఆగస్టు 17 నుంచి విజయవాడ వేదికగా దక్షిణాఫ్రికా ‘ఎ', ఆస్ట్రేలియా ‘ఎ'లతో జరిగే నాలుగు జట్ల వన్డే టోర్నీలో తలపడే భారత్‌ ‘ఎ' జట్టుకు అయ్యర్, ‘బి' జట్టుకు మనీశ్‌ పాండే కెప్టెన్సీ వహిస్తారు.

ఆశ్చర్యపరుస్తూ.. డోపీ అభిషేక్‌ గుప్తాను:

ఆశ్చర్యపరుస్తూ.. డోపీ అభిషేక్‌ గుప్తాను:

ఇక దులీప్‌ ట్రోఫీలో పాల్గొనే ఇండియా ‘బ్లూ'కు ఫైజ్‌ ఫజల్‌... ‘రెడ్‌'కు అభిమన్యు మిథున్‌... ‘గ్రీన్‌'కు పార్థివ్‌ పటేల్‌ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. దులీప్‌ ట్రోఫీలో పాల్గొనే ఇండియా బ్లూ జట్టులో భరత్‌, అయ్యప్ప.. ఇండియా రెడ్‌ జట్టులో సందీప్‌, పృథ్వీరాజ్‌.. ఇండియా గ్రీన్‌ జట్టులో కర్ణ్‌శర్మ స్థానం దక్కించుకున్నారు. అయితే, డోపింగ్‌లో పట్టుబడి సెప్టెంబరు 14 వరకు నిషేధంలో ఉన్న పంజాబ్‌ కీపర్‌ అభిషేక్‌ గుప్తాను కూడా ‘రెడ్‌'కు ఎంపిక చేయడం ఆశ్చర్యపరుస్తోంది.

Story first published: Tuesday, July 24, 2018, 11:34 [IST]
Other articles published on Jul 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X