న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023 : ఆ ఒక్కడి కోసం మూడు ఫ్రాంచైజీల వేట.. ఎవరి గాలానికి చిక్కుతాడో..?

Three franchises fighting for Dwayne Bravo in Mini Auction

ఐపీఎల్‌లో ట్యాలెంటెడ్ ఆటగాళ్లకు భారీ ధర పలకడం ఖాయం. ఏదైనా దురదృష్టం వల్ల ధర కాస్త అటూ ఇటూ అయినా వాళ్ల కోసం పోటీ మాత్రం విపరీతంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఒక క్వాలిటీ ప్లేయర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ వదులుకోవడం అందరికీ షాకిచ్చింది. 39 ఏళ్ల డ్వేన్ బ్రావోను మినీ వేలానికి ముందు సీఎస్‌కే వదులుకుంది. ప్రస్తుతం అతనికి ఆ టీం ఇచ్చే శాలరీ రూ.4.4 కోట్లు. ఇంత కన్నా తక్కువ ధరకే వేలంలో కొనుక్కోవచ్చని చెన్నై భావించిందేమో తెలీదు. కానీ ఈ వెటరన్ ఆల్‌రౌండర్ కోసం మరో మూడు జట్లు కాచుకొని కూర్చున్నాయి. మరి ఆ జట్లు ఏవో చూస్తే..

 రాజస్థాన్ రాయల్స్

రాజస్థాన్ రాయల్స్

గతేడాది ఫైనల్ వరకూ చేరిన రాజస్థాన్ రాయల్స్‌ జట్టును ఒకసారి అలా చూస్తే చాలు.. సరైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లేడనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ లోటును పూడ్చుకోవడానికి బ్రావో వైపు ఈ ఫ్రాంచైజీ మొగ్గు చూపే అవకాశం ఉంది. మినీ వేలంలో రూ.13.20 కోట్ల పర్సుతో దిగుతున్న రాజస్థాన్.. శామ్ కర్రాన్, బెన్ స్టోక్స్, జేసన్ హోల్డర్ వంటి ఆటగాళ్లను కొనుగోలు చేయడం అసాధ్యమనే చెప్పాలి. ఈ క్రమంలోనే వాల్లు బ్రావో కోసం ప్రయత్నించే అవకాశం ఎక్కువగా ఉంది.

 కోల్‌కతా నైట్ రైడర్స్

కోల్‌కతా నైట్ రైడర్స్

ఒక ప్లాన్ లేని ఖర్చుతో మినీ వేలంలో అతి తక్కువ పర్సుతో బరిలో దిగుతోంది కోల్‌కతా నైట్ రైడర్స్. ఈ జట్టు వద్ద కేవలం రూ.7.05 కోట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో బడా బడా ఆల్‌రౌండర్ల ఊసు కూడా ఎత్తే అవకాశం ఈ ఫ్రాంచైజీకి లేదు. అంతేకాదు, కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో కేకేఆర్‌కే చెందిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టుకు డ్వేన్ బ్రావోనే సారధి. మరి ఆ బంధంతో బ్రావోను కేకేఆర్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే కేకేఆర్ అతన్ని కొనుగోలు చేసినా ఆడే 11 మందిలో చోటు దక్కడం మాత్రం కష్టమే అనిపిస్తోంది.

ముంబై ఇండియన్స్

ముంబై ఇండియన్స్

అసలు ఇదంతా లేకపోతే బ్రావో తన ఐపీఎల్ కెరీర్ ఎక్కడ మొదలైందో అక్కడికే చేరుకోవచ్చు. ముంబై ఇండియన్స్ తరఫున తొలి మూడు సీజన్లలో ఆడిన బ్రావో.. ఆ తర్వాత చెన్నైతో కలిశాడు. ఇప్పుడు ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ రిటైర్‌మెంట్‌తో ముంబైలో ఆ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానంలో బ్రావోను తీసుకోకపోయినా.. బుమ్రా, జోఫ్రా ఆర్చర్‌లకు బ్యాకప్‌గా బ్రావోను తీసుకోవచ్చు. ఎందుకంటే డెత్ ఓవర్లలో బ్రావో అంత అద్భుతంగా బౌలింగ్ చేసే మరో బౌలర్ దొరకడం చాలా కష్టం. మరి వీటిలో ఏ జట్టు బ్రావోను కొనుగోలు చేస్తుందో చూడాలి.

Story first published: Wednesday, November 23, 2022, 16:22 [IST]
Other articles published on Nov 23, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X