న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: రాజస్థాన్ నుంచి ముగ్గురు క్రికెటర్లు

India vs West Indies 2019 : First Time In Team India's History, Three Cricketers From Rajasthan !
Three cricketers from Rajasthan make it into Indian team for the first time ever

హైదరాబాద్: ఆగస్టు 3 నుంచి వెస్టిండిస్‌తో జరగనున్న సిరిస్ కోసం ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ ఆదివారం (జులై 21)న టీమిండియాను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్ లక్ష్యంగా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో గాడితప్పిన మిడిల్ ఆర్డర్‌ను చక్కదిద్దే క్రమంలో విండిస్ టూర్‌కు సెలక్టర్లు జట్టుని ఎంపిక చేశారు.

మీకోసం: ప్రో కబడ్డీ 7వ సీజన్ స్పెషల్ సైట్

ఈ క్రమంలో సెలక్టర్లు పలువురు యువ క్రికెటర్లకు వెస్టిండిస్ పర్యటనలో చోటు కల్పించారు. బ్యాటింగ్‌లో మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్‌ను తీసుకోవడంతో పాటు బౌలింగ్‌లోనూ కొత్తవారికి అవకాశమిచ్చింది. సైన్యంలో సేవలందించేందుకు ధోనీ సెలెక్షన్‌కు దూరం కావడంతో రిషబ్ పంత్‌ను మూడు ఫార్మాట్లలోనూ చోటు దక్కించుకున్నాడు.

విండిస్ పర్యటనకు ఎక్కువ మంది యువ ఆటగాళ్లే

విండిస్ పర్యటనకు ఎక్కువ మంది యువ ఆటగాళ్లే

టెస్టు జట్టులో తెలుగు కుర్రాడు హనుమ విహారి తన స్థానాన్ని కాపాడుకోగా.. ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన రోహిత్ శర్మ మళ్లీ టెస్టుల్లో చోటు దక్కించుకున్నాడు. అయితే, విండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా ఆడే టీ20 సిరిస్‌కు మాత్రం సెలక్టర్లు ఎక్కువ శాతం యువ ఆటగాళ్ల వైపే మొగ్గు చూపారు.

తొలిసారి రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు

తొలిసారి రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు

దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో చక్కటి ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు చోటు కల్పించారు. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు టీమిండియాకు ఎంపికయ్యారు. దేశవాళీ క్రికెట్‌లో రాజస్థాన్ క్రికెట్ ఆసోసియేషన్(ఆర్‌సీఏ)కు ప్రాతినిథ్యం వహిస్తోన్న ఖలీల్ అహ్మద్, దీపర్ చాహర్, రాహుల్ చాహల్‌లు ఎంపికయ్యారు.

2018లో దీపక్ చాహర్ టీ20 అరంగేట్రం

2018లో దీపక్ చాహర్ టీ20 అరంగేట్రం

ఖలీల్ అహ్మద్ ఇప్పటికే ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో నెట్ బౌలర్‌గా తన సేవలను భారత జట్టుకు అందించాడు. 2018లో దీపక్ చాహర్ టీ20 అరంగేట్రం చేశాడు. అయితే, ఈసారి ఖలీల్ అహ్మద్‌తో పాటు... తన కజిన్, లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహార్‌లు సైతం విండిస్ పర్యటనకు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు ఎంపికయ్యారు.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరుపున రాహుల్ చాహర్

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరుపున రాహుల్ చాహర్

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న రాహుల్ చాహర్ ఇండియా-ఏ జట్టు తరుపున మంచి ప్రదర్శన చేశాడు. దీపక్ చాహర్, రాహుల్ చాహర్‌లు తొలిసారి టీమిండియాకు ఎంపికైన సందర్భంలో దీపక్ చాహర్ చెల్లెలు మల్టి టైమ్స్ నౌకి ఇచ్చిన ఇంటర్యూలో "చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం" అని తెలిపారు. విండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. తొలి రెండు టీ20లు అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగనుండగా మిగిలిన మ్యాచ్‌లన్నింటికీ వెస్టిండీస్ అతిథ్యమివ్వనుంది.

వెస్టిండిస్ పర్యటనకు టీమిండియా

టీ20 జట్టు:

కోహ్లీ (కెప్టెన్), రోహిత్ (వైస్ కెప్టెన్), ధావన్, రాహుల్, అయ్యర్, మనీశ్, పంత్(వికెట్ కీపర్), జడేజా, సుందర్, రాహుల్ చహర్, దీపక్ చహర్, భువనేశ్వర్, కృనాల్, ఖలీల్, సైనీ.

వన్డే జట్టు:

కోహ్లీ(కెప్టెన్), రోహిత్ (వైస్ కెప్టెన్), ధావన్, రాహుల్, అయ్యర్, పంత్(వికెట్ కీపర్), మనీశ్, జడేజా, కుల్దీప్, చాహల్, జాదవ్, షమీ, భువనేశ్వర్, ఖలీల్, సైనీ.

Story first published: Monday, July 22, 2019, 16:16 [IST]
Other articles published on Jul 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X