న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ మనిషి ఫిట్‌నెస్ టెస్ట్‌ మాదిరి నన్ను పరిగెత్తించాడు: ధోనికి కోహ్లీ ట్రిబ్యూట్

MS Dhoni 'Made Me Run Like In Fitness Test' : Virat Kohli || Oneindia Telugu
This man, made me run like in a fitness test: Virat Kohli pays tribute to MS Dhoni


హైదరాబాద్: 2016 వరల్డ్ టీ20లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించిన ఫోటోని కెప్టెన్ విరాట్ కోహ్లీ గురువారం అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫోటోలో కోహ్లీతో పాటు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఉన్నాడు. ఈ ఫోటోకు సంబంధించి కోహ్లీ ఓ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.

<strong>యాషెస్ 2019: రాయ్ ఔట్... ఆఖరి టెస్టుకు ఇంగ్లాండ్ రెండు మార్పులు</strong>యాషెస్ 2019: రాయ్ ఔట్... ఆఖరి టెస్టుకు ఇంగ్లాండ్ రెండు మార్పులు

"ఆ మ్యాచ్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ మనిషి ఫిట్‌నెస్ టెస్ట్‌లో పరిగెత్తించినట్టు నన్ను పరిగెత్తించాడు" అంటూ ధోనీని ట్యాగ్ చేస్తూ విరాట్ కోహ్లీ కామెంట్ పెట్టాడు. 2016 వరల్డ్ టీ20లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కి మొహలీ ఆతిథ్యమిచ్చింది. ఈ మ్యాచ్ గురించి కోహ్లీ ట్వీట్ చేశాడు.

ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160

ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. అనంతరం 161 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే తడబడింది. దీంతో టీమిండియా విజయానికి ఆఖరి 6 ఓవర్లలో 67 పరుగులు అవసరమయ్యాయి.

ఓపెనర్లు విఫలం

ఓపెనర్లు విఫలం

ఓపెనర్లు శిఖర్ ధావన్(13), రోహిత్ శర్మ(12) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరగా... సురేశ్ రైనా(10) సైతం నిరాశపరిచాడు. అప్పటికే క్రీజులో కుదురుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నాడు. యువరాజ్ సింగ్ (21) పరుగుల వద్ద ఔట్ కావడంతో క్రీజులోకి ధోని వచ్చాడు.

బౌలింగ్‌కు సహకరిస్తుండడంతో

బౌలింగ్‌కు సహకరిస్తుండడంతో

దీంతో వికెట్ బౌలింగ్‌కు సహకరిస్తుండడంతో ధోనీ, కోహ్లీ సింగిల్స్, డబుల్స్‌పైనే ద‌ృష్టి పెట్టారు. తమ రన్నింగ్‌తో ఆసీస్ ఫీల్డర్లను తికమక పెట్టారు. ఒక ఓవర్‌లో ఏకంగా నాలుగు డబుల్స్ తీశారు. అలా వీరిద్దరూ సింగిల్స్, డబుల్స్ తీస్తూ మధ్య మధ్యలో ఫోర్లు, సిక్సులు బాదడంతో టీమిండియా 19.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

కోహ్లీ 51 బంతుల్లో 82 పరుగులతో నాటౌట్‌

కోహ్లీ 51 బంతుల్లో 82 పరుగులతో నాటౌట్‌

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 51 బంతుల్లో 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరోవైపు ధోని(18 నాటౌట్) అతడికి మద్ధతివ్వడంతో టీమిండియా అలవోక విజయాన్ని నమోదు చేసింది. ఆ మ్యాచ్ ధోనీ, కోహ్లీ ఫిట్‌నెస్‌కు పరీక్ష పెట్టింది. తాజాగా ఆ మ్యాచ్‌ని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు.

Story first published: Thursday, September 12, 2019, 13:56 [IST]
Other articles published on Sep 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X