న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌ చరిత్రలోనే వేగవంతమైన సెంచరీ.. గేల్ విధ్వంసానికి ఏడేళ్లు!!

This day, 7 years ago: Chris Gayle hits fastest hundred in cricket history during IPL

హైదరాబాద్: అనుకున్న ప్రకారం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(ఐపీఎల్‌)-13వ సీజన్‌ ఆరంభం అయ్యుంటే ఇప్పటికీ దాదాపు సగం టోర్నీ పూర్తయుండేది. అయితే మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఇష్టపడే ఐపీఎల్ 2020 నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే. టోర్నీ ఎప్పుడు జరుగుతుందో కచ్చితంగా చెప్పలేం. ఇక లీగ్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఐపీఎల్‌ జరగపోయినా.. ఇదే రోజున వెస్టిండీస్‌ స్టార్‌ క్రికెటర్‌‌ క్రిస్‌ గేల్‌ విధ్వంసం సృష్టించాడు.

<strong>వాన్ సంచలన వ్యాఖ్యలు.. పీటర్సన్ ఐపీఎల్ ధ‌ర‌పై ఇంగ్లండ్ ప్లేయ‌ర్స్ అసూయపడ్డారు!!</strong>వాన్ సంచలన వ్యాఖ్యలు.. పీటర్సన్ ఐపీఎల్ ధ‌ర‌పై ఇంగ్లండ్ ప్లేయ‌ర్స్ అసూయపడ్డారు!!

గేల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్

గేల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్

ఏప్రిల్​ 23, 2013న వెస్టిండీస్ బ్యాట్స్​మన్ క్రిస్ గేల్​ ఐపీఎల్​లో విశ్వరూపాన్ని చూపాడు. ధనాధన్ ఆటతో క్రికెట్ చరిత్రలో వేగవంతమైన శతకాన్ని నమోదు చేసాడు. రాయల్స్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాడు క్రిస్‌ గేల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 30 బంతుల్లో సెంచరీ బాదేశాడు.సెంచరీ సాధించే క్రమంలో ఏడు డాట్‌ బాల్స్‌ మాత్రమే ఉండగా.. 11 సిక్స్‌లు, 8 ఫోర్లు ఉన్నాయి. ఏకంగా 17 సిక్సర్ల సాయంతో 17 5పరుగులు చేసి ఐపీఎల్​లో అత్యధిక స్కోరు రికార్డును నమోదు చేశాడు. గేల్ సృష్టించిన ఆ పరుగుల ఆ విధ్వంసానికి నేటితో ఏడేళ్లు నిండాయి.

 సైమండ్స్‌ రికార్డు బద్దలు

సైమండ్స్‌ రికార్డు బద్దలు

పుణె వారియర్స్​తో జరిగిన ఆ మ్యాచ్​లో క్రిస్ గేల్​ ఎడాపెడా సిక్సర్లు బాదాడు. పుణె బౌలర్లపై విరుచుకుపడి బంతిని బౌండరీలు దాటించాడు. 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రికెట్ చరిత్రలో ఇదే అత్యంత వేగవంతమైన శతకం. 2004లో ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్రూ సైమండ్స్‌ ​ 34 బంతులకే సెంచరీ చేయగా.. ఆ రికార్డును గేల్ బద్దలు కొట్టాడు. శతకం తర్వాత కూడా రెచ్చిపోయిన గేల్.. మొత్తంగా 66 బంతుల్లో 17 సిక్సర్లు, 13 ఫోర్లతో 175 పరుగులు చేయడంతో బెంగళూరు మూడు వికెట్లకు 263పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు:

ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు:

అనంతరం బౌలింగ్​లోనూ మెరిగిన క్రిస్ గేల్.. ఐదు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. మొత్తంగా పుణె 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులే చేయగలిగింది. దీంతో బెంగళూరు ఏకంగా 130 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. గేల్‌ సాధించిన 175 పరుగులు కూడా ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటికీ అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. గతంలో ఆర్సీబీకి ఆడిన యూనివర్స్‌ బాస్‌ గేల్‌.. ఆపై కింగ్స్‌ పంజాబ్‌కు వెళ్ళిపోయాడు.

45 ఏళ్ల వరకు కొనసాగుతా:

45 ఏళ్ల వరకు కొనసాగుతా:

గతంలో ఓ స్పోర్ట్స్ ఛానెల్‌తో గేల్ మాట్లాడుతూ... 'ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా అనేక లీగ్‌ మ్యాచ్‌లు ఆడుతున్నా. ఎందుకంటే ఆటకు నేను చేయాల్సింది చాలా ఉందని నా నమ్మకం. అందుకు నా శరీరం కూడా సహకరిస్తుంది. ఇందుకు చాలా సంతోషంగా ఉన్నా. రోజులు గడిచేకొద్ది నేను యవ్వనంగా మారుతున్నా' అని గేల్‌ అన్నాడు. నేను ఆడితే చూడాలని చాలా మంది అభిమానులు ఆశిస్తున్నారు. నాక్కూడా క్రికెట్‌పై ఇంకా ఇష్టం పోలేదు. 45 అనేది మంచి సంఖ్య. 45 ఏళ్ల వరకు కొనసాగితే బాగుంటుంది. నాకు ఆటపట్ల ప్రేమ, అభిరుచి, అంకితభావం ఉన్నాయి. వీలైనంత కాలం కొనసాగడానికి ప్రయత్నిస్తా' అని తెలిపాడు.

Story first published: Thursday, April 23, 2020, 15:45 [IST]
Other articles published on Apr 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X