న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsNZ : తొలి టీ20లో ఈ సీన్స్ చూసి.. ఫ్యాన్స్ కూడా షాక్!

These scenes from Team India loss made a buzz in fans

కివీస్‌పై వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు.. టీ20 సిరీస్‌ను కూడా అదే జోరులో ప్రారంభించాలని అనుకుంది. కానీ రాంచీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అందరి అంచనాలు తలకిందులు అయ్యాయి. ఈ మ్యాచ్‌లో సమిష్టిగా రాణించిన న్యూజిల్యాండ్ జట్టు చివరకు విజయం సాధించింది. ఈ మ్యాచ్ సమయంలో మూడు ఘటనలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాయి. అవేంటంటే..

వాషింగ్టన్ అదిరే క్యాచ్

వాషింగ్టన్ అదిరే క్యాచ్

ఈ మ్యాచ్‌లో కివీస్‌కు మంచి ఆరంభం లభించింది. ఫిన్ అలెన్ అద్భుతంగా ఆడాడు. ఇలాంటి సమయంలో వాషింగ్టన్ సుందర్ అతన్ని అవుట్ చేశాడు. అయితే ఆ తర్వాత వచ్చిన మార్క్ చాప్‌మాన్‌ను సుందర్ అవుట్ చేసిన తీరు అభిమానులకు చాలా అంటే చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. సుందర్ అద్భుతంగా వేసిన బంతులను ఆడటంలో చాప్‌మాన్ ఫెయిలయ్యాడు. ఆ మరుసటి బంతిని స్ట్రైట్‌గా ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి వేగం అతన్ని బురిడీ కొట్టించింది. దీంతో గాల్లోకి లేచిన బంతిని సుందర్ వేగంగా స్పందించి డైవింగ్ క్యాచ్‌తో అతన్ని పెవిలియన్ పంపాడు.

 అర్షదీప్ నోబాల్

అర్షదీప్ నోబాల్

శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో ఒకదాని తర్వాత ఒకటిగా నోబాల్స్ వేసి విమర్శలపాలైన యువపేసర్ అర్షదీప్ సింగ్ మరోసారి అదే తప్పు చేశాడు. 19 ఓవర్లలో 149 పరుగులు చేసిన కివీస్‌ను 160 పరుగుల లోపే కట్టడి చేసే అవకాశం అతనికి లభించింది. ఇలాంటి సమయంలో 20వ ఓవర్ వేసిన అర్షదీప్ తొలి బంతికే నోబాల్ వేశాడు. దాన్ని డారియల్ మిచెల్ సిక్సర్‌గా మలిచాడు. ఇది చూసిన అభిమానులు షాకయ్యారు. కుర్చీల్లో నుంచి లేచి నిలబడి తలలు పట్టుకున్నారు. ఈ ఓవర్లో అర్షదీప్ ఏకంగా 27 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం.

సూర్యకుమార్ వికెట్

సూర్యకుమార్ వికెట్

ఈ మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ ఘోరంగా ఫెయిలైంది. దీంతో 15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియాను సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు. వీళ్లిద్దరూ క్రీజులో ఉండగా భారత్ ఈ మ్యాచ్ గెలిచేలా కనిపించింది. పిచ్ కూడా కొంచెం కష్టంగా ఉండటంతో టైం తీసుకొని కుదురుకున్నాడు సూర్య. ఈ క్రమంలోనే ఐష్ సోధి వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయి లాంగాఫ్‌లో చిక్కాడు. ఆ షాట్ ఆడటం ఎంత పొరపాటో సూర్యకు కూడా అర్థమైంది. అతని మొఖం చూస్తే ఆ విషయం అందరికీ తెలిసిపోయింది. ప్రేక్షకులకు కూడా సూర్య అవుటవడంతో మ్యాచ్‌పై ఆశలు ఆవిరయ్యాయి.

Story first published: Saturday, January 28, 2023, 8:08 [IST]
Other articles published on Jan 28, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X