న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ, రోహిత్ అనుమతితోనే: ధోనిపై వేటుకు గల అసలు కారణం

The tricky road ahead for MS Dhoni till ICC World Cup 2019 in England

హైదరాబాద్: విండిస్‌తో జరిగే మూడు టీ20ల సిరిస్ నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని తప్పించడంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వెస్టిండీస్‌తో నవంబర్ 4 నుంచి మొదలయ్యే మూడు టీ20ల సిరీస్‌తో పాటు ఆస్ట్రేలియాతో నవంబరులో జరగనున్న టీ20 సిరీస్‌ కోసం ఎమ్మెస్కే ప్రసాద్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ శుక్రవారం భారత జట్టుని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

ధోనీపై వేటు వేసిన సెలక్టర్లు

ధోనీపై వేటు వేసిన సెలక్టర్లు

ఈ జట్టులో ధోనీపై వేటు వేసిన సెలక్టర్లు అతని స్థానంలో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ని ఎంపిక చేయడంతో పాటు రెండో వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తీక్‌కి అవకాశం ఇచ్చారు. దీంతో టీ20ల్లో ధోని కెరీర్‌ ముగిసినట్టేనని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధోనిపై వేటు గురించి బీసీసీఐ అధికారి ఒకరు తాజాగా మీడియాతో మాట్లాడారు.

ప్రత్యామ్నాయ వికెట్ కీపర్‌ని సిద్ధం చేసుకోవాలనే

ప్రత్యామ్నాయ వికెట్ కీపర్‌ని సిద్ధం చేసుకోవాలనే

"ఆస్ట్రేలియా వేదికగా 2020లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో ధోనీ ఆడే అవకాశాలు లేవు. అందుకే.. ఇప్పటి నుంచే జట్టులో ప్రత్యామ్నాయ వికెట్ కీపర్‌ని సిద్ధం చేసుకోవాలని జట్టు మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. ఈ కారణం కారణంగా ఇకపై టీ20ల్లో ధోనీని ఎంపిక చేయకపోవచ్చు" అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

కెప్టెన్, వైస్ కెప్టెన్ అనుమతితోనే ధోనిపై వేటు

కెప్టెన్, వైస్ కెప్టెన్ అనుమతితోనే ధోనిపై వేటు

శుక్రవారం టీ20 జట్టుని ప్రకటించడానికి ముందు సెలక్టర్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలతో చర్చించారు. వారికి తెలియకుండా.. వారి అనుమతి తీసుకోకుండా.. ధోనిపై వేటు వేసే సాహం సెలక్టర్లకు ఉంటుందని నేను అనుకోవడం లేదు" అని ఆయన తెలిపారు.

2014లో టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన ధోని

2014లో టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన ధోని

2014లో టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ఆ తర్వాత నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రెగ్యులర్ వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నాడు. వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్‌లో ధోని ఆడటంపై సెలక్టర్లు ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చారు. ఇలాంటి సమయంలో ధోనిని టీ20 జట్టు నుంచి తప్పించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.

Story first published: Saturday, October 27, 2018, 17:27 [IST]
Other articles published on Oct 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X