న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లార్డ్స్‌లో చిరస్మరణీయ విజయాలను నమోదు చేసిన టీమిండియా

By Nageshwara Rao
Team Indias Test record at Lords

హైదరాబాద్: లార్డ్స్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌, భారత జట్ల మధ్య గురువారం ప్రారంభం కావాల్సిన రెండో టెస్టుకు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో టాస్ ఆలస్యంగా పడనుంది. వర్షం కారణంగా మైదానం సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. దీంతో ఆటగాళ్లు డ్రస్సింగ్‌ రూమ్‌కే పరిమితమయ్యారు.

కాగా, భారత క్రికెట్‌ చరిత్రలో లార్డ్స్ స్టేడియానికి ఉన్న ప్రత్యేకత వేరు. అలాంటి ప్రఖ్యాత లార్డ్స్‌ క్రికెట్ గ్రౌండ్‌లో టీమిండియా ట్రాక్ రికార్డ్ అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, భారత జట్టు మాత్రం కొన్ని అరుదైన విజయాలు నమోదు చేసింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన తొలి టెస్టును ఇంగ్లండ్ కైవసం చేసుకుంది.

దీంతో లార్డ్స్ టెస్టులో గెలవడం ద్వారా సిరీస్‌ను సమం చేయాలని టీమిండియా కెప్టెన్ కోహ్లీ భావిస్తున్నాడు. లార్డ్స్ స్టేడియంలో టీమిండియా కొన్ని చిరస్మరణీయ విజయాలను నమోదు చేసింది. ఇదే లార్డ్స్ వేదికగా జూన్ 25, 1983లో వెస్టిండీస్ జట్టును ఓడించి కపిల్ దేవ్ నాయకత్వంలోని భారత జట్టు ప్రపంచకప్ నెగ్గింది.

1
42375

ఈ ఘటన ప్రపంచ క్రికెట్‌లో భారత దృక్పధాన్ని పూర్తిగా మార్చివేసింది. అయితే, లార్డ్స్‌ వేదికగా జరిగిన టెస్ట్‌ల్లో మాత్రం టీమిండియా ప్రదర్శన పేలవంగా ఉంది. 1932 నుండి 2014 వరకూ లార్డ్స్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో 17 టెస్ట్‌లు ఆడిన భారత్ కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది.

11 మ్యాచ్‌ల్లో ఓడి, 4 మ్యాచ్‌లు డ్రా చేసుకుంది. చివరిసారిగా 2014లో టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటించినప్పుడు ఆతిథ్య ఇంగ్లాండ్‌పై ఇదే స్టేడియంలో ధోని సేన టెస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు.

74 పరుగులిచ్చి 7 వికెట్లు తీసి ఇషాంత్ శర్మ తన కెరీర్ బెస్ట్ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. ఇదిలా ఉంటే లార్డ్స్‌లో టీమిండియా గణాంకాలు ఇలా ఉన్నాయి.

లార్డ్స్‌లో టీమిండియా గణాంకాలివే:
* 1932: LOST 158 RUNS
* 1936: LOST 9 WKTS
* 1946: LOST 10 WKTS
* 1952: LOST 8 WKTS
* 1959: LOST 8 WKTS
* 1967: LOST INNS AND 124 RUNS
* 1971: DRAWN
* 1974: LOST INNS AND 285 RUNS
* 1979: DRAWN
* 1982: LOST 7 WKTS
* 1986: WON 5 WKTS
* 1990: LOST 247 RUNS
* 1996: DRAWN
* 2002: LOST 170 RUNS
* 2007: DRAWN
* 2011: LOST 196 RUNS
* 2014: WON 95 RUNS

Story first published: Thursday, August 9, 2018, 18:16 [IST]
Other articles published on Aug 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X