న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘18’ నంబర్‌ జెర్సీనే ఎందుకంటే!: కొత్త జెర్సీ ఆవిష్కరణలో కోహ్లీ వెల్లడి

Team India's New Limited-Overs Jersey Unveiled For ICC World Cup | Oneindia Telugu
Team Indias new limited-overs jersey for ICC World Cup unveiled - Watch

హైదరాబాద్: రాబోయే రోజుల్లో టీమిండియా ధరించే కొత్త జెర్సీని శుక్రవారం ఆవిష్కరించారు. ఇంగ్లాండ్ వేదికగా ఈ ఏడాది మేలో మొదలయ్యే వన్డే వరల్డ్‌కప్ కోసం ప్రత్యేకంగా ఈ జెర్సీలు రూపొందించారు. శనివారం నుంచి ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌తో పాటు రాబోయే వన్డే ప్రపంచ కప్‌లో కూడా భారత ఆటగాళ్లు ఇదే జెర్సీని ధరిస్తారు.

ఐపీఎల్ ఆధారంగా వరల్డ్‌కప్‌లో ఆటగాళ్ల ఎంపిక ఉండదు: కోహ్లీఐపీఎల్ ఆధారంగా వరల్డ్‌కప్‌లో ఆటగాళ్ల ఎంపిక ఉండదు: కోహ్లీ

శుక్రవారం పార్క్ హయత్ హోటల్ వేదికగా జరిగిన జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో కెప్టెన్ కోహ్లీతో పాటు ధోనీ, రహానే, పృథ్వీషా, మహిళల టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్, జెమీమా రోడ్రిగ్స్ పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. గతంలోలాగే రీసైకిల్డ్‌ మెటీరియల్‌తో 'నైకీ' దీనిని తయారు చేసింది. కొత్త జెర్సీలో రెండు రకాల బ్లూ షేడ్స్‌ ఉన్నాయి.

గత జెర్సీతో పోలిస్తే

గత జెర్సీతో పోలిస్తే

గత జెర్సీతో పోలిస్తే ఒక ప్రధానమైన మార్పు కొత్తదాంట్లో కనిపించింది. కాలర్ వెనుక నారింజ రంగు షేడ్ ఇచ్చారు. చాతి పైన కుడివైపు నైకీ సింబల్, ఎడమవైపు బీసీసీఐ లోగో ఉంది. ప్రధాన స్పాన్సర్ ఒప్పో ఇండియా అని పెద్ద అక్షరాల్లో కనిపిస్తోంది. మూడు ప్రపంచకప్‌ల గెలుపునకు సంకేతంగా ఇప్పటి వరకు ఎదపై కనిపించిన మూడు ‘స్టార్లు' ఇకపై కాలర్‌ లోపలి వైపు కనిపించేలా ముద్రించారు.

ఆ మూడు వరల్డ్‌ కప్‌ విజయాలు

ఆ మూడు వరల్డ్‌ కప్‌ విజయాలు

పైగా తొలిసారి ఆ మూడు వరల్డ్‌ కప్‌ విజయాల (1983, 2007, 2011) తేదీలు, ఫైనల్‌ మ్యాచ్‌ల్లో భారత్‌ చేసిన స్కోర్లను కూడా దానిపై ముద్రించారు. దీంతో పాటు ఆ మూడు ఫైనల్స్‌ వేదికలు లార్డ్స్, వాండరర్స్, వాంఖడే మైదానాల భౌగోళిక స్థితి (అక్షాంశాలు-రేఖాంశాలు) కూడా దీనిపై ముద్రించడం విశేషం. జెర్సీని ధరించిన ఆటగాళ్లు తమ తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు.

ధోనీ మాట్లాడుతూ

ధోనీ మాట్లాడుతూ

ఈ సందర్భంగా ధోనీ మాట్లాడుతూ "ఈ జెర్సీని చూస్తుంటే ఘనమైన వారసత్వం గుర్తుకొస్తోంది. 1983లో కపిల్‌దేవ్ తొలిసారి భారత్‌కు ప్రపంచకప్ అందించినప్పుడు మేమంతా చాలా చిన్నవాళ్లం. వాళ్లను ఆదర్శంగా తీసుకుంటూ ఈ స్థాయికి ఎదిగాం. రెండు ప్రపంచ కప్‌లు గెలుచుకోవడం, అన్ని ఫార్మాట్లలో నెంబర్‌ వన్‌గా నిలవడం, ఇవన్నీ మాలో ఎంతో ప్రేరణ కలిగిస్తాయి" అని అన్నాడు.

ఘనమైన వారసత్వాన్ని భవిష్యత్‌ తరాలకు అందజేస్తున్నాం

"ఈ ఘనమైన వారసత్వాన్ని భవిష్యత్‌ తరాలకు అందజేస్తున్నాం. 2007లో టీ20 వరల్డ్‌కప్, 2011లో వన్డే వరల్డ్‌కప్... ప్రతి సందర్భం అద్భుతం. జెర్సీ ధరించి జాతీయ జట్టుకు ఆడటమనేది ప్రతి ఒక్కరి కల. గత వరల్డ్‌కప్‌లు మాదిరే 2019 టోర్నీ చిరస్మరణీయంగా నిలువాలని కోరుకుంటున్నాం" అని ధోని అన్నాడు.

మరింత ఫిట్‌గా మారానన్న ధోని

ఇటీవలి కాలంలో తాను మరింత ఫిట్‌గా మారినట్లు ధోని చెప్పుకొచ్చాడు. "నా శరీరాన్ని మరింత ఫిట్‌గా ఉంచుకునేందుకు శ్రమించాను. ఇప్పటి వరకు గీఔ సైజు జెర్సీతో భారీగా కనిపించేవాడిని. ఇప్పుడు అది ఔకు మారింది. ఇకపై దీనిని కొనసాగిస్తా" అని ధోని చెప్పుకొచ్చాడు.

విరాట్ కోహ్లీ మాట్లాడుతూ

విరాట్ కోహ్లీ మాట్లాడుతూ

ఇక, కెప్టెన్ విరాట్ కోహ్లీ తాను చాలా కాలంగా ఔ వాడుతున్నానని, అది ఇకపై మారదని సరదాగా వ్యాఖ్యానించాడు. 2008 అండర్‌-19 వరల్డ్ కప్‌లో తాను అడగకుండానే ‘18' నంబర్‌ జెర్సీ ఇచ్చారని... వరల్డ్‌‌కప్‌ గెలుచుకోవడంతో పాటు తర్వాతా కలిసి రావడంతో అదే నంబర్‌ను కొనసాగించాను తప్ప ప్రత్యేక కారణమేదీ లేదని విరాట్ కోహ్లీ తెలిపాడు.

Story first published: Saturday, March 2, 2019, 10:33 [IST]
Other articles published on Mar 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X