న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విశాఖలో టీమిండియా: మరో రికార్డుపై కన్నేసిన కోహ్లీ, విశేషాలివే

Team India reaches Vizag for 2nd ODI, Virat Kohli on cusp of another world record

విశాఖటపట్నం: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా వెస్టిండిస్ జట్టుతో బుధవారం జరగనున్న రెండో వన్డే కోసం టీమిండియా సోమవారం ఉదయం విశాఖకు చేరుకుంది. తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి అభిమానులు తరలి వచ్చారు. బస్సుల్లోకి ఎక్కడానికి ముందు క్రికెటర్లను ఫొటోలు తీసుకున్నారు.

లంక క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్, ఆమోదం తెలిపిన బీసీసీఐ లంక క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్, ఆమోదం తెలిపిన బీసీసీఐ

అనంతరం గట్టి బందోబస్తు మధ్య ఇరుజట్ల ఆటగాళ్లను బీచ్ రోడ్డు సమీపంలోని ఫైవ్ స్టార్ హోటల్‌కు తరలించారు. స్టేడియంతో పాటు క్రికెటర్లు ప్రయాణించే మార్గాల్లో సెక్యూరిటీని మరింత పటిష్ఠం చేశారు. తొలి వన్డేలో అద్భుత విజయం సాధించిన టీమిండియా విశాఖలోనూ విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యాన్ని పెంచుకోవాలని చూస్తోంది.

1
44267
కెప్టెన్ విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు

కెప్టెన్ విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు

విశాఖలో కెప్టెన్ విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన నాలుగు వన్డేల్లో కోహ్లీ వరుసగా 118, 117, 99, 65 పరుగులు చేశాడు. అయితే, ఈ వేదికలో జరిగిన ఏకైక టి20లో మాత్రం కోహ్లీ ఆడలేదు. 2016లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టులోనూ విరాట్‌ కోహ్లి రెండు ఇన్నింగ్స్‌లలో 167, 81 పరుగులు సాధించి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా నిలిచాడు.

 13 ఏళ్ల క్రితం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై

13 ఏళ్ల క్రితం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై

ఇక, విశాఖపట్నం అనగానే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ఠక్కున గుర్తుకువస్తాడు. 13 ఏళ్ల క్రితం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై ధోని చేసిన విధ్వంసం ఇప్పటికీ అభిమానులకు గుర్తే. వ్యక్తిగతంగానే కాకుండా ఫలితాల పరంగా టీమిండియాకు దీనిని కలిసొచ్చిన వేదికగా చెప్పవచ్చు. 2005 ఏప్రిల్‌ 5 నుంచి 2017 డిసెంబర్‌ 17 వరకు ఇక్కడ 7 వన్డేలు జరిగాయి.

 కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో ఓడిన టీమిండియా

కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో ఓడిన టీమిండియా

ఇందులో ఆరింట విజయం సాధించిన టీమిండియా కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో ఓడింది. పాకిస్థాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, న్యూజిలాండ్‌లను ఒక్కోసారి ఓడించిన భారత్, శ్రీలంకపై రెండు సార్లు విజయం సాధించింది. ఒకసారి మాత్రం విండీస్‌ చేతిలో ఓటమి పాలైంది. ఐదేళ్ల క్రితం తమపై గెలుపొందిన ప్రత్యర్థితోనే బుధవారం మరో మ్యాచ్‌లో భారత్‌ తలపడనుంది.

 డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన వన్డే విశేషాలు:

డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన వన్డే విశేషాలు:

* 2005లో పాకిస్తాన్‌పై ధోని 123 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 148 పరుగులు సాధించాడు. ధోని కెరీర్‌లో ఇది ఐదో మ్యాచ్‌ కాగా... ధోని సాధించిన తొలి సెంచరీ ఇక్కడే చేశాడు.

* 2007లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మహరూఫ్‌ వేసిన 41వ ఓవర్లో యువరాజ్‌ సింగ్‌ వరుసగా 4 4 0 6 4 4 బాది మ్యాచ్‌ను గెలిపించాడు.

ధావన్, మిచెల్ స్టార్క్ తొలి మ్యాచ్ ఆడింది ఇక్కడే

ధావన్, మిచెల్ స్టార్క్ తొలి మ్యాచ్ ఆడింది ఇక్కడే

* భారత్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్, ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్‌ మిషెల్‌ స్టార్క్‌ 2010లో ఇక్కడే తమ తొలి మ్యాచ్‌ ఆడారు. ధావన్‌ 2 బంతులు ఆడి ‘డకౌట్‌' కాగా, స్టార్క్‌ ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు.

* 2011లో జరిగిన వన్డేలో వెస్టిండీస్‌ పదో నంబర్‌ ఆటగాడు రవి రాంపాల్‌ 66 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 86 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వన్డేల్లో పదో స్థానంలో ఒక బ్యాట్స్‌మన్‌ సాధించిన అత్యధిక స్కోరు రికార్డు ఇదే.

2 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించిన వెస్టిండిస్

2 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించిన వెస్టిండిస్

* 2013లో జరిగిన వన్డేలో వెస్టిండీస్‌ 2 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో నలుగురు విండీస్‌ ఆటగాళ్లు హాఫ్ సెంచరీలు సాధించారు. ధోని తన కెరీర్‌లో 50వ హాఫ్ సెంచరీని ఈ మ్యాచ్‌లో నమోదు చేశాడు. మంచు కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా మూడు సార్లు బంతిని మార్చాల్సి రావడం భారత్‌కు ప్రతికూలంగా మారింది.

* 2016లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో అమిత్‌ మిశ్రా 18 పరుగులకే 5 వికెట్లు తీశాడు. న్యూజిలాండ్ వన్డే చరిత్రలో అతి తక్కువ ఓవర్లలో (23.1) ఆలౌటైంది.

Story first published: Tuesday, October 23, 2018, 12:50 [IST]
Other articles published on Oct 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X