న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధర్మశాలలో టీమిండియా నెట్ ప్రాక్టీస్: నిల్చొని చూస్తున్న రవిశాస్త్రి

By Nageshwara Rao
Team india practice session at HPCA stadium in Dharamsala on Friday

హైదరాబాద్: మూడు వన్డేల సిరిస్‌‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే డిసెంబర్ 10న ధర్మశాల వేదికగా జరగనుంది. ఈ వన్డే కోసం ఇరు జట్లు ఇప్పటికే ధర్మశాలకు చేరుకున్నాయి. టెస్టు సిరిస్‌ను 1-0తో కైవసం చేసుకున్న భారత్ ఇప్పుడు వన్డే సిరిస్‌ను కూడా కైవసం చేసుకోవాలని ఊవిళ్లూరుతోంది.

ఇందులో భాగంగా శుక్రవారం హిమాచల్ ప్రదేశ్ స్టేడియంలో భారత జట్టులోని ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించారు. శుక్రవారం జరిగిన నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో భారత జట్టు బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, అక్షర పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజవేంద్ర చాహల్, హార్దిక్ పాండ్యాలు బంతులు విసిరారు.

ఈ నెట్ ప్రాక్టీస్‌కి టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి కూడా హాజరయ్యారు. నెట్ ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. ఇదిలా ఉంటే భారత్-శ్రీలంక జట్ల మధ్య జరగనున్న ఈ పరిమిత ఓవర్ల సిరిస్‌కు రెగ్యలర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ విశ్రాంతినిచ్చింది.

విరాట్ కోహ్లీ స్ధానంలో రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. శ్రీలంకతో జరగనున్న మూడు వన్డేల సిరిస్‌తో పాటు మూడు టీ20ల సిరిస్‌ నుంచి కోహ్లీ తప్పుకున్నాడు.

శ్రీలంకతో వన్డే సిరిస్‌కు టీమిండియా:

Rohit Sharma (Captain), Shikhar Dhawan, Ajinkya Rahane, Shreyas Iyer, Manish Pandey, Kedar Jadhav, Dinesh Karthik, MS Dhoni (WK), Hardik Pandya, Axar Patel, Kuldeep Yadav, Yuzvendra Chahal, Jasprit Bumrah, Bhuvneshwar Kumar, Siddarth Kaul

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 8, 2017, 17:41 [IST]
Other articles published on Dec 8, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X