న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Team India : సూర్యకుమార్‌పై మరీ ఎక్కువగా ఆధార పడుతున్న టీమిండియా..!

Team India is too dependent on Suryakumar Yadav in T20Is

టీమిండియా సూపర్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ తన అరంగేట్రం నుంచే టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్నాడు. మొత్తం 46 టీ20 మ్యాచులు ఆడిన అతను 46.42 సగటుతో 1625 పరుగులు చేశాడు. ఇక గతేడాది అయితే అతను ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గతేడాది అంతర్జాతీయ టీ20ల్లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మొత్తం 31 మ్యాచుల్లో 46.56 సగటుతో 1164 పరుగులు చేశాడు. గతేడాది అతని స్ట్రైక్ రేటు కూడా 180పైగానే ఉంది. అతని ఫామ్ చూస్తే సూర్యకుమార్‌పై ఈ ఫార్మాట్లో టీమిండియా మరీ ఎక్కువగా ఆధారపడుతున్నట్లు కనిపిస్తోంది. దానికి కారణాలివే..

భారత్ విజయాల్లో రికార్డు..

భారత్ విజయాల్లో రికార్డు..

టీమిండియా గెలిచిన మ్యాచుల్లో సూర్యకుమార్ రికార్డు చూస్తే.. భారత్ అతనిపై ఎంతలా ఆధారపడుతుందో తెలిసిపోతుంది. అరంగేట్రం నుంచి అతను భారత్ గెలిచిన 34 మ్యాచుల్లో ఆడాడు. వీటిలో 51.82 సగటుతో 1192 పరుగులు చేశాడు. వీటిలో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక భారత్ ఓడిన 11 మ్యాచుల్లో 38.18 సగటుతో 420 పరుగులు మాత్రమే చేయగలిగాడు. గతేడాది ఆసియా కప్‌లో పాకిస్తాన్, శ్రీలంకపై అతను 13, 34 పరుగులు మాత్రమే చేశాడు. ఆయా మ్యాచుల్లో కోహ్లీ, రోహిత్ హాఫ్ సెంచరీలు చేసినా భారత్ గెలవలేకపోయింది.

 కోహ్లీ ఒక్కడే..

కోహ్లీ ఒక్కడే..

సూర్య జట్టుకు ఎంత ముఖ్యమో చెప్పే మరో విషయం ఇది. గతేడాది సూర్య తర్వాత భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ విరాట్ కోహ్లీ. అతను 20 మ్యాచుల్లో 781 పరుగులు చేశాడు. మరెవరూ కనీసం 700 పరుగులు కూడా చేయలేకపోయారు. వీటిలో కోహ్లీ ఒక సెంచరీతోపాటు, 8 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. ఆ తర్వాత బెస్ట్ బ్యాటర్ రోహిత్ శర్మ. అతను 29 మ్యాచుల్లో 656 పరుగులు చేశాడు. ఈ లెక్కలు చూస్తేనే సూర్యకుమార్‌పై టీమిండియా ఎంత ఎక్కువగా ఆధార పడుతుందో అర్థం అవుతోంది.

టీ20 వరల్డ్ కప్ ఎగ్జాంపుల్..

టీ20 వరల్డ్ కప్ ఎగ్జాంపుల్..

సూర్యకుమార్‌పై భారత్ ఎక్కువగా ఆధార పడుతుందని చెప్పే మరో పెద్ద ఉదాహరణ.. టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్‌లో సూర్యకుమార్ అవుటైన తర్వాత భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. ఆ మ్యాచ్‌లో సూర్యకుమార్ 10 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. కోహ్లీ, హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీలు చేసినా ఆ మ్యాచ్ ఫలితం మాత్రం భారత్‌కు అనుకూలంగా రాలేదు. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై భారత్ భారీ స్కోరు చేయడంలో విఫలమవగా.. ఇంగ్లండ్ ఓపెనర్లే లక్ష్యాన్ని ఛేదించేశారు.

Story first published: Sunday, January 29, 2023, 15:21 [IST]
Other articles published on Jan 29, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X