టీమిండియా క్రికెటర్లకు బంపర్ ఆఫర్.. రెట్టింపైన డీఏ!!

Indian Cricket Team’s Daily Allowance Doubled For Overseas Tours
Team India and coaching staffs daily allowances doubled for overseas tours

ముంబై: విదేశాల్లో పర్యటించే టీమిండియా క్రికెటర్లకు, సిబ్బందికి క్రికెట్‌ పరిపాలక కమిటీ (సీఓఏ) బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. విదేశాల్లో పర్యటించే టీమిండియా ఆటగాళ్లతో పాటు సపోర్టింగ్‌ స్టాఫ్‌కు ఇచ్చే డీఏని (డైలీ అలవెన్స్‌) రెట్టింపు చేసినట్టు ఓ జాతీయ మీడియా తన ప్రకటనలో పేర్కొంది. ఆ మీడియా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

పంత్‌కు కోహ్లీ కోచ్‌ హెచ్చరిక: ఇది అత్యున్నత సమయం.. చాలా జాగ్రత్తగా ఉండాలి!!

రెట్టింపైన డీఏ:

రెట్టింపైన డీఏ:

ఇప్పటివరకూ విదేశాల్లో పర్యటించే భారత ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి డైలీ అలవెన్స్‌ 125 డాలర్లు (రూ. 8,899.65) చెల్లించేవారు. ఇకపై ఆ మొత్తాన్ని రెట్టింపు చేస్తూ.. 250 డాలర్లు (రూ. 17,799.30) చెల్లించే విధంగా సీఓఏ నిర్ణయించిందట. అంతేకాకుండా ట్రావెలింగ్‌ అలవెన్స్‌లను కూడా భారీగా పెంచినట్లు సమాచారం. విదేశీ పర్యటనల ప్రయాణ ఖర్చులు బిజినెస్‌ క్లాస్‌కి మించి పెరిగాయట. ఆటగాళ్ల, సిబ్బంది వసతులు, ఇతరత్ర సౌకర్యాలను బీసీసీఐ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తుంది.

రవిశాస్త్రి జీతం పెంపు:

రవిశాస్త్రి జీతం పెంపు:

ఇప్పటికే కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, హెడ్ కోచ్‌ రవిశాస్త్రి డిమాండ్‌ మేరకు ఆటగాళ్ల, సిబ్బంది జీతాలను సీఓఏ భారీగా పెంచిన విషయం తెలిసిందే. వీరి డిమాండ్‌ మేరకు టాప్‌ క్లాస్‌ ప్లేయర్స్‌కు ఏ+ అనే కేటగిరీ ఏర్పాటు చేసి.. వారి వార్షిక జీతాన్ని రూ 7 కోట్లకు పెంచారు. తాజాగా రవిశాస్త్రి జీతం కూడా పెరిగింది. దాదాపు అతనికి 10 కోట్ల వరకు అందనుందని తెలిసింది.

 విదేశీ పర్యటనలు లేవు:

విదేశీ పర్యటనలు లేవు:

ఇక ప్రపంచ టెస్టు చాంపియన్‌ షిప్‌లో భాగంగా ఇప్పటికే వెస్టిండీస్‌లో పర్యటించిన టీమిండియా వచ్చే ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. అంటే ఈ ఏడాది టీమిండియాకు విదేశీ పర్యటనలు దాదాపు లేవు. 2020 ఆరంభంలో భారత జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఇటీవలి కాలంలో కోహ్లీ సారథ్యంలో భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ.. విదేశీ పర్యటనల్లో విజయాలు అందుకుంటుంది. ఈ నేపథ్యంలో తదుపరి వరసలో న్యూజిలాండ్‌ ఉంది.

క్లీన్‌స్వీప్‌పై కన్ను:

క్లీన్‌స్వీప్‌పై కన్ను:

ఇటీవలే వెస్టిండీస్‌లో పర్యటించిన టీమిండియా అక్కడ టీ20, వన్డే సిరీస్‌లతో పాటు 2-0తో టెస్టు సిరీస్‌ సొంతం చేసుకుంది. అదే ఊపులో సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌ను కూడా ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ రోజు రాత్రి 7 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఆఖరి మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ 2-0తో కైసవం చేసుకోవాలని చూస్తోంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, September 22, 2019, 16:42 [IST]
Other articles published on Sep 22, 2019
POLLS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more