న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ వార్తల్లో నిజం లేదు, వరల్డ్‌కప్ అర్హతే ప్రధాన లక్ష్యం: మిథాలీ రాజ్

Team Focused On Getting Direct Entry To 2021 World Cup,Says Mithali Raj | Oneindia Telugu
Team focused on getting direct entry into 2021 World cup: Mithali Raj

హైదరాబాద్: టీ20 ఫార్మాట్‌కు తాను వీడ్కోలు పలకనున్నట్లు వచ్చిన వార్తలపై భారత మహిళల జట్టు వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ ఖండించారు. ఆ వార్తల్లో నిజం లేదని, ఇప్పట్లో టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికే యోచన లేదని మిథాలీ గురువారం వెల్లడించారు. ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా శుక్రవారం ఇంగ్లాండ్‌తో తొలి వన్డే ప్రారంభం కానున్న నేపథ్యంలో మిథాలీ మీడియాతో మాట్లాడారు.

<strong>9 Ducks, 9 All Out: మిజోరాం జట్టు అత్యంత చెత్త ప్రదర్శన ఇది!</strong>9 Ducks, 9 All Out: మిజోరాం జట్టు అత్యంత చెత్త ప్రదర్శన ఇది!

"టీ20ల నుంచి రిటైరవుతున్నాననే వార్తల్లో నిజం లేదు. సరైన సమయం వచ్చినపుడు ఆ విషయాన్నే నేనే స్వయంగా ప్రకటిస్తా" అని భారత వన్డే కెప్టెన్‌ మిథాలీ చెప్పారు. ఇక, ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ గురించి మిథాలీ మాట్లాడుతూ "మాకు ఈ సిరీస్‌ చాలా కీలకం. మూడో ర్యాంకులో ఉన్న మేం దీన్ని ఇలాగే నిలబెట్టుకొని నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించాలనుకుంటున్నాం" అని అన్నారు.

ప్రతీ మ్యాచ్‌ గెలిచేందుకే ప్రయత్నిస్తాం

ప్రతీ మ్యాచ్‌ గెలిచేందుకే ప్రయత్నిస్తాం

"కాబట్టి ప్రతీ మ్యాచ్‌ గెలిచేందుకే ప్రయత్నిస్తాం. అయితే ప్రపంచ చాంపియన్‌ ఇంగ్లండ్‌ ఆషామాషీ జట్టేమీ కాదు. వారిని ఓడించడం అంత సులభం కాదని తెలుసు. పైగా హర్మన్‌ప్రీత్‌ లేకపోవడం మాకు లోటే! సిరీస్‌లో సమష్టిగా రాణించడంపై దృష్టిపెట్టాం" అని ఆమె అన్నారు. 2021 వన్డే వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించడంపైనే దృష్టి సారించామని ఆమె అన్నారు.

శుక్రవారం తొలి వన్డే

శుక్రవారం తొలి వన్డే

ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగే మూడు వన్డేలలో తొలి మ్యాచ్‌ శుక్రవారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరుగుతుంది. 2020 వరకు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు 2021 వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న భారత్‌కు ఇంగ్లాండ్‌తో సిరీస్‌ ఎంతో కీలకం కానుంది.

గాయంతో హర్మన్‌ప్రీత్ కౌర్ దూరం

గాయంతో హర్మన్‌ప్రీత్ కౌర్ దూరం

భారత మేటి బ్యాట్స్‌మన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ గాయంతో ఈ సిరీస్‌కు దూరమైంది. జట్టుకు వెన్నెముకలాంటి ఆమె కీలకమైన సిరీస్‌కు అందుబాటులో లేకపోవడం భారత్‌కు పెద్ద లోటుగా కనిపిస్తోంది. దీంతో బ్యాటింగ్‌ భారాన్ని స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, మిథాలీలు మోయాల్సివుంటుంది. స్మృతి ఇటీవలే ముగిసిన కివీస్‌ పర్యటనలో అసాధారణ ఫామ్‌ను కనబరిచింది.

సొంతగడ్డపై తన ఫామ్‌ను కొనసాగించాలని

సొంతగడ్డపై తన ఫామ్‌ను కొనసాగించాలని

సొంతగడ్డపై కూడా తన ఫామ్‌ను కొనసాగించాలని ఆమె ఆశిస్తోంది. మరోవైపు హర్మన్‌ప్రీత్‌ స్థానంలోకి వచ్చిన హర్లీన్‌ డియోల్‌ ఏ మేరకు రాణిస్తుందో ఈ పర్యటనలో తేలనుంది. ఇక, బౌలింగ్ విభాగంలో పేసర్‌ జులన్‌ గోస్వామి, శిఖా పాండే, మాన్సి జోషిలతో పాటు స్పిన్‌ విభాగంలో దీప్తి శర్మ, ఏక్తా బిష్త్, పూనమ్‌ యాదవ్‌లు రాణించేందుకు సిద్ధంగా ఉన్నారు.

Story first published: Friday, February 22, 2019, 12:05 [IST]
Other articles published on Feb 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X