న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కంగారుల ధాటికి చాప చుట్టేసిన బంగ్లా టైగర్లు: డెడ్ చీప్‌ స్కోర్‌కే ఆలౌట్: అయిదు వికెట్ల జంపా

T20 World Cup 2021: Bangladesh all out for 73 against Australia
T20 World Cup : 73 పరుగులకే Bangladesh ఆలౌట్ Australia రాక్స్ | Adam Zampa || Oneindia Telugu

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో మరో మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందనుకున్నప్పటికీ.. అలా కుదరలేదు. గ్రూప్ 2లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య సాగిన మ్యాచ్ చప్పగానే ముగిసేలా కనిపిస్తోంది. ఎందుకంటే- ఆస్ట్రేలియన్లు.. బంగ్లాదేశ్‌ బ్యాటింగ్ లైనప్‌ను చెల్లాచెదురు చేశారు కాబట్టి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో సాగుతున్న ఈ మ్యాచ్‌లో కంగారూల టీమ్‌కు ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు నామమాత్రపు లక్ష్యాన్ని నిర్దేశించింది కాబట్టి.

ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్: తొలి మూడు ఓవర్లలో మూడు వికెట్లు ఢమాల్: ఇదో రికార్డు మరిఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్: తొలి మూడు ఓవర్లలో మూడు వికెట్లు ఢమాల్: ఇదో రికార్డు మరి

కంగారుల ఖాతాలో మరో విక్టరీ

కంగారుల ఖాతాలో మరో విక్టరీ

ఆస్ట్రేలియాకు ఇది నాలుగో మ్యాచ్. ఇప్పటిదాకా మూడు మ్యాచ్‌లను ఆడిన కంగారూ టీమ్.. రెండింట్లో విజయాన్ని సాధించింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటున్నట్టే కనిపిస్తోంది. టాస్ ఓడిపోయి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు.. బంగ్లాదేశ్‌పై సంపూర్ణ ఆధిపత్యాన్ని కనపరిచింది. ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. తమ బౌలింగ్ ప్రతాపంతో బంగ్లాను 73 పరుగులకే ఆలౌట్ చేసంది.

అయిదో మ్యాచ్‌లోనూ

అయిదో మ్యాచ్‌లోనూ

బంగ్లాదేశ్ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంటోంది. ఇప్పటిదాకా ఆ జట్టు ఇంకా బోణీ కూడా చెయ్యలేదు. నాలుగు మ్యాచ్‌లను ఆడగా.. నాలుగింట్లోనూ ఓటమి పాలైంది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. టోర్నమెంట్‌లో ముందుకు వెళ్లలేని దుస్థితిని ఎదుర్కొంటోంది. ఈ మ్యాచ్ గెలిచినా కూడా బంగ్లాదేశ్ టైగర్లు టోర్నమెంట్‌లో ముందుకు వెళ్లలేరు. సెమీ ఫైనల్స్‌కు చేరుకోవడం గగనమే. ఒక మ్యాచ్‌లో గెలిచామనే ఊరట లభిస్తుందంతే.

 తొలి ఓవర్‌లో లిట్టన్ దాస్ బలి..

తొలి ఓవర్‌లో లిట్టన్ దాస్ బలి..

బంగ్లాదేశ్ ఈ టోర్నమెంట్‌లో ఏ మాత్రం రాణించట్లేదు. సత్తా చాటట్లేదు. ఈ మ్యాచ్‌లోనూ అదే పరిస్థితి. తొలి ఓవర్‌లోనే వికెట్‌ను కోల్పోయింది. తాను ఎదుర్కొన్న మొదటి బంతికే ఓపెనర్ లిట్టన్ దాస్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మిఛెల్ స్టార్క్ చేతి నుంచి 144 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్‌లా వెలువడిన బంతికిఅతని వద్ద సమాధానమే లేకుండా పోయింది. వికెట్లను గిరాటేసిందా బంతి. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్‌కు కొద్దిగా దూరంగా పడిన ఆ బంతి.. పిచ్ అయిన వెంటనే స్వింగ్ అయింది. ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని లెగ్ స్టంప్‌ను ఎగరవేసింది.

 రెండో వికెట్ సౌమ్యా సర్కార్..

రెండో వికెట్ సౌమ్యా సర్కార్..

రెండో ఓవర్‌లో సౌమ్యా సర్కర్ బలి అయ్యాడు. జోష్ హేజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్‌ చివరిబంతికి సౌమ్యా సర్కార్ క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. హేజిల్‌వుడ్ సంధించిన పర్‌ఫెక్ట్ లైన్ అండ్ లెగ్త్ బంతిని ఆడటంలో విఫలం అయ్యాడతను. బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ల మీది దూసుకెళ్లింది. ఎనిమిది బంతులను ఎదుర్కొన్న సౌమ్యా సర్కార్ ఒక ఫోర్‌తో అయిదు పరుగులు చేశాడు. రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. వెంటవెంటనే రెండు వికెట్లను కోల్పోయిన బంగ్లా టైగర్లు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

మూడో వికెట్ ముష్ఫికుర్..

మూడో వికెట్ ముష్ఫికుర్..

మూడో ఓవర్‌లోనూ బంగ్లాదేశ్ జట్టు వికెట్‌ను కోల్పోయింది. ఈ దఫా గ్లెన్ మ్యాక్స్‌వెల్ వంతు వచ్చింది. మూడో వికెట్‌గా ముష్ఫికుర్ రహీమ్ అవుట్ అయ్యాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ సంధించిన స్పిన్ బాల్‌ను స్వీప్ చేయబోయిన ముష్ఫికుర్ టైమింగ్ మిస్ అయ్యాడు. అది కాస్తా ప్యాడ్స్‌ను తాకింది. దీనితో మ్యాక్సీ, కీపర్ మ్యాథ్యూ వేడ్ ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేయడం, అంపైర్ తన వేలిని గాల్లోకి లేపడం చకచకా సాగిపోయాయి. ముష్ఫికుర్.. రివ్యూను కోరినప్పటికీ.. ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికి జట్టు స్కోరు 10 పరుగులు.

 కొంతమేర ప్రతిఘటించిన నయీం, మహ్మదుల్లా..

కొంతమేర ప్రతిఘటించిన నయీం, మహ్మదుల్లా..

వరుస వికెట్ల పతనాన్ని ఓపెనర్ మహ్మద్ నయీం, కేప్టెన్ మహ్మదుల్లా కొంతమేర అడ్డుకోలిగారు. మహ్మద్ నయీం 16 బంతుల్లో మూడు ఫోర్లతో 17 పరుగులు చేశాడు. మహ్మదుల్లా 18 బంతుల్లో రెండు ఫోర్లతో 16 పరుగులు చేశాడు. వారిద్దరే టాప్ స్కోరర్లు. మిగిలిన వారెవరూ ఆస్ట్రేలియన్ బౌలర్ల ధాటికి ఎదురు నిలవలేకపోయారు. 73 పరుగులకు బంగ్లా టీమ్ ఆలౌట్ అయింది. ప్రత్యర్థికి నామమాత్రపు టార్గెట్‌ను నిర్దేశించింది.

అయిదు వికెట్ల ఆడం జంపా

అయిదు వికెట్ల ఆడం జంపా

ఆస్ట్రేలియన్ స్పిన్ బౌలర్ ఆడమ్ జంపా అయిదు వికెట్లను పడగొట్టాడు. వరుస బంతుల్లో రెండు వికెట్లు చొప్పున రెండుసార్లు తీసుకున్నాడు. నాలుగు ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చిన అతను అయిదు మంది బ్యాటర్లను పెవిలియన్ దారి పట్టించాడు. మిఛెల్ స్టార్క్, హేజిల్‌వుడ్ రెండు చొప్పున వికెట్లు తీసుకున్నారు. మ్యాక్స్‌వెల్ ఒక వికెట్ పడగొట్టాడు.

Story first published: Thursday, November 4, 2021, 17:28 [IST]
Other articles published on Nov 4, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X