న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

No. 4 స్థానంపై కన్నేసిన సురేశ్ రైనా: రీఎంట్రీ అంత సులభంగా దక్కుతుందా?

Suresh Raina Targets No. 4 Position, Place In T20 World Cup Squad || Oneindia Telugu
Suresh Raina targets No. 4 spot, place in T20 World Cup squad

హైదరాబాద్: ఔట్ ఆఫ్ ఫామ్‌లో ఉన్న టీమిండియా సీనియర్ ప్లేయర్ సురేశ్ రైనా భారత క్రికెట్‌ జట్టులో మళ్లీ చోటు దక్కించుకోవడంపై దృష్టి సారించాడు. గతేడాది ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తరుపున చివరగా ఆడిన సురేశ్ రైనా మళ్లీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడు.

వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు ఎప్పటినుంచో అన్వేషిస్తున్న No. 4 స్థానంపై సురేశ్ రైనా కన్నేశాడు. ఈ స్థానంలో తనను పరీక్షించాలని అడుగుతున్నాడు. ఇటీవల మోకాలికి సర్జరీ చేయించుకున్న సురేశ్‌ రైనా తన పునరాగమనం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.

టాలీవుడ్ హాస్యనటుడు వేణుమాధవ్ మృతితో షాక్‌కు గురైన 'యూసుఫ్ పఠాన్'!!టాలీవుడ్ హాస్యనటుడు వేణుమాధవ్ మృతితో షాక్‌కు గురైన 'యూసుఫ్ పఠాన్'!!

రైనా మాట్లాడుతూ

రైనా మాట్లాడుతూ

ఈ నేపథ్యంలో రైనా మాట్లాడుతూ "భారత జట్టులో నేను No. 4లో ఆడగలను. గతంలో ఈ స్థానంలో ఆడిన అనుభవం నాకుంది. త్వరలో రాబోయే రెండు టీ20 వరల్డ్ కప్‌ల్లో నాకు అవకాశం లభిస్తుందని భావిస్తున్నా" అని సురేశ్ రైనా తెలిపాడు. గత రెండు సంవత్సరాలుగా No.4 స్పాట్‌లో ఆడే బ్యాట్స్‌మెన్ కోసం జట్టు మేనేజ్‌మెంట్ ప్రయత్నాలు చేసింది.

రాయుడు, శంకర్ విఫలం

రాయుడు, శంకర్ విఫలం

ఈ స్థానంలో అంబటి రాయుడు, విజయ్‌ శంకర్‌, రిషభ్‌ పంత్‌లను ఆడించినప్పటికీ వారు విఫలమయ్యారు. వన్డే వరల్డ్‌కప్‌కు ముందు అంబటి రాయుడిని ఆడించగా... వరల్డ్ కప్ సమయంలో ఆ స్థానానికి విజయ్ శంకర్‌ను ఎంపిక చేశారు. అయితే, టోర్నీ మధ్యలోనే విజయ్ శంకర్ గాయపడటంతో ఈ స్థానానికి రిషబ్ పంత్‌ను ఎంపిక చేశారు.

No.4 స్పాట్‌‌పై చర్చ

No.4 స్పాట్‌‌పై చర్చ

ఇలా టీమిండియాలో No.4 స్పాట్‌‌పై చర్చ నడుస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ స్థానంలో రిషబ్ పంత్. శ్రేయాస్‌ అయ్యర్‌లను మార్చి మార్చి పంపుతోన్న సంగతి తెలిసిందే. పంత్ ఈ స్థానానికి సరైన న్యాయం చేయలేకపోతుండటంతో అతడిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో తనకు ఒక అవకాశం ఇచ్చి చూడాలని రైనా అంటున్నాడు.

భారత విజయాల్లో కీలకపాత్ర

భారత విజయాల్లో కీలకపాత్ర

టీమిండియా తరుపున వన్డేల్లో 5,615 పరుగులు చేసిన రైనా, అంతర్జాతీయ టీ20ల్లో 1,605 పరుగులు చేశాడు. గతంలో మిడిలార్డర్‌లో భారత విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత తన సహజ సిద్ధమైన ఆటను ఆడటంలో విఫలమై జట్టులో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత తిరిగి ఆటపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో రైనాను గాయాలు వేధిస్తున్నాయి.

Story first published: Friday, September 27, 2019, 13:00 [IST]
Other articles published on Sep 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X