బంగ్లాదేశ్‌తో టీ20: సురేశ్ రైనా అరుదైన ఘనత

Posted By:
T20 Tri Series : Suresh Raina Trolled By Fans
Suresh Raina becomes third Indian batsman to hit 50 sixes in T20I

హైదరాబాద్: నిదాహాస్ ట్రోఫీలో భాగంగా గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రైనా 27 బంతుల్లో ఒక సిక్సు, ఒక ఫోర్ సాయంతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు.

దీంతో ఈ మ్యాచ్‌లో సిక్సు బాదడంతో టీ20ల్లో 50 సిక్సులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సిక్సులు బాదిన మూడో భారత ఆటగాడిగా సురేశ్ రైనా నిలిచాడు. ఈ జాబితాలో 74 సిక్సులతో యువరాజ్‌ తొలి స్థానంలో ఉండగా.. రోహిత్‌ శర్మ(69) సిక్సులతో రెండో స్థానంలో ఉన్నాడు.

ఆ తర్వాతి స్థానాల్లో టీమిండియా మాజీ కెప్టెన్ ధోని (49), విరాట్ కోహ్లీ (41) సిక్సులతో నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక, మొత్తంగా చూస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో క్రిస్‌ గేల్‌, మార్టిన్‌ గప్టిల్‌లు 103 సిక్సులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. కాగా, బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. అనంతరం బంగ్లా నిర్దేశించిన 140 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

శిఖర్ ధావన్ (43 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి మెరువగా రైనా (27 బంతుల్లో 28; 1 ఫోర్, 1 సిక్స్) రాణించాడు. బంగ్లా బ్యాట్స్‌మెన్‌లలో లిట్టన్ దాస్ (30 బంతుల్లో 34; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. షబ్బీర్ (26 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్ విజయ్ శంకర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

Story first published: Friday, March 9, 2018, 12:08 [IST]
Other articles published on Mar 9, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి