న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘ఎ+’ గ్రేడ్ లభించడంపై తొలిసారి స్పందించిన శిఖర్ ధావన్

By Nageshwara Rao
South Africa performance helped me win an A+ contract: Shikhar Dhawan

హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో మెరుగైన ప్రదర్శన చేయడం వల్లనే తనకు 'ఎ+' కాంట్రాక్టు లభించిందని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వెల్లడించాడు. ఇటీవల బీసీసీఐ ప్రకటించిన వార్షిక వేతనాల కాంట్రాక్టులో శిఖర్ ధావన్‌కు 'ఎ+' గ్రేడ్ లభించిన సంగతి తెలిసిందే. దీనిపై ధావన్ తొలిసారిగా స్పందించాడు.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

'విదేశీ పిచ్‌లపై పరుగులు చేయడంలో నేను కొంత ఇబ్బందులు పడిన మాట వాస్తవం. అయితే అదంతా గతం. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే, టీ20 లో చక్కటి ప్రదర్శన చేశాను. ఎలాగైనా సరే రాణించాలన్న పట్టుదలే నన్నునడిపించింది. బహుశా ఆ సిరీస్‌ వల్లే నాకు ఏ ప్లస్‌ కాంట్రాక్టు దక్కి ఉంటుంది' అని ధావన్ అన్నాడు.

'ఏదేమైనా అలా జరగడం ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంది. త్వరలో జరుగనున్న ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ రాణిస్తానన్న నమ్మకం ఉంది. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని భారత క్రికెట్‌ జట్టు పటిష్టంగా ఉంది. సీనియర్లు, జూనియర్లతో జట్టు సమతుల్యంగా ఉంది' అని ధావన్ తెలిపాడు.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

'ఇంగ్లాండ్‌తో సిరీస్‌ చాలా కఠినంగా ఉంటుంది. ఐతే అక్కడి పిచ్‌లపై ముందు నుంచే ఆడి అలవాటు పడితే ఎలా ఉంటుందో చూడాలి. సరైన సన్నద్ధత ఉండి, మేం మా అత్యుత్తమ ప్రదర్శన చేయగలిగితే ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్‌ గెలవకపోవడానికి కారణాలేమీ కనిపించవు' అని ధావన్‌ అన్నాడు.

ప్రస్తుతం తన దృష్టంతా మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్‌పైనే ఉందని అన్నాడు. ఐపీఎల్‌లో ధావన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. బీసీసీఐ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టులో కెప్టెన్ కోహ్లీతో పాటు రోహిత్‌ శర్మ, శిఖర్ ధావన్‌, భువనేశ్వర్‌ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలు ఏ+ గ్రేడ్‌లో చోటు దక్కించుకున్నారు. ఏ+ గ్రేడ్ కింద క్రికెటర్లు రూ. 7 కోట్లు వేతనంగా పొందనున్నారు.

Story first published: Saturday, March 24, 2018, 15:57 [IST]
Other articles published on Mar 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X