న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలిరోజు బిజీ బిజీ: దేశవాళీ క్రికెటర్లకు శుభవార్త, ఫీజు పెంపుకు గంగూలీ ఓకే

 Sourav Ganguly to increase fees of first-class cricketers

హైదరాబాద్: బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ తొలిరోజు బిజీ బిజీగా గడిపాడు. ముంబైలోని బీసీసీఐ క్రికెట్ సెంటర్‌లో గురువారం దాదా అధ్యక్షుడి హోదాలో టీమిండియా విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మలతో సమావేశమయ్యాడు. ఈ సమావేశంలో దాదా భారత క్రికెట్‌ భవిష్యత్తు కార్యాచరణ గురించి వారితో చర్చించాడు.

ఈ సమావేశంలో సౌరవ్ గంగూలీ ప్రధానంగా దేశవాళీ క్రికెటర్ల ఫీజు పెంపుపై వారితో చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి దేశవాళీ క్రికెటర్లు తమ ఫీజులు పెంచాలని కోరుతున్న సంగతి తెలిసిందే. 39వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సౌరవ్ గంగూలీ ప్రధానంగా ఈ అంశంపైనే దృష్టి సారించాడు.

బంగ్లా సిరిస్‌కు సంజూ శాంసన్ ఎంపిక: రిషబ్ పంత్ కెరీర్‌ను ప్రమాదంలో పడేయనుందా?బంగ్లా సిరిస్‌కు సంజూ శాంసన్ ఎంపిక: రిషబ్ పంత్ కెరీర్‌ను ప్రమాదంలో పడేయనుందా?

ఆఫీస్ బేరర్లకు బ్రీఫింగ్

ఆఫీస్ బేరర్లకు బ్రీఫింగ్

గత రెండు రోజులుగా గంగూలీ, అతని సహచరులతో బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో దీనిపై బ్రీఫింగ్ చేసినట్లు సమాచారం. ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల ఫీజులను అంతర్జాతీయ స్థాయిలో ఆడుతోన్న ఆటగాళ్లతో పోలిస్తే చాలా తక్కవగా ఉన్నాయని ఇదే విషయాన్ని తన సహచరుల ముందు గంగూలీ ప్రస్తావించాడని తెలుస్తోంది.

రోజుకి రూ.35వేల చొప్పున

రోజుకి రూ.35వేల చొప్పున

ప్రస్తుతం ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌కు ప్రతిమ్యాచ్‌లో రోజుకి రూ.35వేల చొప్పున చెల్లిస్తున్నారు. లిస్ట్‌-ఎ, టీ20లతో కలిపి మొత్తంగా ఫస్ల్‌క్లాస్‌ క్రికెటర్‌ సీజన్‌కు సగటున రూ.25 లక్షలు సంపాదిస్తున్నారు. ఈ మొత్తం అంతర్జాతీయ స్థాయిలో ఆడే ఆటగాళ్లతో పోలిస్తే చాలా తక్కువ. అంతర్జాతీయ క్రికెటర్లకు రూ.కోటి నుంచి ఏడు కోట్ల వరకు అందుతోంది.

మ్యాచ్‌ ఫీజుని రెట్టింపు చేయనున్న దాదా

మ్యాచ్‌ ఫీజుని రెట్టింపు చేయనున్న దాదా

దీంతో ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్ల మ్యాచ్‌ ఫీజుని రెట్టింపు చేయాలనే సౌరవ్ గంగూలీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీవీ హక్కుల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత మొత్తం దేశవాళీ క్రికెటర్లకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇది గనుక జరిగితే దేళవాళీ క్రికెటర్ల మ్యాచ్‌ ఫీజు రూ. 2.5 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది.

వచ్చేవారం దాదా బెంగళూరుకు

వచ్చే వారం కొత్త ఆఫీస్ బేరర్లతో కలిసి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)ను సందర్శించనున్నారు. హై ఫెర్పామెన్స్ సెంటర్ అభివృద్ధి కోసం భూమిని స్వాధీనం చేసుకోనున్నారు. దేశవాళీ క్రికెట్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఈ హై ఫెర్పామెన్స్ సెంటర్‌ను బీసీసీఐ ఏర్పాటు చేస్తోంది. కాగా, గురువారంనాటి సమావేశంలో బోర్డు కార్యదర్శి జై షాతో పాటు సెలక్షన్‌ కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోని బీసీసీఐ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.

Story first published: Friday, October 25, 2019, 12:00 [IST]
Other articles published on Oct 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X