న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్ చరిత్రలోనే ఇది బాధాకరమైన రోజు: గంగూలీ

Sourav Ganguly pays tribute to AB de Villiers at Eden Gardens

హైదరాబాద్: రాజస్థాన్, కోల్‌కతా మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ జరుగుతున్నంతసేపు మ్యాచ్‌పైనే కాకుండా ప్రతి క్రికెట్ అభిమాని మాట్లాడుకుంటున్న మాట. డివిలియర్స్ రిటైర్‌మెంట్.. 34ఏళ్ల క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి 2004వ సంవత్సరంలో అడుగుపెట్టి దాదాపు 400 మ్యాచ్‌లు దక్షిణాఫ్రికా తరుపున ఆడాడు. అయితే అంతా ఊహించినట్లు 2019వరల్డ్ కప్ జరిగిన తర్వాత రిటైర్‌మెంట్ ప్రకటిస్తాడనుకుంటున్న సమయంలో అనుకోని పరిణామానికి షాక్‌కు గురవ్వడంతో పాటు విచారాన్ని వ్యక్తం చేశారు.

డివిలియర్స్ రిటైర్‌మెంట్ గురించి స్పందించిన పలువురిలో టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ ప్రముఖులు. కోల్‌కతా వేదికగా జరిగిన రాజస్థాన్ వర్సెస్ కోల్‌కతా మ్యాచ్‌లో డివిలియర్స్ రిటైర్‌మెంట్ గురించి తెలిసిన సందర్భంగా పరుగులు, వికెట్లు కనిపించే డిస్‌ప్లే బోర్డుపై వీడ్కోలు సందేశాన్ని పొందుపరిచారు. ఆ మెసేజ్‌లో 'వెల్‌డన్ ఏబీ డివిలియర్స్ ఫర్ యువర్ కంట్రిబ్యూషన్ టు వరల్డ్ క్రికెట్, ద గేమ్ విల్ రిమెంబర్ యు ఫరెవర్, యూ హేవ్ బీన్ ఏ ఛాంపియన్ ప్లేయర్' అంటూ మెసేజ్‌ను అతనికి అందేలా పంపారు.

క్యాబ్ (క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్) ప్రెసిడెంట్‌గా బాధ్యతలు కొనసాగిస్తున్న గంగూలీ ఇలా తన వీడ్కోలు సందేశాన్ని తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్‌కు నువ్వు చేసిన సేవలు పేరెన్నికగన్నవి. క్రికెట్ నిన్ను ఎప్పటికీ మర్చిపోదు. నువ్వు ఎప్పటికీ ఛాంపియన్‌గానే నిలిచిపోతావు' అని పేర్కొన్నాడు.

అయితే కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో దినేశ్ జట్టు రాజస్థాన్‌పై 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. తర్వాతి మ్యాచ్ హైదరాబాద్‌తో కోల్‌కతాతో తలపడుతుంది. ఇందులో గెలిచిన జట్టు చెన్నైతో ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉంది.

Story first published: Thursday, May 24, 2018, 15:19 [IST]
Other articles published on May 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X