న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsNZ : స్కైకి ఆకాశమే హద్దు.. సూపర్ స్టార్ ఫీల్డింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా!

SKY flying in Sky fans hail Surykumar for his incredible fielding

టీమిండియాలో సూపర్ ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లలో సూర్యకుమార్ యాదవ్ ఒకడు. బ్యాటింగ్‌లో ధనా ధన్ ఆటతో ప్రత్యర్థికి చుక్కలు చూపించే ఈ ప్లేయర్.. ఫీల్డింగ్‌లో కూడా రాణిస్తున్నాడు. న్యూజిల్యాండ్‌తో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో అతని ఫీల్డింగ్ ఫీట్స్ చూసిన అభిమానులు 'వాహ్‌వా' అంటూ అతన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ మ్యాచ్ ఆరంభంలో స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తూ కనిపించిన సూర్య.. ఇక్కడ స్టన్నింగ్ క్యాచులు అందుకున్నాడు.

ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్ ఇద్దరూ ఇచ్చిన క్యాచులను సూర్య అందుకున్న విధానం.. అతని అద్భుతమైన బ్యాలెన్స్‌ను చూపిస్తున్నాయి, వీటికితోడు బౌండరీ లైన్ వద్ద కూడా సూర్య ఒక సూపర్ క్యాచ్ పట్టుకున్నాడు. ఇవన్నీ కూడా గాల్లో చాలా ఎత్తుకు లేచిన బంతులే కావడం గమనార్హం. ఇలాంటి క్యాచులు పట్టుకోవడానికి అద్భుతమైన ఫీల్డర్లు కూడా కొంత తడబడతారు. గతంలో చాలా మంచి ఫీల్డర్లు కూడా ఇలాంటి క్యాచులు అందుకోవడానికి తడబడతారు. కానీ సూర్యలో ఏమాత్రం తడబాటు కనిపించడం లేదు.

సూర్యనే కాదు.. మరో ధనా ధన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠీ కూడా మంచి ఫీల్డర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వీళ్లిద్దరి ఫీల్డింగ్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. వీళ్లిద్దరూ ఫీల్డింగ్‌లో కూడా ఇంటెంట్ చూపిస్తున్నారని మెచ్చుకున్నారు. బౌండరీ లైన్ వద్ద అతను చూపించిన బ్యాలెన్స్ చాలా అద్భుతంగా ఉందని కొనియాడుతున్నారు. స్లిప్స్‌లో ఉండగా గాల్లోకి ఎగిరి అందుకున్న క్యాచ్ మహాద్భుతం అంటున్నారు. ఫిన్ అలెన్‌ క్యాచ్ ఎలా అందుకున్నాడో, గ్లెన్ ఫిలిప్స్ క్యాచ్ కూడా అచ్చం అలాగే అందుకున్నాడు. ఇది చూసిన నెటిజన్లు.. 'అలెన్ క్యాచ్‌ను కాపీ చేసి, ఫిలిప్స్‌కు కూడా పేస్ట్ చేసినట్లు ఉంది' అంటూ జోకులు పేలుస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో భారత జట్టు భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Story first published: Thursday, February 2, 2023, 8:34 [IST]
Other articles published on Feb 2, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X