న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Shoaib Akhtar: ప్లేయర్ అఫ్ ద టోర్నీ.. డేవిడ్ వార్నర్‌కు ఎట్ల ఇస్తరండి? ఇది అన్యాయం!

Shoaib Akhtar wanted Babar Azam to win Player of the Tournament award

కరాచీ: టీ20 ప్రపంచకప్ 2021 ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు ఇవ్వడాన్ని పాకిస్థాన్ పేసర్ షోయబ్ అక్తర్ తప్పుబట్టాడు. ఇది సరైన నిర్ణయం కాదని ట్వీట్ చేశాడు. మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బాబర్ ఆజామ్‌కు ఈ అవార్డు దక్కాల్సిందని అభిప్రాయపడ్డాడు. 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు బాబర్ ఆజామ్‌కు దక్కుతుందనుకున్నా. ఇది అన్యాయం'అని ట్వీట్ చేశాడు.

మెగా టోర్నీలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్​ అజామ్​ 6 మ్యాచుల్లో 303 పరుగులు చేయగా.. వార్నర్​ 7 మ్యాచుల్లో 289 పరుగులు చేశాడు. ఇందులో (65, 89 నాటౌట్, 49, 53) నాలుగు విన్నింగ్ నాక్స్ ఉన్నాయి. ముఖ్యంగా వెస్టిండీస్‌తో చివరి లీగ్ మ్యాచ్‌లో వార్నర్ ఆడిన తీరు.. సెమీస్‌లో ఆరంభంలోనే వికెట్లు కోల్పయినా తీవ్ర ఒత్తిడిలో స్వేచ్చగా ఆడిన విధానం అతని కెరీర్‌లోనే హైలైటని చెప్పొచ్చు. మెగాటోర్నీ ముందు వరకు ఫామ్‌లో లేని వార్నర్.. అసలు సిసలు టోర్నీ‌లో సత్తా చాటాడు.

జంపాకు ఇవ్వాల్సింది..

ప్లేయర్​ ఆఫ్​ ద టోర్నమెంట్​ వార్నర్​కు దక్కడంపై ఆసీస్​ కెప్టెన్​ ఆరోన్​ ఫించ్ సైతం​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ అవార్డు బౌలర్​ ఆడమ్​ జంపాకు దక్కాల్సిందని అభిప్రాయపడ్డాడు. జంపా.. కీలక మ్యాచ్​లలో ప్రత్యర్థులకు పరుగులు చేయకుండా కట్టడి చేశాడని పేర్కొన్నాడు. చాలా గర్వంగా ఉంది. టీ20 ప్రపంచకప్ సాధించిన ఆస్ట్రేలియా తొలి జట్టుగా మేము నిలిచాం. టైటిల్‌ సాధించడం అంత తేలికైన విషయం కాదు అని మాకు తెలుసు. వ్యక్తిగతంగా, సమష్టిగా ప్రతీ ఒక్కరు అద్భుత ప్రదర్శన కనబరిచి ఇక్కడి దాకా చేరుకున్నాం. వార్నర్ పని అయిపోయిందంటూ చాలా మంది చాలా రకాలుగా రాశారు. నిజానికి అలాంటి సమయాల్లోనే అతను అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడు. అయితే నా దృష్టిలో మాత్రం జంపా ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌. మార్ష్‌ ఈరోజు అద్భుతంగా ఆడాడు. వేడ్‌ గాయం కారణంగా ఇబ్బంది పడగా స్టొయినిస్‌ తన పనిని పూర్తి చేశాడు''అని ఆరోన్ ఫించ్ చెప్పుకొచ్చాడు. ఆడమ్​ జంపా.. మొత్తం టోర్నీలో 13 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

మ్యాన్ ఆఫ్ ది టోర్నీ ‘టాసే’!

మ్యాన్ ఆఫ్ ది టోర్నీ ‘టాసే’!

బాబర్ ఆజామ్, ఆడమ్ జంపాలకు ఇవ్వాల్సిందని క్రికెటర్లు అంటుంటే.. అభిమానులు మాత్రం టాస్‌కివ్వాలని సెటైర్లు పేల్చుతున్నారు. 'టీ20 ప్రపంచకప్ 2021 కన్నా 'చిత్తు బొత్తు'ఆట నయం' మెగా టోర్నీని ఉద్దేశించి ఓ అభిమాని చేసిన ట్వీట్! దుబాయ్ వేదికగా జరిగిన ఈ మెగాటోర్నీ ఫలితాలను చూస్తుంటే ఆ అభిమాని చెప్పినట్లు ఇది క్రికెట్ టోర్నీనా? లేక చిత్తు బొత్తు ఆటనా? అనే సందేహం కలుగుతోంది. మ్యాచ్ ఫలితాన్ని టాస్ అంతగా శాసించింది. హాట్ ఫేవరేట్ బరిలోకి దిగిన టీమిండియా ఇంటి దారి పట్టడానికి.. లీగ్ దశలో దుమ్మురేపి నాకౌట్ చేరిన ఇంగ్లండ్, పాకిస్థాన్ టైటిల్ ఫైట్‌కు చేరుకుండా వెనుదిరగడానికి.. ఏ మాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టైటిల్ గెలిచిందనడానికి ప్రధానం కారణం 'టాస్'! అంతలా మ్యాచ్ ఫలితాన్ని శాసించింది. దాంతో యూఏఈ పిచ్‌లపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

టాస్ గెలిస్తే గెలిచినట్లే..

టాస్ గెలిస్తే గెలిచినట్లే..

యూఏఈలోని పిచ్‌లు మొదట బ్యాటింగ్‌కు కఠినంగా ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి పూట మ్యాచ్‌ల్లో అయితే మంచు ప్రభావం కారణంగా ఛేదన చేసే జట్టుకే ఎక్కువ విజయాలు దక్కాయి. టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12 దశ నుంచి ఫైనల్‌ మ్యాచ్‌ వరకు 23 మ్యాచ్‌లు జరగ్గా .. 18 సార్లు చేజింగ్ టీమ్సే గెలుపొందాయి. ఇందులో 15 సార్లు టాస్ గెలిచిన జట్లు ఉన్నాయి. ఇక రాత్రి పూట 13 మ్యాచ్‌లకు గాను పన్నెండు సార్లు ఛేదన చేసిన జట్లనే విజయం వరించింది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ సులువుగా మారుతుండడంతో టాస్‌ గెలిచిన జట్లు మరో ఆలోచన లేకుండా బౌలింగ్‌కే మొగ్గు చూపాయి. టీ20 ప్రపంచకప్ చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా కూడా సూపర్ -12 దశలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌లో ఎలా తడబడిందో చూశాం. దాంతో టాస్‌ గెలిస్తే మ్యాచ్‌ గెలిచినట్లే అనే భావన అందరిలో ఏర్పడింది.

Story first published: Monday, November 15, 2021, 16:29 [IST]
Other articles published on Nov 15, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X