న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బిగుస్తోన్న ఉచ్చు: షకీబ్‌ను కలిసిన బుకీ, 18 నెలలు నిషేధం తప్పదా?

Shakib Al Hasan kept away from practice on ICC insistence, faces ban for not reporting corrupt approach

హైదరాబాద్: బంగ్లాదేశ్ టెస్టు, టీ20 కెప్టెన్ షకీబ్ ఉల్ హాసన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బోర్డుకు వ్యతిరేకంగా సమ్మెకు నాయకత్వం వహించిన షకీబ్‌ను అన్ని విధాలుగా ఇబ్బందులు గురి చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఐసీసీపై ఒత్తిడి తెచ్చి షకీబ్‌‌పై 18 నెలలు పాటు నిషేధం విధించేందుకు బోర్డు ఓ ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

రెండేళ్ల క్రితం ఓ బుకీ తనను సంప్రదించిన విషయాన్ని నివేదించనందుకు గాను అతడిపై చర్యలు తీసుకునేందుకు ఐసీసీ సిద్ధమైంది. ఆరోపణలు నిజమైతే దాదాపు 18 నెలలు షకిబ్‌పై ఐసీసీ నిషేధం విధించే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ బెంగాలీ డైలీ 'సమకాల్' ఓ కథనంలో వెల్లడించింది.

"ఐసీసీ పట్టుబట్టడంతోనే షకీబ్‌ను బీసీబీ ప్రాక్టీస్‌కు దూరంగా ఉంచింది. ప్రాక్టీస్‌లో పాల్గొనకపోవటానికి, బోర్డు అధ్యక్షుడితో సోమవారం సాయంత్రం జరిగిన సమావేశానికి షకీబ్ గైర్హాజరుకు కారణమిదే" అని రాసుకొచ్చింది.

<strong>తొలిసారి టీ20 వరల్డ్‌కప్‌లో: పపువా న్యూ గునియా ఎలా అర్హత సాధించిందో తెలుసా?</strong>తొలిసారి టీ20 వరల్డ్‌కప్‌లో: పపువా న్యూ గునియా ఎలా అర్హత సాధించిందో తెలుసా?

ఎలాంటి ప్రకటన చేయని ఐసీసీ

ఎలాంటి ప్రకటన చేయని ఐసీసీ

అయితే, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం విశేషం. రెండేళ్ల క్రితం ఓ బుకీ నుంచి మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని షకీబ్‌కు ఓ అద్భుతమైన ఆఫర్ వచ్చింది. తనను బుకీ కలిసి ఆఫర్ ఇచ్చిన విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక మరియు భద్రతా విభాగానికి (ఎసిఎస్‌యు) నివేదించలేదు.

అంగీకరించిన షకీబ్

అంగీకరించిన షకీబ్

ఈ విషయాన్ని షకీబ్ ఉల్ హాసన్ ఇటీవల ఎసిఎస్‌యు దర్యాప్తు అధికారుల ముందు కూడా ఒప్పుకున్నాడని బెంగాలీ డైలీ 'సమకాల్' తన కథనంలో రాసుకొచ్చింది. ఈ కారణం చేతనే సెషన్‌లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా షకీబ్ ఉల్ హాసన్ గైర్హాజరైనట్లు తెలిపింది. బుధవారం బంగ్లాదేశ్ జట్టు భారత పర్యటనకు రానుంది.

రెండోసారి #DhoniRetires ట్రెండింగ్: ఇడియట్స్ అంటూ నోరు జారిన ధోని అభిమానులు!

భారత పర్యటనకు ముందు

భారత పర్యటనకు ముందు

భారత పర్యటనకు ముందు వ్యూహాలను చర్చించడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో షకీబ్ పాల్గొనలేదు. బంగ్లాదేశ్ యాజమాన్యం షకీబ్ ఉల్ హాసన్ లేకుండా తాజా టీ20 జట్టును ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రంలోగా బీసీబీ టీ20 జట్టును ప్రకటించనుంది.

షకీబ్ జట్టులో ఉంటాడో లేదో!

షకీబ్ జట్టులో ఉంటాడో లేదో!

మరి షకీబ్ జట్టులో ఉంటాడో లేదో చూడాలి. భారత పర్యటనకు షకీబ్ దూరమైతే ముష్ఫికర్‌ రహీమ్‌ టెస్టులు, మొసాదిక్‌ హుస్సేన్‌ టీ20లకు నాయకత్వం వహించనున్నారు. తొలుత కాంట్రాక్ట్‌ విషయంలో సహచరులతో కలిసి సమ్మెకు నాయకత్వం వహించిన షకీబ్‌.. ఆ తర్వాత తన వ్యక్తిగత స్పాన్సర్‌ ఒప్పందం విషయంలో కూడా బోర్డుతో తలపడాల్సి వచ్చింది. టెలికామ్‌ సంస్థ రోబీ బంగ్లా జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా ఉండగా.. ప్రత్యర్థి అయిన గ్రామీఫోన్‌కు షకీబ్‌ ప్రచారకర్తగా వ్యవహరించాడు.

సంచలన వ్యాఖ్యలు చేసిన బంగ్లా బోర్డు అధ్యక్షుడు

సంచలన వ్యాఖ్యలు చేసిన బంగ్లా బోర్డు అధ్యక్షుడు

ఈ విషయమై కూడా బోర్డు షకీబ్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. అయితే, ఈ షోకాజ్ నోటీస్‌పై షకీబ్‌ ఇప్పటి వరకు స్పందించలేదు. షకీబ్‌తో పాటు మరికొందరు క్రికెటర్లు కావాలనే వివాదాలు చేస్తూ.. భారత పర్యటనను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని తమకు సమాచారం అందిందని బంగ్లా బోర్డు అధ్యక్షుడు నజ్ముల్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, October 29, 2019, 15:05 [IST]
Other articles published on Oct 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X