రెండోసారి #DhoniRetires ట్రెండింగ్: ఇడియట్స్ అంటూ నోరు జారిన ధోని అభిమానులు!

హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో సొంతగడ్డపై టీమిండియా మూడు టీ20ల సిరిస్ కోసం సన్నద్దమవుతోన్న వేళ... సోమవారం(అక్టోబర్ 28) ట్విట్టర్‌లో #DhoniRetires అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవడంతో భారత అభిమానులను కలవరపాటుకు గురిచేసింది. ధోని రిటైర్మెంట్‌పై ట్విట్టర్‌లో ట్రెండ్ అవడం ఇదే తొలిసారి కాదు.
వెస్టిండిస్ పర్యటన తర్వాత విరాట్ కోహ్లీ తన ట్విట్టర్‌లో ధోని గురించి పోస్టు చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. "ఆ మ్యాచ్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ మనిషి ఫిట్‌నెస్ టెస్ట్‌లో పరిగెత్తించినట్టు నన్ను పరిగెత్తించాడు" అంటూ ధోనీని ట్యాగ్ చేస్తూ విరాట్ కోహ్లీ కామెంట్ పెట్టాడు.
2016 వరల్డ్ టీ20లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కి మొహలీ ఆతిథ్యమిచ్చింది. ఈ మ్యాచ్ గురించి కోహ్లీ ట్వీట్ చేశాడు. కోహ్లీ చేసిన ఈ ట్వీట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ఊహాగానాలకు తావిచ్చింది. దీంతో ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడేమోనని అభిమానులు ఆందోళన చెందారు.

ధోని రిటైర్మెంట్ వార్తలపై
చివరకు ధోని రిటైర్మెంట్ వార్తలపై అతడి భార్య సాక్షితో పాటు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా ఖండించాడు. ధోని భార్య సాక్షి తన ట్విట్టర్‌లో ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని కొట్టిపారేశారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో తొలి టీ20కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ ట్వీట్‌ను ఏ ఉద్దేశంతో పోస్ట్ చేశాననే విషయంపై కూడా వివరణ ఇచ్చుకున్నాడు.
భారత్ నుంచి ఇద్దరు: ప్రపంచ క్రికెట్‌లో పుట్టినరోజున సెంచరీలు సాధించిన క్రికెటర్లు వీరే!
కోహ్లీ సైతం వివరణ
"ఇంట్లో కూర్చొని సాధారణంగా ఓ ఫొటోను పోస్ట్ చేశాను. నా మదిలో ఏమీ లేదు. కేవలం నేను ఆనాటి జ్ఞాపకాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నానంతే. అయితే, అది ఒక పెద్ద వార్తగా మారుతుందని అనుకోలేదు. ఇది నాకో పాఠాన్ని నేర్పింది. మనం ఆలోచించే విధంగా ప్రపంచం ఆలోచించదని తెలిసింది" అని కోహ్లీ తెలిపాడు.

ఆ వార్తల్లో నిజం లేదు
"నాకు ఆ మ్యాచ్ ఇప్పటికీ గుర్తుంది. ఆ మ్యాచ్‌పై ఇప్పటి వరకూ నేనేమీ మాట్లాడలేదు. అందుకే పోస్ట్ చేయాలని భావించి చేశాను. నేను చేసిన ట్వీట్.. ధోనికి రిటైర్మెంట్‌కు సంబంధించినదే అని వార్త రావడం బాధాకరం. ధోని రిటైర్మెంట్ వార్తల్లో నిజం లేదు" అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

తాజాగా రెండోసారి ధోని రిటైర్మెంట్‌పై
తాజాగా మళ్లీ సోమవారం రెండోసారి ధోని రిటైర్మెంట్‌పై ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతుండటంతో ఈసారి అభిమానులు కాస్త తెలివిగా ప్రవర్తించారు. కావాలని ధోని రిటైర్మెంట్ యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తోన్న వారిపై ధోని అభిమానులు మండిపడ్డారు. ధోని రిటైర్మెంట్‌పై మాకు ఫ్రూఫ్ కావాలంటూ ట్వీట్లు పెడుతున్నారు.

ధోని షూ లేసులు కట్టడానికి కూడా అర్హులు కారు
"రిటైర్మెంట్ గురించి ఈ రూమర్ వ్యాప్తి చేసిన వారు ధోని షూ లేసులను కట్టడానికి కూడా అర్హులు కారు" అని ఓ నెటిజన్ మండిపడ్డాడు. "#DhoniRetiresను ట్రెండ్ చేయడం ఆపండి ఇడియట్స్. ధోని తనకు కావాల్సినప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడు. ఇప్పుడే అతడు రిటైర్మెంట్ చేయకూడదని మేము కోరుకుంటున్నాము" అని మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు.

అసలేం జరిగింది?
ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత రెండు నెలలు పాటు ధోని క్రికెట్‌కు దూరం కావడంతో అతడి రిటైర్మెంట్‌పై ఇటీవలి కాలంలో అనేక ఊహాగానాలు ఊపందుకున్నాయి. తొలుత భారత ఆర్మీకి సేవలందించేందుకు గాను విండిస్ పర్యటనకు దూరమయ్యాడు. ఆ తర్వాత సొంతగడ్డపై జరిగిన దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20 సిరీస్‌కు కూడా ధోని అందుబాటులో లేడు.

జార్ఖండ్ అండర్-23 జట్టుతో కలిసి ధోని ప్రాక్టీస్
వచ్చే నెలలో బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో కూడా ధోనీ లేడు. అయితే, వచ్చే జనవరిలో ధోని పూర్తి ఫిట్‌నెస్‌తో సెలక్షన్ కమిటీకి అందుబాటులోకి రానున్నాడు. ఇప్పటికే ధోని తన ట్రైనింగ్‌ను ప్రారంభించాడు. ఇందులో భాగంగా జిమ్‌లో ధోని కసరత్తులు చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి స్థాయి ఫిట్‌నెస్ అందుకోవడానికి జార్ఖండ్ అండర్-23 జట్టుతో కలిసి ధోని ప్రాక్టీస్ చేయనున్నాడు.
ధోని రిటైర్మెంట్‌పై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దు
#DhoniRetires trend'ను దయచేసి ఆపండి
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications