న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెలక్టర్లు అతడితో మాట్లాడాలి: ధోని రిటైర్మెంట్‌పై గంభీర్‌కు ఎందుకంత ఆసక్తి!

 Selectors should speak to MS Dhoni about his future plans, says former opener Gautam Gambhir

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భవిష్యత్తు ప్రణాళికపై సెలక్టర్లు అతడితో మాట్లాడాలని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సూచించాడు. ధోని తన రిటైర్మెంట్‌పై నోరు విప్పకపోవడంతో అతడి భవిష్యత్తుపై గత కొన్ని రోజులుగా తీవ్రమైన చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే.

వన్డే వరల్డ్‌కప్‌లో చివరిసారిగా ఆడిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ... ఆ తర్వాత వెస్టిండిస్, దక్షిణాఫ్రికా పర్యటనలకు దూరమయ్యాడు. తాజాగా స్వదేశంలో ప్రారంభమయ్యే బంగ్లాదేశ్‌ సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండడని రెండు రోజుల క్రితం వార్తలు వచ్చాయి.

పాక్‌లో శ్రీలంక పర్యటన: షెడ్యూల్, జట్లు, టెలికాస్ట్, లైవ్ స్ట్రీమింగ్, వేదిక వివరాలుపాక్‌లో శ్రీలంక పర్యటన: షెడ్యూల్, జట్లు, టెలికాస్ట్, లైవ్ స్ట్రీమింగ్, వేదిక వివరాలు

ఈ నేపథ్యంతో గురువారం గంభీర్ మాట్లాడుతూ "ఈ విషయంలో నేను ఎప్పటినుంచో నేను ఒక్కటే చెబుతున్నా. రిటైర్మెంట్ అనేది వ్యక్తిగత నిర్ణయం. ఈ విషయంలో సెలక్టర్లు ధోనితో మాట్లాడి అతడి భవిష్యత్తు ప్రణాళికను తెలుసుకోవాలి. భారతదేశం తరఫున ఆడుతున్నప్పుడు సిరీస్‌ను ఎంచుకొని ఆడకూడదు" అని తెలిపాడు.

వరల్డ్‌కప్ తర్వాత భారత ఆర్మీకి సేవ చేసేందుకు గాను ధోని క్రికెట్‌ నుంచి రెండు నెలలు పాటు విరామం తీసుకున్నాడు. ఈ విరామంలో భాగంగా తనంతట తానుగా వెస్టిండిస్, దక్షిణాప్రికా పర్యటనలకు దూరమయ్యాడు. అయితే, స్వదేశంలో ప్రారంభమయ్యే బంగ్లాదేశ్‌ సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండడని తెలుస్తోంది.

నటుడు మాధవన్ పుత్రోత్సాహం: భారత్‌కు మెడల్ తెచ్చిన కుమారుడునటుడు మాధవన్ పుత్రోత్సాహం: భారత్‌కు మెడల్ తెచ్చిన కుమారుడు

వరల్డ్‌కప్‌లో అయిన గాయం కారణంగా ధోని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఇంగ్లాండ్ వరల్డ్‌కప్‌కు ధోని వెన్నునొప్పితోనే వెళ్లాడు. టోర్నీ సమయంలో ఆ నొప్పి తీవ్రతరం అవడంతో పాటు నాకౌట్ మ్యాచ్‌లో ధోని చేతికి మణికట్టుకు గాయమైన సంగతి తెలిసిందే. ఈ గాయం నుంచి కోలుకుని నవంబర్ నాటికి ధోని ఫిట్ అవుతాడని భావిస్తున్నారు.

ఈ కారణం చేతనే ధోని నవంబర్ వరకు సెలక్షన్ కమిటీకి అందుబాటులో ఉండడని చెప్పినట్లు తెలుస్తోంది. 38 ఏళ్ల ధోని ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్నప్పటికీ వెన్నునొప్పి మాత్రం అతడిని గత కొంతకాలంగా బాధిస్తోన్న సంగతి తెలిసిందే.

Story first published: Thursday, September 26, 2019, 19:04 [IST]
Other articles published on Sep 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X