న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉదయం సెంచరీ చేసి సాయంత్రం పానీ పూరీ అమ్మేవాడిని: యశస్వి జైస్వాల్ గుర్తిండిపోయే ప్రయాణం!

Yashasvi Jaiswal : From Selling Panipuri To Being Picked For U-19 World Cup || Oneindia Telugu
Score century in the morning, sell pani puris in evening: Yashasvi Jaiswal reflects on memorable journey

హైదరాబాద్: లిస్ట్-ఏ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పినప్పటి నుంచి భారత క్రికెట్‌లో తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు 17 ఏళ్ల యశస్వి జైస్వాల్. వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న అండర్-19 వరల్డ్ కప్‌లో భారత జట్టు తరుపున ఎంపికయ్యాడు.

17 ఏళ్ల 292 రోజుల వయసున్న యశస్వి జైస్వాల్ ఇటీవలే విజయ్ హాజారే ట్రోఫీలో ముంబై తరుపున 154 బంతుల్లో 12 సిక్సులు, 17 బౌండరీల సాయంతో 203 పరుగులు సాధించాడు. ఫలితంగా లిస్ట్-ఏ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన పిన్న వయస్కుడిగా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.

Yearend 2019: కలిసొచ్చిన రెండో అర్ధభాగం, ఈ ఏడాది టీ20ల్లో టీమిండియా!Yearend 2019: కలిసొచ్చిన రెండో అర్ధభాగం, ఈ ఏడాది టీ20ల్లో టీమిండియా!

ఈ ప్రదర్శనే అతడిని అండర్-19 వరల్డ్‌కప్‌కు ఎంపికయ్యేలా చేసింది. అంతేకాదు విజయ్ హాజారే టోర్నీలో మొత్తం 564 పరుగులు చేశాడు. యావరేజి 112.80గా ఉంది. అయితే, ఇదంతా క్రికెట్ ఆటపై అతనికి ఉన్న ప్రేమ కారణంగానే సాధ్యమైందని యశస్వి జైస్వాల్ చెప్పుకొచ్చాడు.

యశస్వి జైస్వాల్ తండ్రి ఉత్తర ప్రదేశ్‌లోని బాధోహి ప్రాంతానికి చెందిన ఓ షాప్ కీపర్. క్రికెట్‌పై అతడికి ఉన్న ప్రేమే అతడిని 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ముంబైకి వచ్చేలా చేసింది. తొలుత ముస్లిం యునైటెడ్ స్పోర్ట్స్ క్లబ్ మైదానం ప్రక్కనే ఉన్న ఒక గుడారంలో 3 సంవత్సరాలు నివసించాడు. ఆ తర్వాత తాను ఆజాద్ మైదాన్ వద్ద పానీ పూరి, పండ్లను అమ్మడం వంటి ఉద్యోగాన్ని చేసినట్లు తెలిపాడు.

ఐసీసీ క్రికెట్.కామ్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో "నేను క్రికెట్‌ను ప్రేమిస్తున్నాను. క్రీడ ఆడటం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నేను ఎప్పుడూ సచిన్ సర్ బ్యాట్ చూసేవాడిని. అప్పటినుండి నేను ముంబైలో ఉండి ముంబైకి ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నాను" అని అన్నాడు.

"నేను నా తండ్రితో ఇక్కడికి (ముంబై) వచ్చినప్పుడు, నేను ఆజాద్ మైదాన్‌ను సందర్శించేవాడిని. నాకు అక్కడ క్రికెట్ ఆడటం చాలా ఇష్టం. నేను ఆజాద్ మైదానంలో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. కానీ, నాన్న ఇంటికి తిరిగి వెళ్దాం (ఉత్తర ప్రదేశ్) అన్నారు. కానీ నేను ఇక్కడే ఉండి ముంబై తరపున ఆడతాను" అని చెప్పానని అన్నాడు.

టీమ్ సౌథీ Vs డేవిడ్ వార్నర్: పెర్త్ టెస్టులో మాటల యుద్ధం, అసలేం జరిగింది?టీమ్ సౌథీ Vs డేవిడ్ వార్నర్: పెర్త్ టెస్టులో మాటల యుద్ధం, అసలేం జరిగింది?

"నేను నా వస్తువులన్నీ తీసుకొని ఆజాద్ మైదానానికి వచ్చాను. ఆ సమయంలో అక్కడ ఓ మ్యాచ్ జరుగుతోంది. నేను ఆ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేశా. ఆ తర్వాత పప్పు సర్ నాకు అక్కడ ఉండటానికి ఒక డేరా ఉంటుందని చెప్పారు. నేను ఆ మ్యాచ్ ఆడాను మరియు నేను చాలా బాగా ప్రదర్శించాను. ఫలితంగా, నేను ఒక గుడారంలో నివసించాను. వెలుతురు, టాయిలెట్‌లేని ఆ గుడారంలో నివసించడం కష్టం అనిపించింది" అని యశస్వి తెలిపాడు.

"వేసవికాలంలో ఆ గుడారంలో చాలా వేడిగా ఉండేది, వర్షాకాలంలో నీరు గుడారంలోకి ప్రవేశిస్తుంది. దీంతో అక్కడ ఉండటం చాలా కష్టంగా అనిపించేది. అయినా సరే నా మనస్సులో మాత్రం క్రికెట్ మాత్రం ఆడాలని ఉండేది. ఆ సమయంలో డబ్బు విషయంలో నా కుటుంబం నుంచి నాకు పెద్దగా మద్దతు లభించేంది కాదు. కాబట్టి, నేను సాయంత్రం పానీ-పూరిస్ విక్రయించి కొంత డబ్బు సంపాదించేదాన్ని" అని వెల్లడించాడు.

థాయ్‌లాండ్‌లో యువరాజ్‌ సందడి.. సచిన్‌, హర్భజన్‌తో బర్త్‌డే వేడుకలు!!
https://telugu.mykhel.com/cricket/yuvraj-singh-celebrates-birthday-with-sachin-tendulkar-harbhajan-singh-in-thailand-025210.html

"నాతో కలిసి క్రికెట్ ఆడిన ఆటగాళ్ళు, నేను పనిచేసిన షాపులోనే పానీ ప్యూరీ తినడం చూసి నాకు ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తింది. దీనిని చాలా చెడ్డగా భావించాను. ఎందుకంటే నేను ఉదయం సెంచరీ సాధించి... సాయంత్రం పానీ పూరీ అమ్మేవాడని. ఇది చిన్న ఉద్యోగం కాదా అన్నది పట్టింపు లేదు, ఆ ఉద్యోగం నాకు చాలా ముఖ్యమైనది. అయినప్పటికీ, నా దృష్టి క్రికెట్ పైనే ఉండేది" అని యశస్వి జైస్వాల్ తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.

"ఒక రోజు, నేను ఆజాద్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నాను, జ్వాలా సర్ నన్ను చూశాడు. నేను ఇక్కడ ఏమి చేస్తున్నానని అడిగాడు. ఆ తర్వాత నా జీవితమే మారిపోయింది. ఆహారాన్ని కొనడానికి డబ్బు లేదు, ఉండటానికి నాకు స్థలం లేదు. ఆ సమయంలో ఆయన క్రికెట్‌పై దృష్టి పెట్టమని చెప్పాడు. ఆపై మిగతావన్నీ తాను చూసుకుంటానని చెప్పాడు" అని జైస్వాల్ తెలిపాడు.

"ఆ తర్వాత నేను 2019లో విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఆడటానికి ఎంపికయ్యాను. లిస్ట్-ఎ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాను" అని యశస్వి జైస్వాల్ వెల్లడించాడు.

Story first published: Friday, December 13, 2019, 15:33 [IST]
Other articles published on Dec 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X