న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లంక మాజీ దిగ్గజం జయసూర్యపై అభియోగాలు నమోదు చేసిన ఐసీసీ

Sanath Jayasuriya charged under ICC Anti-Corruption Code

హైదరాబాద్: శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్యపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అభియోగాలు నమోదు చేసింది. ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్ కింద సనత్ జయసూర్య రెండు ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఐసీసీ అభియోగాలు మోపింది.

<strong>క్రికెటర్లకు వింత అనుభవం: రోహిత్ శర్మకు ముద్దు ఇవ్వబోయిన అభిమాని (వీడియో)</strong>క్రికెటర్లకు వింత అనుభవం: రోహిత్ శర్మకు ముద్దు ఇవ్వబోయిన అభిమాని (వీడియో)

అంతేకాదు ఐసీసీ అవినీతి నిరోధక విభాగం నిర్వహించిన దర్యాప్తునకు ఈ శ్రీలంక మాజీ సెలక్టర్ సహకరించకుండా విచారణను తిరస్కరిస్తున్నాడని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. అవినీతి నిరోధక యూనిట్‌కు సరిగ్గా సహకరించిన కారణంగా ఆర్టికల్ 2.46, ఆర్టికల్ 2.4.7 కింద జయసూర్య ఐసీసీ సోమవారం రెండు అభియోగాలు నమోదు చేసింది. తనపై వచ్చిన అభియోగాలపై జయసూర్య అక్టోబర్ 15 నుంచి 14 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.

అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అభియోగాలపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయాలనుకోవడం లేదని ఐసీసీ పేర్కొంది. అంతేకాదు ఎందుకు అభియోగాలు నమోదు చేశారన్న దానిపై ఐసీసీ పూర్తి వివరణ ఇవ్వలేకపోయింది. దీనిపై శ్రీలంక క్రికెట్‌ను సంప్రదించగా.. తాను సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ (ఏప్రిల్‌ 2016-ఆగస్టు 2017)గా ఉన్న సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఐసీసీ జరుపుతున్న దర్యాప్తుకు అడ్డుతగులుతున్నట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయని తెలిపింది.గాలె పిచ్ వ్యవహారంలో ఐసీసీ విచారణకు సహకరించని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

గతేడాది జులైలో శ్రీలంక, జింబాబ్వే మధ్య హంబన్‌టోటలో జరిగిన నాలుగో వన్డేలో ఫిక్సింగ్‌ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ మ్యాచ్‌లో జింబాబ్వే నెగ్గింది. ఆ తర్వాత జింబాబ్వే 3-2తో సిరీస్‌ను కూడా గెలుచుకుంది. శ్రీలంక జట్టు ప్రత్యర్థుల చేతుల్లో చిత్తుగా ఓడటంతో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడంతో గతేడాది జయసూర్య నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

శ్రీలంక తరుపున జయసూర్య 110 టెస్టులాడి 6,973 పరుగులు చేశాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సనత్ జయసూర్య 14 సెంచరీలు సాధించాడు.

Story first published: Tuesday, October 16, 2018, 7:45 [IST]
Other articles published on Oct 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X