న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2019 వరల్డ్‌కప్ టీమిండియాదే: సందేహం లేదన్న సచిన్ టెండూల్కర్

 Sachin Tendulkar terms India favourites for World Cup 2019, names toughest competitor

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా ఈ ఏడాది మేలో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియానే ఫేవరెట్‌ అనడంలో తనకు ఎలాంటి సందేహమేమీ లేదని క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్ అన్నారు. కోల్‌కతాలో ఫుల్‌ మారథాన్‌ను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం సచిన్ మీడియాతో మాట్లాడాడు. కివీస్ గడ్డపై దైపాక్షిక సిరీస్ సాధించిన టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సందర్భంగా టీమండియాకు ప్రపంచంలోని ఏ దేశంలోనైనా, ఏ పిచ్‌పై అయినా పోటీపడే సామర్థ్యం ఉందని సచిన్ చెప్పుకొచ్చారు. వన్డేల్లో వరుసగా దక్షిణాఫ్రికా(5-1), ఆస్ట్రేలియా(2-1), న్యూజిలాండ్(4-1)పై టీమ్ ఇండియా విజయాలను సాధించిన విషయాన్ని గుర్తు చేశాడు.

విజయాల రికార్డు పరిగణనలోకి

విజయాల రికార్డు పరిగణనలోకి

"వరుస విజయాల రికార్డు పరిగణనలోకి తీసుకుని నేను చెప్పడం లేదు. ప్రస్తుతం టీమిండియా జట్టు కూర్పు అద్భుతంగా ఉంది. ఈ కూర్పు ఈ జట్టు ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ఎక్కడైనా పోటీపడగలదు. ప్రస్తుతం టీమిండియా ప్రదర్శనలు చూస్తుంటే ఇంగ్లండ్‌లో జరుగనున్న ప్రపంచకప్ టోర్నీకి టీమ్ ఇండియా హాట్ ఫేవరెట్ అని చెబుతున్నా" అని సచిన్ అన్నాడు.

టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్ ఓడిపోయినా

టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్ ఓడిపోయినా

వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్ ఓడిపోయినా వన్డేల్లో ఆ జట్టు భీకరంగా కనిపిస్తుందన్నాడు. "ఇంగ్లాండ్‌ గడ్డపై త్వరగా జోరందుకోవడం ముఖ్యం. ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ కఠిన పోటీదారు. సొంతగడ్డపై ఇంగ్లండ్ కఠిన ప్రత్యర్థి అనడం వాస్తవం. న్యూజిలాండ్‌ సైతం అలాగే కనిపిస్తోంది" సచిన్ తెలిపాడు.

 స్మిత్‌, వార్నర్‌ జట్టులోకి వస్తే

స్మిత్‌, వార్నర్‌ జట్టులోకి వస్తే

"ప్రస్తుత సిరీస్‌లో కివీస్‌ ఇబ్బంది పడ్డా సరే ఆ జట్టు చాలా బాగుంది. ఎవరో ఒకరు నిలబడితే చాలు. స్టీవ్‌స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ జట్టులోకి వస్తే ఆసీస్‌ బలపడుతుంది. కానీ వన్డేల్లో కొన్ని ఓవర్లలో మ్యాచ్‌లు మలుపు తిరుగుతాయి. వారి బౌలర్లు జోరు చూపగలిగితే ఆసీస్ కూడా పోటీదారుగా మారుతుంది" అని సచిన్ తెలిపాడు,

మహిళలు దేశానికి పేరు తీసుకొస్తున్నారు

మహిళలు దేశానికి పేరు తీసుకొస్తున్నారు

ఇటీవలి కాలంలో క్రీడల్లో మహిళలు దేశానికి పేరు తీసుకొస్తున్నారని కొనియాడారు. హిమదాస్, ద్యుతీచంద్, స్వప్నబర్మన్ లాంటి యువ అథ్లెట్లను సచిన్ ప్రశంసించాడు. అంతేకాదు 2016 రియో ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గింది కూడా మహిళలేనని గుర్తు చేశాడు. బ్యాడ్మింటన్‌లో సింధు(రజతం), కుస్తీలో సాక్షిమాలిక్(కాంస్యం) పతకం నెగ్గిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, February 4, 2019, 10:00 [IST]
Other articles published on Feb 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X