న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా కప్: 'టీమిండియా గేమ్ ప్లాన్‌లో రోహిత్, ధావన్ ఆటే కీలకం'

By Nageshwara Rao
Rohit,Shikhar Key To India's Game-Plan In Asia Cup: Brett Lee
Rohit Sharma, Shikhar Dhawan key to Indias game-plan in Asia Cup: Brett Lee

హైదరాబాద్: ఆసియా కప్‌లో భారత్ జట్టు గెలవాలంటే ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌‌ అత్యుత్తమంగా ఆడాలని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్‌లీ సూచించాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సెప్టెంబరు 15 నుంచి ఆసియా కప్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే.

జహీర్ ఆదర్శం, ద్రవిడ్ ధైర్యం పెంచారు: యువ పేసర్ ఖలీల్ అహ్మాద్జహీర్ ఆదర్శం, ద్రవిడ్ ధైర్యం పెంచారు: యువ పేసర్ ఖలీల్ అహ్మాద్

ఆసియా కప్‌లో భాగంగా 18న క్వాలిఫయర్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడనున్న టీమిండియా ఆ తర్వాతి రోజైన 19న దాయాది దేశమైన పాకిస్థాన్‌తో తలపడనుంది. వర్క్‌లోడ్, రాబోయే సిరిస్‌లను దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్ కెప్టెన్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలో జట్టు గెలుపు బాధ్యతలను ఓపెనర్లు తీసుకోవాలని బ్రెట్ లీ సూచించాడు.

కెప్టెన్‌గా రోహిత్ శర్మ

కెప్టెన్‌గా రోహిత్ శర్మ

కోహ్లీ విశ్రాంతి నేపథ్యంలో సెలక్టర్లు రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఎంపిక చేయగా... వైస్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్‌ను ఎంపిక చేశారు. దీంతో కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మపై బాధ్యత మరింత పెరిగిందని బ్రెట్ లీ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా బ్రెట్ లీ మాట్లాడుతూ ఆసియా కప్‌లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌ ఆట భారత్‌కి చాలా కీలకమని చెప్పుకొచ్చాడు.

వీరిద్దరూ బాధ్యతగా ఆడాలి

వీరిద్దరూ బాధ్యతగా ఆడాలి

"రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో అందరి దృష్టి రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్)పై ఉంటుంది. కాబట్టి వీరిద్దరూ బాధ్యతగా ఆడి జట్టుని ముందుండి నడిపించాలి. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్లను రోహిత్ శర్మ సమర్థంగా ఎదుర్కోలేడు అనే వాదనతో నేను ఏకీభవించను" అని బ్రెట్ లీ అన్నాడు.

రోహిత్ బలహీనతతోనే టార్గెట్ చేస్తాయి

రోహిత్ బలహీనతతోనే టార్గెట్ చేస్తాయి

"ప్రత్యర్థి జట్లు కచ్చితంగా అతడిని ఆ బలహీనతతోనే టార్గెట్ చేస్తాయి. కానీ, యూఏఈ పిచ్‌లు రోహిత్ శర్మ ఆటకి చక్కగా సరిపోతాయి. కాబట్టి అతను మెరుగైన ప్రదర్శన చేయొచ్చు" అని బ్రెట్‌ లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ గడ్డపై పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.

శుక్రవారం నుంచి ఓవల్ వేదికగా ఐదో టెస్టు

శుక్రవారం నుంచి ఓవల్ వేదికగా ఐదో టెస్టు

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా చివరిదైన ఐదో టెస్టు శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సిరిస్‌ను 1-3తేడాతో కోహ్లీసేన చేజార్చుకున్న నేపథ్యంలో మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో చివరి టెస్టులోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది.

Story first published: Friday, September 7, 2018, 8:45 [IST]
Other articles published on Sep 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X