న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రైనా కామెంట్స్‌ విన్నా.. అవి సరైనవి కావు: రోహిత్

Rohit Sharma responds to Suresh Raina’s claim that he is the Next MS Dhoni
Suresh Raina Reveals The Name Of Best Fielder In The Present Indian Team

ముంబై: టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మను మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీతో పోల్చుతూ ఇటీవల సురేశ్‌ రైనా కామెంట్‌ చేసిన సంగతి తెలిసిందే. భారత క్రికెట్‌ జట్టులో హిట్‌మ్యాన్‌ మరో ధోనీ లాంటివాడని ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్‌గా ఉన్నప్పటికీ ప్రతీ ఆటగాడి సూచనలు, సలహాలకు విలువనిస్తాడని.. అందరినీ గౌరవిస్తాడని రైనా చెప్పుకొచ్చాడు. కాగా రైనా వ్యాఖ్యలపై రోహిత్‌ తాజాగా స్పందించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో రైనా ఇప్పటివరకు 18 టెస్టుల్లో, 226 వన్డేల్లో, 78 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

ధోనీతో పోలికపై రోహిత్‌ స్పందన:

ధోనీతో పోలికపై రోహిత్‌ స్పందన:

తన ట్వీటర్‌ అకౌంట్‌లో రోహిత్‌ శర్మ ఒక వీడియోలో మాట్లాడుతూ... 'నేను సురేశ్‌ రైనా కామెంట్స్‌ విన్నాను. నన్ను ఎంఎస్ ధోనీతో పోల్చాడు. ధోనీకి కొన్ని లక్షణాలు ఉంటాయి. అతనిలా ఎవ్వరూ ఉండలేరు. ప్రతీ మనిషి యొక్క గుణగణాలు సెపరేట్‌గా ఉంటాయి. అలానే ప్రతీ ఒక్కరికి ఒక్కో లక్షణం, ఒక్కో వ్యక్తిత్వం ఉంటాయి. రైనా చేసిన పోలిక సరైనవి కాదని నేను నమ్ముతున్నాను. నేను ఎప్పుడూ పోలికల్ని ఇష్టపడను. ప్రతీ ఒక్కరికీ ఒక్కో శైలి ఉంటుంది. అలానే బలాలు, బలహీనతలు కూడా ఉంటాయి' అని పేర్కొన్నాడు.

టీమిండియా నెక్ట్స్ ధోనీ తనే:

టీమిండియా నెక్ట్స్ ధోనీ తనే:

'మేము బంగ్లాదేశ్‌లో ఆసియా కప్ గెలిచినప్పుడు నేను రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడాను. అప్పుడు మరింత దగ్గరగా తనను గమనించాను. షార్దుల్ ఠాకూర్, వాషింగ్‌టన్‌ సుందర్‌, యుజ్వేంద్ర చహల్ వంటి యువ ఆటగాళ్లపై అతడు ఎలా విశ్వాసం చూపుతాడో నేను చూశాను. నాకు తెలిసి టీమిండియా తదుపరి ధోనీ ఎవరైనా ఉన్నారా అంటే రోహిత్‌ పేరే చెబుతాను. మహీలాగే రోహిత్ కూడా సానుకూల దృక్పథంతో ఉంటాడు. తనలాగే ఐపీఎల్‌ టైటిళ్లు గెలిచాడు. జట్టు సారథులుగా వాళ్లలో ఎన్నో సారూప్యతలను నేను చూశాను. సమస్యలు పరిష్కరించే తీరు గమనించాను. అందుకే నా పుస్తకంలో వారిద్దరిని అద్భుతమైన వ్యక్తులుగా అభివర్ణించాను' అని సురేష్ రైనా చెప్పుకొచ్చాడు.

 మోస్ట్‌ సక్సెస్‌ ఫుల్‌ కెప్టెన్:

మోస్ట్‌ సక్సెస్‌ ఫుల్‌ కెప్టెన్:

ఐపీఎల్‌ మోస్ట్‌ సక్సెస్‌ ఫుల్‌ కెప్టెన్‌ ఎవరైనా ఉ‍న్నారంటే అది రోహిత్‌ శర్మనే. నాలుగుసార్లు టైటిల్స్‌ గెలిచి రికార్డు సాధించాడు. ఇక్కడ ఎంఎస్ ధోనీ కంటే రోహిత్‌ ఒక టైటిల్‌ అధికంగానే గెలిచాడు. గతేడాది జరిగిన ఐపీఎల్‌లో రోహిత్‌ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌.. మహీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్ ‌(సీఎస్‌కే)ను ఓడించి నాల్గోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇక టీమిండియాకు పలుమార్లు రోహిత్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. రెగ్యులర్‌ కెప్టెన్లు గైర్హాజరీ అయిన క్రమంలో రోహిత్‌ కెప్టెన్‌గా వ్యహరించాడు. ఇక్కడ రోహిత్‌ విజయాల శాతం 80 శాతం ఉంది. రోహిత్‌ తన కెప్టెన్సీలో భారత్‌కు ఎనిమిది విజయాలు అందించాడు.

 రోహిత్‌ కెప్టెన్సీలో ఆడిన రైనా

రోహిత్‌ కెప్టెన్సీలో ఆడిన రైనా

ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో టీమిండియా, చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున ఎన్నో మ్యాచ్‌లు ఆడిన సురేశ్‌ రైనా.. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో నిదహాస్‌ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరినీ దగ్గరినుండి గమనించిన రైనా.. కెప్టెన్‌గా రోహిత్‌కు అద్భుతమైన ఆధారాలున్నాయని అభిప్రాయపడ్డారు. ధోనీ భారత్ తరఫున 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మరోవైపు రోహిత్ 32 టెస్టుల్లో, 224 వన్డేల్లో, 108 టీ20 మ్యాచ్‌ల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు.

భారత్‌పై ప్రపంచకప్‌లలో వైఫల్యం గురించి అడిగే.. అఫ్రిది ఏం చెప్పాడంటే?!!

Story first published: Monday, August 3, 2020, 12:55 [IST]
Other articles published on Aug 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X