న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 12 విజేత ఎవరో చెప్పేసిన జ్యోతిష్యుడు?

Rohit Sharma primed for success in IPL once again

హైదరాబాద్: ఐపీఎల్ 12వ సీజన్ తుది దశకు చేరుకుంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనున్నాయి. అయితే, ఈ మ్యాచ్ ఫలితం 2013, 2015 సీజన్ల మాదిరిగా ఉండనుందట. ఆ సీజన్లలో విజేతగా నిలిచిన ముంబై... ఆదివారం నాటి మ్యాచ్‌లో ట్రోఫీని సొంతం చేసుకోనుందంటూ ఓ జ్యోతిషుడు తెలిపాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

భారత జట్టులోని ఆటగాళ్ల జాతకం ప్రకారం

భారత జట్టులోని ఆటగాళ్ల జాతకం ప్రకారం

భారత జట్టులోని ఆటగాళ్ల జాతకం ప్రకారం ధోనీ కంటే ఎక్కువ ట్రోఫీలు గెలిచే అదృష్టం ఒక్క రోహిత్‌శర్మకు మాత్రమే ఉందని చెప్పుకొచ్చాడు. రోహిత్‌శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో ఉత్తమ కెప్టెన్‌ అవుతాడని కూడా ఈ సందర్భంగా తెలిపాడు. ఈసారి గ్రహాలన్నీ ముంబై ఇండియన్స్‌కే అనుకూలంగా ఉన్నాయని, జట్టులో ఆటగాళ్ల వయసు సగటు తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని చెప్పాడు.

గత సీజన్‌లో విజేతగా నిలిచిన చెన్నై

గత సీజన్‌లో విజేతగా నిలిచిన చెన్నై

ఐపీఎల్ 2018 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పుడు సీఎస్‌కే విజయానికి సహకరించిన యరేనస్‌ గ్రహం 2019లో రోహిత్‌శర్మకు అనుకూలంగా ఉందని ఆయన చెప్పుకొచ్చాడు. దీంతో పాటు ముంబై ఇండియన్స్ జట్టుకు ఓ సెంటిమెంట్ కూడా కలిసిరానుంది. 2013, 2015, 2017... ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ విజేతగా నిలిచిన సంవత్సరాలు.

రెండేళ్ల గ్యాప్‌తో ముంబై ఇండియన్స్ జట్టు కప్‌ కొడుతూ

రెండేళ్ల గ్యాప్‌తో ముంబై ఇండియన్స్ జట్టు కప్‌ కొడుతూ

దీనిని బట్టి చూస్తే రెండేళ్ల గ్యాప్‌తో ఈ జట్టు కప్‌ కొడుతూ వస్తోంది. ఇప్పుడు 2019 వచ్చింది. ఈ సెంటిమెంట్‌ ఫలిస్తే ఉప్పల్‌లో విజేతగా నిలిచేది ముంబై ఇండియన్సేనని అభిమానులు అంటున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో ఫైనల్‌ జరగడం ఇది రెండోసారి. వాస్తవానికి ఈ మ్యాచ్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సొంత మైదానమైన చెపాక్‌ స్టేడియంలో జరగాల్సి ఉన్నా స్టాండ్స్‌ వివాదం కారణంగా భాగ్య నగరానికి ఆతిథ్య భాగ్యం దక్కింది.

Story first published: Sunday, May 12, 2019, 17:57 [IST]
Other articles published on May 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X