న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీలానే నేను కూడా కెప్టెన్ కూల్: రోహిత్ శర్మ

Asia Cup 2018 : Rohit Sharma Feels He's Similar To 'Captain Cool' MS Dhoni
Rohit Sharma feels hes similar to Captain Cool MS Dhoni when it comes to calmness

న్యూ ఢిల్లీ: ఆసియాకప్ టోర్నీలో జట్టును విజయవంతంగా నడిపించి మరోసారి తన కెప్టెన్సీని రుజువు చేసుకున్నాడు టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ. తాను ఈ టోర్నీని విజయవంతంగా ముగించడం పట్ల రోహిత్.. తాను కెప్టెన్సీలో మహేంద్ర సింగ్ ధోనీలానే కూల్‌గా వ్యవహరిస్తానంటూ చెప్పుకొచ్చాడు. టీమిండియా కెప్టెన్ కోహ్లీ లేకపోవడంతో తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును గెలిపించేందుకు టీమిండియాపై వచ్చిన ఒత్తిడులను తట్టుకున్నాడు. ఈ సందర్భంగా రోహిత్ మీడియాతో మాట్లాడాడు.

' ఇన్ని సంవత్సరాలుగా ధోనీ కెప్టెన్సీ చూస్తూ వచ్చాను. అతనెప్పుడూ కంగారుకు గానీ, ఆందోళనకు గానీ గురవలేదు. అలాంటి గుణాలు నాలో నాయకత్వ లక్షణాలు పెంపొందేందుకు కారణమైయ్యారు. నేను జరిగిన వెంటనే స్పందించను. కొద్ది సమయం వరకూ ఆలోచిస్తా. ఏది సరైనదో అనిపిస్తే అదే చేస్తా. చాలా ఏళ్లుగా ధోనీ కెప్టెన్సీలో ఆడాం. మేం ఎప్పటికీ ధోనీ దగ్గ ర నేర్చుకుంటూనే ఉంటాం.'

1
44058

కానీ, ప్రస్తుత టోర్నీలో మాత్రం ధోనీ తన బ్యాటింగ్ వేగాన్ని అందుకోలేకపోయాడు. కానీ, కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మకు మాత్రం చక్కని సలహాలు.. సూచనలు ఇచ్చాడు. ఇప్పటి వరకూ టీమిండియాకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ చేతిలో రెండు ట్రోఫీల టైటిళ్లు కైవసం చేసుకున్నాడు.

దుబాయ్ వేదికగా ముగిసిన ప్రతిష్టాత్మక టోర్నీ ఆసియా కప్ విజేతగా టీమిండియా నిలిచింది. ఫైనల్‌కు అర్హత సాధించిన భారత్.. బంగ్లాలు హోరాహోరీగా పోరాడి ఆఖరి నిమిషం వరకూ ఉత్కంఠను లేపాయి. శుక్రవారం అర్ధరాత్రి ముగిసిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ తప్పిదాల కారణంగానే భారత్ చేతిలో తమ జట్టు ఓడిపోయిందని బంగ్లాదేశ్ కెప్టెన్ మొర్తజా ఆవేదన వ్యక్తం చేశాడు.

Story first published: Saturday, September 29, 2018, 15:10 [IST]
Other articles published on Sep 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X