న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దుబాయ్‌లో క్రిస్మస్‌ వేడుకలు.. ధోనీతో ఎంజాయ్ చేసిన పంత్ (వీడియో)!!

Rishabh Pant celebrates Christmas with MS Dhoni in Dubai

దుబాయ్‌: ప్రపంచ వ్యాప్తంగా బుధవారం క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్‌ పర్వదినాన్ని క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రిస్మస్ వేడుకలను కొందరు సెలబ్రిటీలు తమ సన్నిహితులు, స్నేహితులతో కలిసి తెగ ఎంజాయ్ చేశారు. టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్‌ పంత్‌ ఈ సారి క్రిస్మస్ వేడుకలను మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీతో కలిసి ఘనంగా జరుపుకున్నాడు.

అవి చెత్త ర్యాంకింగ్స్.. ఐసీసీపై మండిపడ్డ మైకేల్‌ వాన్‌!!అవి చెత్త ర్యాంకింగ్స్.. ఐసీసీపై మండిపడ్డ మైకేల్‌ వాన్‌!!

దుబాయ్‌లో ధోనీ సందడి:

దుబాయ్‌లో ధోనీ సందడి:

క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌ కోసం ధోనీ దుబాయ్‌ వెళ్లాడు. ధోనీతో పాటు అతని స్నేహితులు, పంత్‌ వెళ్ళారు. అందరూ కలిసి దుబాయ్‌లోని ఓ హోటల్లో క్రిస్మస్‌ వేడుకలు జరుపుకుని ఎంజాయ్ చేశారు. అనంతరం విందు చేశారు. ఇక్కడ పంత్ సందడి చేసాడు. ఈ వేడుకలకు సంబందించిన ఫొటోలు, వీడియోలను 'ఎంఎస్ ధోనీ ఫాన్స్ ఆఫీషియల్' తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

జూనియర్‌ సీనియర్‌ క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌:

జూనియర్‌ సీనియర్‌ క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌:

ధోనీ క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌కు సంబందించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. నెటిజన్లు తమదైన స్టయిల్లో కామెంట్‌ చేస్తున్నారు. 'జూనియర్‌ సీనియర్‌ క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ధోనీ, పంత్‌ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. ధోనీని పంత్‌ తరుచూ కలుస్తున్నాడు. ఇటీవలే ధోనీని పంత్ కలిసిన విషయం తెలిసందే. కుటుంబ స్నేహితుడిగా, ఆట పరమైన టెక్నిక్‌లు తెలసుకోవడానికి ధోనీని కలుస్తున్నాడని మహీ సన్నిహితులు అంటున్నారు.

తాత్కాలిక విరామం:

చివరిసారిగా ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో ఆడిన ధోనీ మైదానంలోకి దిగి ఐదు నెలలకు పైగా అవుతోంది. ప్రపంచకప్‌ ముగిసిన అనంతరం భారత ఆర్మీలో పనిచేయాలని రెండు నెలలు క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. విరామం సమయం ముగిసి కూడా మరో మూడు నెలలు కావస్తున్నా.. ధోనీ భారత సెలెక్టర్లకు సరైన సమాచారం ఇవ్వలేదు. అయితే ఇటీవలే ధోనీని అడగ్గా.. జనవరి వరకు ఏం అడగొద్దు అని అన్నాడు.

బ్యాట్‌తో మెరిసిన పంత్:

రిషబ్ పంత్ ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో ధోనీ వారసుడిగా కొనసాగుతున్నాడు. అయితే అస్థిరమైన ప్రదర్శన కారణంగా ఇప్పటికే టెస్టులలో తన స్థానాన్ని కోల్పోయాడు. వృద్దిమాన్ సాహా పోటీ పడుతున్నాడు. ఇక పరిమిత ఫార్మాట్‌లలో మాత్రం కొనసాగుతున్నాడు. తాజాగా ముగిసిన వెస్టిండీస్ సిరీస్‌లో బ్యాట్‌తో మెరిసిన పంత్.. గాడిలో పడ్డాడు. జనవరిలో లంక, ఆసీస్ సిరీస్‌లలో కూడా సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నాడు.

Story first published: Thursday, December 26, 2019, 11:42 [IST]
Other articles published on Dec 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X