న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సఫారీలను కట్టడి చేసేనా?: అశ్విన్ పుట్టినరోజు స్పెషల్!

Ravichandran Ashwin, fastest to 300 Test wickets, turns 33 today

హైదరాబాద్: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మంగళవారం (సెప్టెంబర్ 17)న 33వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అశ్విన్‌కు ప్రస్తుత క్రికెటర్లతో పాటు మాజీ క్రికెటర్లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

టెస్టుల్లో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుని సృష్టించిన అశ్విన్ భారత్ తరుపున ఇప్పటివరకు 65 టెస్టులాడి 25.44 యావరేజితో 342 వికెట్లు పడగొట్టాడు. 2014లో భారత ప్రభుత్వం నుంచి అర్జున అవార్డు అందుకున్న అశ్విన్... 2016లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను అందుకున్నాడు.

<strong>హోమ్‌టౌన్‌లో ఘనస్వాగతం: కెనడాలో ఓ వీధికి యుఎస్ ఓపెన్ విజేత పేరు</strong>హోమ్‌టౌన్‌లో ఘనస్వాగతం: కెనడాలో ఓ వీధికి యుఎస్ ఓపెన్ విజేత పేరు

అక్టోబర్ 2 నుంచి సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో

ప్రస్తుతం అశ్విన్ అక్టోబర్ 2 నుంచి సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరగబోయే టెస్టు సిరిస్‌కు సన్నద్ధమవుతున్నాడు. 2015లో సఫారీ జట్టు భారత పర్యటనకు వచ్చిన సమయంలో దక్షిణాఫ్రికాపై 31 వికెట్లు తీసి 3-0తో టెస్టు సిరిస్‌ను నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు. 2010లో హరారే వేదికగా వన్డేల్లో శ్రీలంకపై అశ్విన్‌ అరంగేంట్రం చేశాడు.

2011లో వెస్టిండీస్‌పై సుదీర్ఘ ఫార్మాట్‌లో

ఆ తర్వాత టీ20ల్లోకి అరంగేట్రం చేసిన అశ్విన్ తన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టులోని ఆటగాళ్లను ఇబ్బందికి గురిచేశాడు. ఆ మరుసటి ఏడాది 2011లో వెస్టిండీస్‌పై సుదీర్ఘ ఫార్మాట్‌లో అడుగుపెట్టాడు. 8 వికెట్లు తీసి అరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన భారత రెండో బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు.

18 టెస్టుల్లోనే 100 వికెట్లు

ఈ జాబితాలో భారత మాజీ బౌలర్ నరేంద్ర హీర్వాణి (16 వికెట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక, 16 టెస్టుల్లోపే 9 సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు. 18 టెస్టుల్లోనే 100 వికెట్లు ఖాతాలో వేసుకొని అత్యంత వేగంగా వంద వికెట్లు సాధించిన ఎర్రపల్లి ప్రసన్న రికార్డును సైతం అశ్విన్ బద్దలు కొట్టాడు.

టెస్టుల్లో అశ్విన్ అత్యుత్తమం 7/59

ఇక, టెస్టుల్లో అశ్విన్ అత్యుత్తమం 7/59. అంతేకాదు ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లను 26 సార్లు... పది వికెట్లను 7 సార్లు సాధించాడు. చైనామన్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహాల్‌లు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేయడంతో అశ్విన్ ప్రస్తుతం సుదీర్ఘ ఫార్మాట్‌కే పరిమితమయ్యాడు.

Story first published: Tuesday, September 17, 2019, 13:54 [IST]
Other articles published on Sep 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X