న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Rashid Khan: ఆ విషయాన్ని నా మదిలో ఎప్పటికీ గుర్తుంచుకుంటా: రషీద్‌

Rashid Khan says Getting MS Dhoni, Virat Kohlis wickets is a big achievement
Afghanistan Captaincy కి No, నాయకుడిని కానీ,ప్లేయర్ నే - Rashid Khan || Oneindia Telugu

కాబుల్: భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ, ప్రస్తుత టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్‌లను ఔట్‌ చేసిన విషయాన్ని తన మదిలో ఎప్పటికీ గుర్తుంచుకుంటానని అఫ్ఘనిస్థాన్‌ స్టార్ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో రషీద్‌ ఈ ముగ్గురిని చాలాసార్లు ఔట్‌ చేశాడు. తాజాగా ఈ విషయాన్ని రషీద్‌ గుర్తుచేసుకున్నాడు. ఐపీఎల్‌ ప్రాంఛైజ్ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. రషీద్‌ అఫ్గాన్ తరఫున 5 టెస్టులు, 74 వన్డేలు, 51 టీ20లు ఆడాడు.

Sunil Gavaskar: ఆ ఒక్క బలహీనత కారణంగా.. టీమిండియా కోచ్ పదవికి దూరంగా ఉన్నా: సన్నీSunil Gavaskar: ఆ ఒక్క బలహీనత కారణంగా.. టీమిండియా కోచ్ పదవికి దూరంగా ఉన్నా: సన్నీ

తాజాగా రషీద్‌ ఖాన్‌ మాట్లాడుతూ... 'నిజం చెప్పాలంటే నాకెన్నో మరపురాని వికెట్లున్నాయి. కానీ టీ20ల్లో నా ఉత్తమమైన మూడు వికెట్లు ఎంఎస్ ధోనీ, విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ మాత్రమే. ఈ ముగ్గురికి నేను బౌలింగ్‌ చేశా. చాలా సార్లు వీరిని ఔట్‌ చేశా. కొన్నిసార్లు క్యాచ్‌లు, మరికొన్ని సార్లు ఎల్బీడబ్ల్యూల రూపంలో పెవిలియన్‌కు పంపించాను. ఇలాంటి దిగ్గజాలకు బౌలింగ్‌ చేయడం నాకు దక్కిన పెద్ద ఘనత. వీరికి బౌలింగ్‌ చేయడం చాలా కష్టమైన పని. ఈ ముగ్గురిని ఔట్‌ చేసిన విషయాన్ని నా మదిలో ఎప్పటికీ గుర్తుంచుకుంటా' అని అన్నాడు.

దిగ్గజ క్రికెటర్​ సచిన్​ టెండుల్కర్​కు బౌలింగ్​ చేయడం తనకు చాలా సంతోషాన్నిస్తుందని రషీద్ ఖాన్ తెలిపాడు​. గత 13 ఏళ్ల వన్డే కెరీర్​లో సచిన్​ను తాను ఒకే ఒక్కసారి ఔట్​ చేసిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు.'లెగ్ స్పిన్​లో సచిన్​ ఔట్ కావడం చాలా అరుదు. అయినా ఆయన్ను ఔట్​ చేయడం కన్నా బౌలింగ్​ చేయడానికే ఎక్కువ అనందపడతాను. ఎందుకంటే మాస్టర్​కు బౌలింగ్​ చేయాలన్న నా కల నిజమైంది' అని చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2021లో రషీద్‌ ఖాన్‌ అద్భుతంగా రాణించాడు. సహచర బౌలర్లు భారీగా పరుగులు ఇచ్చినా.. అతడు మాత్రం ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను కట్టడిచేశాడు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది. 7 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒకటి గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. బయో బబుల్ మధ్య సజావుగా సాగుతున్న ఐపీఎల్ 2021‌పై కరోనా కమ్మేసింది. లీగ్ వాయిదా పడే సమయానికి 29 మ్యాచ్‌లు పూర్తవ్వగా.. మరో 31 మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉంది. అయితే సెప్టెంబర్‌లో ఈ క్యాచ్ రిచ్ లీగ్ సెకండ్ ఫేజ్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు చేస్తుంది. యూఏఈ వేదికలను బీసీసీఐ పరిశీలిస్తోంది.

Story first published: Monday, June 7, 2021, 10:39 [IST]
Other articles published on Jun 7, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X