న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెప్టెన్‌గా గర్వపడుతున్నా: రెండో టీ20లో విజయంపై విండిస్ కెప్టెన్ పొలార్డ్

India vs West Indies 2nd T20 : Kieron Pollard Lauds Team Mates After 8-Wicket Win Over India
Pride myself on being a leader: Kieron Pollard lauds teammates after 8-wicket win over India

హైదరాబాద్: జట్టులోని యువ ఆటగాళ్లను చూసి ఎంతో సంతోషిస్తున్నానని విండిస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ అన్నాడు. తిరువనంతపురం వేదికగా ఆదివారం టీమిండియాతో జరిగిన రెండో టీ20లో వెస్టిండిస్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగత తెలిసిందే. ఫలితంగా మూడు టీ20ల సిరిస్ 1-1తో సమం అయింది.

మ్యాచ్ అనంతరం కీరన్ పొలార్డ్ మాట్లాడుతూ "తొలి మ్యాచ్‌ తర్వాత గొప్పగా పుంజుకున్నాం. నా అద్భుతమైన ఓవర్ తర్వాత టీమిండియాను 170 పరుగులకే కట్టడి చేశాం. ఇది చాలా అద్భుతంగా ఉంది. చేధనలో భాగంగా సరైన ప్లాన్‌తోనే బరిలోకి దిగాం. మా బ్యాట్స్‌మెన్‌ అద్భుతంగా ఆడారు" అని అన్నాడు.

వీడియో: వన్‌డౌన్‌లో శివమ్ దూబేని పంపడం వెనుక ప్రధాన కారణమిదే!వీడియో: వన్‌డౌన్‌లో శివమ్ దూబేని పంపడం వెనుక ప్రధాన కారణమిదే!

"కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో రాణించిన యువ ఆటగాళ్లు కొంత మంది ఈ మ్యాచ్‌లో చక్కగా ఆడారు. వారిని చూసి ఎంతో సంతోషిస్తున్నా. భారత్‌లో ఎన్నో మ్యాచులు ఆడాను. నా అనుభవాన్ని సహచరులతో పంచుకునేందుకు కెప్టెన్‌గా గర్విస్తున్నా. కొన్ని విభాగాల్లో ఇంకా మేము మెరుగవ్వాలి" అని పొలార్డ్ చెప్పుకొచ్చాడు.

"ముఖ్యంగా వైడ్స్‌, నోబాల్స్‌ను సాధ్యమైనంత నియంత్రించుకోవాలి. వాంఖడేలో జరగనున్న మూడో టీ20లో చక్కగా ఆడుతాం" అని పొలార్డ్ అన్నాడు. మూడు టీ20ల సిరిస్‌లో విజేత ఎవరో ఆఖరి టీ20లో నిర్ణయించబడుతుంది. ముంబైలోని వాంఖడే స్డేడియంలో బుధవారం ఆఖరి టీ20 జరగనుంది.

త్వరలో పెళ్లి మోగనున్న పెళ్లి బాజాలు: అజహర్ కోడలు కానున్న సానియా మిర్జా చెల్లిత్వరలో పెళ్లి మోగనున్న పెళ్లి బాజాలు: అజహర్ కోడలు కానున్న సానియా మిర్జా చెల్లి

ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలి టీ20లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియాకు రెండో మ్యాచ్‌లో ఓటమి తప్పలేదు. ఫీల్డింగ్‌ తప్పిదాల కారణంగా టీమిండియాకు ఓటమి తప్పలేదు. 171 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంకో 9 బంతులుండగానే ఛేదించింది.

లెండిల్‌ సిమన్స్‌ (67 నాటౌట్‌; 45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ ఆరంభంలో నెమ్మదిగా ఆడిన సిమన్స్‌ ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడాడు. మరో ఓపెనర్‌ లూయిస్‌ (40; 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులు)తో కలిసి అతను తొలి వికెట్‌కు 73 పరుగులు జోడించాడు.

Ranji Trophy 2019-20: మైదానంలోకి పాము, భయపడ్డ ఆటగాళ్లు, నిలిచిన ఆట (వీడియో)Ranji Trophy 2019-20: మైదానంలోకి పాము, భయపడ్డ ఆటగాళ్లు, నిలిచిన ఆట (వీడియో)

ఆ తర్వాత హెట్‌మయర్‌ (23) అతడికి తోడుగా నిలిచాడు. రెండో వికెట్‌ పడ్డాక సిమన్స్‌తో కలిసి పూరన్‌ (38 నాటౌట్‌; 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు) మెరుపులు మెరిపించాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసింది. దూబె (54; 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

Story first published: Monday, December 9, 2019, 15:01 [IST]
Other articles published on Dec 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X