న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రీతి జింటా ట్వీట్ మిస్‌ఫైర్: సగం తెలివి చాలా ప్రమాదకరమన్న ఓ నెటిజన్

Preity Zinta goofs up while congratulating India for Australia Test series victory

హైదరాబాద్: ఆసీస్ గడ్డపై తొలిసారి టెస్టు సిరిస్ నెగ్గిన కోహ్లీసేనను అభినందించే క్రమంలో బాలీవుడ్‌ నటి, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సహ యజమాని ప్రీతి జింటా 'తప్పు'గా ట్వీట్ చేశారు. టెస్టు సిరీస్‌ విజయం అని అనకుండా టెస్టు మ్యాచ్‌ విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు అంటూ ట్వీట్‌ చేశారు.

<strong>మ్యాచ్ ఫలితాన్ని మార్చిన మార్టిన్ గుప్టిల్ కళ్లు చెదిరే క్యాచ్ (వీడియో)</strong>మ్యాచ్ ఫలితాన్ని మార్చిన మార్టిన్ గుప్టిల్ కళ్లు చెదిరే క్యాచ్ (వీడియో)

"ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు మ్యాచ్ నెగ్గిన తొలి ఆసియా జట్టుగా రికార్డు సాధించిన బాయ్స్ ఇన్ బ్లూకు అభినందనలు. టీమిండియా విజయంలో ఛటేశ్వర్ పుజారా కీలక పాత్ర పోషించాడు" అని ట్వీట్ చేసింది. అయితే, ఆమె చేసిన ట్వీట్‌లో టీమిండియాను 'బాయ్స్ ఇన్ బ్లూ' అని వాడడంపైనా నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు.

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రమే బ్లూ జెర్సీని

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రమే బ్లూ జెర్సీని

టీమిండియా ఆటగాళ్లు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రమే బ్లూ జెర్సీ ధరిస్తారు.. అది కూడా తెలియదా? అంటూ ఓ నెటిజన్ ప్రీతి జింటాను ఎద్దేవా చేయగా... మరొక నెటిజన్ 'సగం తెలివి చాలా ప్రమాదకరం' అంటూ ట్వీట్ చేశాడు. నెటిజన్లు కామెంట్లతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రీతి జింటా చివరకు తన ట్వీట్‌ను డిలీట్ చేయడం విశేషం.

సిడ్నీ టెస్టు డ్రాగా ముగియడంతో

సిడ్నీ టెస్టు డ్రాగా ముగియడంతో

సిడ్నీ టెస్టు డ్రాగా ముగియడంతో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-1తో సొంతం చేసుకని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించగా, పెర్త్‌లో జరిగిన రెండో టెస్టులో ఆసీస్‌ 146 పరుగుల తేడాతో నెగ్గింది.

2-1తో టెస్టు సిరిస్ కైవసం

2-1తో టెస్టు సిరిస్ కైవసం

ఆ తర్వాత మెల్‌ బోర్న్‌ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 137 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించి సిరిస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచి టెస్టు సిరిస్‌ను సొంతం చేసుకుంది. ఈ సిరిస్‌లో పుజారా 521 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా, భారత బౌలర్లలో బుమ్రా (21 వికెట్లు) అగ్రస్థానంలో నిలవగా షమీ 16 వికెట్లు, ఇషాంత్‌ శర్మ 11 వికెట్లు పడగొట్టారు.

వన్డే సిరిస్‌కు సిద్ధమవుతోన్న టీమిండియా

వన్డే సిరిస్‌కు సిద్ధమవుతోన్న టీమిండియా

ఆసీస్ గడ్డపై తొలిసారి టెస్టు సిరిస్‌ను గెలుచుకుని టీమిండియా మూడు వన్డేల సిరిస్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్‌ శర్మ, కేదార్‌ జాదవ్‌, ఖలీల్‌ అహ్మద్‌ సోమవారం ఆస్ట్రేలియాకు పయనమయ్యారు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే జనవరి 12న సిడ్నీ వేదికగా జరగనుంది.

Story first published: Tuesday, January 8, 2019, 15:12 [IST]
Other articles published on Jan 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X