న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ10 లీగ్: 47ఏళ్ల వయసులో తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించిన తాంబే

Pravin Tambe becomes the first bowler to take a five-fer in T10 League

హైదరాబాద్: షార్జా వేదికగా జరుగుతున్న టీ10 లీగ్‌లో ప్రవీణ్‌ తాంబే సంచలన ప్రదర్శన చేశాడు. 47 ఏళ్ల ప్రవీణ్‌ తాంబే ఈ మ్యాచ్‌లో 5 వికెట్లు తీశాడు. ఇందులో హ్యాట్రిక్‌ వికెట్లు కూడా ఉండటం విశేషం. తద్వారా టీ10 ఫార్మాట్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డ్‌ నెలకొల్పాడు. దీనికి తోడు ఈ ఫార్మాట్‌లో హ్యాట్రిక్‌ సాధించిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.

 గురువారం సింధీస్‌-కేరళ నైట్స్‌ జట్ల మధ్య మ్యాచ్

గురువారం సింధీస్‌-కేరళ నైట్స్‌ జట్ల మధ్య మ్యాచ్

టీ10 లీగ్ రెండో ఎడిషన్‌లో భాగంగా గురువారం సింధీస్‌-కేరళ నైట్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సింధీసు జట్టు కేరళ నైట్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో కేరళ్ నైట్స్ ఓపెనర్లు క్రిస్‌గేల్‌, ఇయాన్‌ మోర్గాలన్‌లను తొలి ఓవర్‌లోనే ప్రవీణ్ తాంబే పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత మ్యాచ్‌లో భాగంగా కీరన్ పొలార్డ్‌ను సైతం డకౌట్‌ చేశాడు.

రెండు ఓవర్లు 5 వికెట్లు తీసి 15 పరుగులిచ్చిన తాంబే

మొత్తంగా ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసిన తాంబే 5 వికెట్లు తీసి 15 పరుగులిచ్చాడు. తాంబే అద్భుత ప్రదర్శన చేయడంతో తొలుత ఇబ్బంది పడిన కేరళ నైట్స్ జట్టు చివరకు దూకుడుగా ఆడటంతో నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. అనంతరం 104 పరుగుల లక్ష‍్యంతో బరిలోకి దిగిన సింధీస్‌ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

తాంబేపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం

తాంబేపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం

ఈ మ్యాచ్‌లో కేరళ నైట్స్ కెప్టెన్‌ షేన్‌ వాట్సన్‌ హాఫ్‌ సెంచరీ (50 నాటౌట్‌)తో రాణించగా డేవ్‌సిచ్‌ (49) సూపర్‌ ఇన్నింగ్స్‌తో 7.4 ఓవర్లకే సింధీస్ జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ప్రవీణ్‌ తాంబే ప్రదర్శనపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతేకాదు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని అందుకున్నాడు.

Story first published: Friday, November 23, 2018, 12:26 [IST]
Other articles published on Nov 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X