న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'టెస్టు సిరిస్‌కు ఇద్దరు స్పెషలిస్టు వికెట్‌ కీపర్లను ఎంచుకోండి'

By Nageshwara Rao
Pick Two Specialist Keepers for Tests in England Advises Former India Gloveman Kiran More

హైదరాబాద్: ఆగస్టు 1 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు టీమిండియా ఇద్దరు స్పెషలిస్టు వికెట్‌ కీపర్లను ఎంచుకోవాలని మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే సలహా ఇచ్చాడు. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ నేపథ్యంలో బీసీసీఐ సెలక్టర్లు బుధవారం ఇంగ్లాండ్‌తో తలపడే టీమిండియాను ప్రకటించనున్నారు.

ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో కిరణ్ మోరే మాట్లాడుతూ "ఆతిథ్య ఇంగ్లాండ్‌తో టీమిండియా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. దీంతో భారత్‌ తప్పనిసరిగా ఇద్దరు స్పెషలిస్టు వికెట్‌ కీపర్లను ఎంచుకోవాలి. ఎందుకంటే సిరీస్‌ మధ్యలో ఎవరైనా గాయపడినా, అనుకోకుండా అనారోగ్య సమస్యల పాలైనా మరొకరు అందుబాటులో ఉంటారు" అని అన్నాడు.

దినేశ్‌ కార్తీక్‌ బాగా బ్యాటింగ్‌ చేశాడు

దినేశ్‌ కార్తీక్‌ బాగా బ్యాటింగ్‌ చేశాడు

"ఇంగ్లాండ్‌పై వన్డే, టీ20 సిరీస్‌ల్లో దినేశ్‌ కార్తీక్‌ బాగా బ్యాటింగ్‌ చేశాడు. అనుభవం ఉన్న ఆటగాడు కూడా. ఒకవేళ సాహా అందుబాటులో లేకపోతే దినేశ్‌ కార్తీక్‌, పార్దివ్‌ పటేల్‌లో ఎవరినో ఒకరిని తీసుకోవాలి. వీరిని నాలుగు లేదా ఐదు స్థానాల్లో ఆడించాలి. పార్దివ్‌ను ఓపెనర్‌గా కూడా పంపొచ్చు" అని కిరణ్ మోరే సూచించాడు.

పార్దీవ్ పటేల్‌కు మంచి రికార్డు

పార్దీవ్ పటేల్‌కు మంచి రికార్డు

"దేశవాళీ క్రికెట్‌లో పార్దీవ్ పటేల్‌కు మంచి రికార్డు ఉంది. ఈ ఏడాది మొదట్లో దక్షిణాఫ్రికాతో ఓ టెస్టులో పార్దివ్‌ పటేల్ సరిగా ఆడలేదని అతడిని ఎంపిక చేయకపోవడం ఎంతమాత్రం సరికాదు" అని చెప్పాడు. ఇక, ఐదు వన్డేల సిరిస్‌లో విజయం ఎవరిదన్న ప్రశ్నకు ఆయన సరైన సమాధానం చెప్పలేకపోయాడు.

 టెస్టు సిరిస్‌లో గెలుపెవరిదో చెప్పడం కష్టం

టెస్టు సిరిస్‌లో గెలుపెవరిదో చెప్పడం కష్టం

"ఈ సిరీస్‌లో ఎవరు గెలుస్తారని ముందు చెప్పడం చాలా కష్టం. మ్యాచ్‌ ఫలితాలన్ని పిచ్‌లపై ఆధారపడి ఉన్నాయి. బంతి బాగా తిరుగుతుంది అనుకుంటే ఇద్దరు సిన్నర్లతో ఆడాలి. లీడ్స్‌ లాంటి మైదానంలో ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగితే సరిపోతుంది. దక్షిణాఫ్రికాతో పోలిస్తే ఇంగ్లాండ్‌లో పిచ్‌లు పేసర్లకు అనుకూలిస్తాయి" అని అన్నాడు.

 ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఓ సవాల్ లాంటింది

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఓ సవాల్ లాంటింది

"ఇరు జట్లకు ఈ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఓ సవాల్ లాంటింది. ఈ ఏడాది మొదట్లో సఫారీ పర్యటనకు వెళ్లిన టీమిండియా మెరుగైన ప్రదర్శన చేసింది. ఇదే ప్రదర్శనను పునరావృతం చేస్తే ఈ టెస్టు సిరిస్‌లో గెలిచే అవకాశాలు టీమిండియాకు ఎక్కువగా ఉంటాయి" అని చెప్పుకొచ్చాడు.

సాహా ఔట్: రిషబ్ పంత్ ఇన్

ఈ ఏడాది ఐపీఎల్‌ జరిగే సమయంలో వృద్ధిమాన్‌ సాహా గాయపడిన సంగతి తెలిసిందే. ఇంకా సాహా గాయం నుంచి కోలుకోలేదు. దీంతో అతడని ఇంగ్లాండ్‌తో టెస్టు సిరిస్‌కు ఎంపిక చేయలేదు. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగే మొదటి మూడు టెస్టులకు బీసీసీఐ భారత జట్టుని ప్రకటించింది.

Story first published: Wednesday, July 18, 2018, 15:37 [IST]
Other articles published on Jul 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X