న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ హెల్మెట్‌ను తాకిన జాన్సన్ బౌన్సర్... ఆసీస్ జట్టు ఆటగాళ్ల హడావుడి (ఫోటోలు, వీడియో)

By Nageswara Rao

ఆస్టేలియా దేశవాళీ టోర్నమెంట్‌లో ఆసీస్ క్రికెటర్ ఫిల్ హ్యూస్ బౌన్సర్ తగిలి మృతి చెందడంతో బౌలర్లు బౌనర్స్ వేయడానికి ఆసక్తి కనబర్చడం లేదు. ఐతే భారత్ - ఆస్టేలియాల మధ్య జరుగుతున్న అడిలైడ్‌లో జరుగుతున్న తొలి టెస్టులో అనుకోకుండా పేసర్ మిచెల్ జాన్సన్ బౌన్సర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ హెల్మెట్‌కు తగలడంతో ఆస్టేలియా జట్టు ఆటగాళ్లు హుటాహుటిన విరాట్ కోహ్లీని చేరుకున్నారు. ఏమీ అవకడం పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

వివరాల్లోకి వెళితే తొలి టెస్టు మూడో రోజు భారత్ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. మురళీ విజయ్ 53 పరుగులు చేసి జాన్సన్ బౌలింగ్‌లో హాడిన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విరాట్ కోహ్లీకి అనుకోకుండా జాన్సన్ షార్ట్ పిచ్ బంతి డెలివరీ చేశాడు. ఈ బంతి ఒక్కసారిగా విరాట్ కోహ్లీ హెల్మెట్‌కు తగిలింది.

PHOTOS and VIDEO: Kohli hit on the helmet by Johnson bouncer, Aussies rattled

దీంతో మిచెల్ జాన్సన్ పరుగెత్తుకుంటూ వచ్చి విరాట్ కోహ్లీని చెక్ చేశాడు. కెప్టెన్ మైఖెల్ క్లార్క్‌తో పాటు మిగతా జట్టు సభ్యులు ఒక్కసారిగా జరిగిన పరిణామాన్ని గుర్తించి విరాట్ కోహ్లీ వద్దకు వెళ్లి పలకరించగా ఏమీ అవలేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.

కెప్టెన్ క్లార్క్ అమితంగా ప్రేమించే తన సోదరుడు లాంటి ఫిల్ హ్యూస్ మృతితో ఈ సన్నివేశాన్ని ఊహించుకుని కొద్ది సేపు మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత పేసర్ మిచెల్ జాన్సన్ తలతో పాటు భుజాలపై నిమిరాడు. అంఫైర్లు కూడా కోహ్లీ వద్దరు పరిగెత్తు కుంటూ వెళ్లి చెక్ చేశారు.

PHOTOS and VIDEO: Kohli hit on the helmet by Johnson bouncer, Aussies rattled

బౌన్సర్ తగిలి ఆసీస్ క్రికెటర్ ఫిల్ హ్యూస్ మృతి చెందిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో బౌన్సర్లపై పెద్ద ఎత్తున డిబేట్ నడస్తున్న విషయం తెలిసిందే. ఐతే మాజీలు మాత్రం బౌన్సర్లను కొనసాగించాలని కోరుకుంటున్నారు. బ్యాట్స్ మెన్స్ మాత్రం ఈ బౌన్సర్లను దాటికి తట్టుకునేందుకు అవసరమైన రక్షిణ పరికరాలను ధరించాలని సూచిస్తున్నారు.

ఆఫర్స్ జోన్: రూ.299 స్టోర్ సేల్

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X