న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Asia XI vs World XI: బీసీసీఐ తన అక్కసుని వెళ్లగక్కిన పాక్ క్రికెట్ బోర్డు

PCB accuses BCCI of ‘twisting’ facts regarding the availability of Pakistan players in Asia XI vs World XI T20s

హైదరాబాద్: పాకిస్థాన్ క్రికెటర్లకు ఆసియా ఎలెవన్‌ జట్టులో చోటు దక్కక పోవడం వెనుక బీసీసీఐ ఉందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన అక్కసుని మరోసారి వెళ్లగక్కింది. బంగ్లాదేశ్‌ జాతిపిత షేక్‌ ముజిబూర్‌ రెహ్మాన్‌ శత జయంతిని పురస్కరించుకుని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) టీ20 మ్యాచ్‌లను నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

రెహ్మాన్‌ శతజయంతి సందర్భంగా ఆసియా ఎలెవన్, ప్రపంచ ఎలెవన్‌ జట్ల మధ్య రెండు టీ20 మ్యాచ్‌లను మార్చిలో నిర్వహించాలని బీసీబీ భావిస్తోంది. ఈ మ్యాచ్‌లకు ఐసీసీ కూడా సానుకూలంగా స్పందించింది. మ్యాచ్‌ షెడ్యూల్, ఆసియా ఎలెవన్‌ జట్టు వివరాలను పంపించాలని బీసీబీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కోరింది.

బాక్సింగ్ డే టెస్టులో కివీస్ ఓటమి ఖాయం... అందుకు కారణం అతడే: మార్క్ వా జోస్యంబాక్సింగ్ డే టెస్టులో కివీస్ ఓటమి ఖాయం... అందుకు కారణం అతడే: మార్క్ వా జోస్యం

అయితే, ఈ ఆసియా ఎలెవన్ జట్టులో పాకిస్తాన్‌ క్రికెటర్లకు చోటు దక్కలేదు. ఇందుకు కారణం బీసీసీఐ అంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తాజాగా వ్యాఖ్యాలు చేసింది. ఇది కచ్చితంగా తమ ఆటగాళ్లను కించపరచడమే అవుతుందని.... బీసీసీఐ వాస్తవాలను కప్పిపుచ్చి తమ అభిమానులను తప్పుదోవ పట్టిస్తోందని పీసీబీ పేర్కొంది.

"ఆసియా XI vs వరల్డ్ XI జట్ల మధ్య జరగబోయే రెండు టీ20ల సమయంలో మా పీఎస్‌ఎల్‌ చివరి దశలో ఉంటుంది. దీంతో మా ఆటగాళ్లు పాల్గొనడం కుదరదు. ఇప్పటికే షెడ్యూల్‌ని ప్రకటించాం గనుక పీఎస్ఎల్ తేదీలను మార్చడం కుదరదు. ఇదే విషయాన్ని ముందుగానే బీసీబీకి తెలియజేశాం. అందుకు వారు అంగీకరించారు కూడా" అని పీసీబీ అధికార ప్రతినిధి తెలిపారు.

క్రికెట్ అనేది ఫన్నీ గేమ్ అని... ఇక్కడ ఏదైనా జరగొచ్చు: వన్డేల్లో పునరాగమనంపై రహానేక్రికెట్ అనేది ఫన్నీ గేమ్ అని... ఇక్కడ ఏదైనా జరగొచ్చు: వన్డేల్లో పునరాగమనంపై రహానే

"అయితే, ఇప్పుడు మా ఆటగాళ్లు ఆడితే భారత క్రికెట్ జట్టు నుంచి ఏ ఒక్క ఆటగాడు ఆసియా ఎలెవన్‌లో ఆడటానికి రాబోమని చెప్పడం సరికాదు. ఇది వాస్తవాన్ని కనుమరుగు చేసి మా ఆటగాళ్లను మా అభిమానుల్ని తప్పుదోవ పట్టించినట్లు అవుతుంది" అని పీసీబీ అధికార ప్రతినిధి వెల్లడించారు.

వచ్చే ఏడాది మార్చిలో వరల్డ్‌ లెవన్‌-ఆసియా లెవన్‌ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్‌లను బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డుతో ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌(ఏసీసీ)లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. తొలి మ్యాచ్‌ మార్చి 16వ తేదీన జరుగనుండగా, రెండో టీ20 మార్చి 20వ తేదీన జరగనుంది. ఈ మ్యాచ్‌లు ఐసీసీ అధికారిక హోదాలోనే జరుగనున్నాయి.

ఈ సిరిస్‌లో భారత్ నుంచి ఐదుగురు ఆటగాళ్లను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఎంపిక చేయనున్నట్లు బీసీసీఐ సంయుక్త కార్యదర్శి జయేశ్‌ జార్జ్‌ తెలిపారు.

Story first published: Friday, December 27, 2019, 16:53 [IST]
Other articles published on Dec 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X