న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గత రెండేళ్లలో 50 ఓవర్ల ఫార్మాట్‌లో: మరో ప్రపంచ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ

 Over 50 in 2 years: Virat Kohli creates another world record

హైదరాబాద్: ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు, వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌కు తానే బాస్ అని మరోసారి నిరూపించుకున్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

2017లో 1460 పరుగులు, 2018లో 1202 పరుగులతో గత రెండేళ్లుగా విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, వరుసగా మూడో ఏడాది కూడా ఈ జాబితాతో అగ్రస్థానంలో నిలిచే అవకాశం విరాట్ కోహ్లీకి లభించింది.

మూడు ఫార్మాట్లలో 50కిపైగా యావరేజి

మూడు ఫార్మాట్లలో 50కిపైగా యావరేజి

ఇది మాత్రమే కాదు, గత రెండేళ్లుగా మూడు ఫార్మాట్లలో 50కిపైగా యావరేజిని కలిగిన ఉన్న ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీనే కావడం విశేషం. 2016లో తొలిసారి 50కిపైగా యావరేజిని సాధించిన కోహ్లీ... ప్రస్తుతం టెస్టుల్లో 54.97, వన్డేల్లో 60.02, టీ20ల్లో 52.66 యావరేజిని కలిగి ఉన్నాడు.

ఏడాదిలో వన్డేల్లో 50 కంటే ఎక్కువ యావరేజి ఉన్న ఇతర ఆటగాళ్ళు వీరే:

ఏడాదిలో వన్డేల్లో 50 కంటే ఎక్కువ యావరేజి ఉన్న ఇతర ఆటగాళ్ళు వీరే:

* 2007లో మాథ్యూ హేడెన్

* 2007లో ఆండ్రూ సైమండ్స్

* 2013లో కుమార్ సంగక్కర

* 2015లో స్టీవ్ స్మిత్

* 2016లో కేఎల్ రాహుల్

* 2017లో ఎబి డివిలియర్స్

మూడు ఫార్మాట్లు కలిపి 2366 పరుగులు

మూడు ఫార్మాట్లు కలిపి 2366 పరుగులు

ఇప్పటివరకు 2019లో విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లు కలిపి 2366 పరుగులు చేశాడు. అంతేకాదు ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య విశాఖ వేదికగా రెండో వన్డే బుధవారం జరగనుంది.

విశాఖలో కోహ్లీ ట్రాక్ రికార్డు ఇదే

విశాఖలో కోహ్లీ ట్రాక్ రికార్డు ఇదే

ఈ మ్యాచ్‌లో కోహ్లీ గనుక సెంచరీ సాధిస్తే, అతడి ఖాతాలో మరిన్ని పరుగులు చేరతాయి. విశాఖ స్టేడియంలో విరాట్ కోహ్లీ యావరేజి కూడా ఎక్కువగానే ఉండటం కలిసొచ్చే అంశం. ఈ స్టేడియంలో విరాట్ కోహ్లీ యారవేజి 139గా నమోదైంది. ఇక్కడ కోహ్లీ ఆడిన 5 మ్యాచ్‌ల్లో 556 పరుగులు చేశాడు. దాంట్లో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

తొమ్మిది వన్డేల్లో ఆరింట విజయం

తొమ్మిది వన్డేల్లో ఆరింట విజయం

విశాఖపట్నంలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన తొమ్మిది వన్డేల్లో ఆరింట విజయం సాధించి ఒక దాంట్లో ఓడింది. ఆ ఓటమి కూడా వెస్టిండిస్ చేతిలోనే కావడం విశేషం. ఒక మ్యాచ్‌ టై కాగా మరొకటి వర్షం కారణంగా రద్దు అయింది.

ఇక్కడ చివరగా ఈ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్ టైగా ముగిసింది. ఈ స్టేడియంలో జరిగిన గత ఆరు వన్డేల్లో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు కేవలం ఒక్కసారే మాత్రమే విజయం సాధించింది.

Story first published: Wednesday, December 18, 2019, 12:49 [IST]
Other articles published on Dec 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X