న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

#OnThisDay in 2012: 100వ సెంచరీ నమోదు చేసిన సచిన్

By Nageshwara Rao
#OnThisDay in 2012: Sachin Tendulkar scored his 100th international ton

హైదరాబాద్: మైఖేల్ తెలుగు పాఠకుల కోసం #OnThisDay పేరిట కొత్త కథనాలను అందిస్తోన్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఆరేళ్ల క్రితం ఇదే రోజున అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కాని ఓ అద్భుతమైన రికార్డుని సచిన్ తన పేరిట లిఖించాడు.

అన్ని ఫార్మాట్లలో కలిపి తన కెరీర్‌లో 99 సెంచరీలను చాలా వేగంగా నమోదు చేసిన సచిన్ టెండూల్కర్ 100వ సెంచరీ కోసం చాలా సమయం తీసుకున్నాడు. క్రికెట్ దేవుడు ఈ మైలురాయిని ఎప్పుడు అందుకుంటాడా? అని అభిమానులు ఆతృతగా ఎదురు చూశారు.

చివరకు ఆసియా కప్‌లో భాగంగా 2012 మార్చి16న ఢాకాలోని షేర్‌ బంగ్లా స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ తన 100వ సెంచరీని అందుకున్నాడు. ఈ 100వ సెంచరీతో అంతర్జాతీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. అంతేకాదు బంగ్లాదేశ్‌పై సచిన్‌కు ఇదే తొలి వన్డే సెంచరీ.

సచిన్ సాధించిన ఈ 100వ సెంచరీ వన్డేల్లో 49వ సెంచరీ కావడం విశేషం. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు నమోదు చేసిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లా బౌలర్ షకీబ్ ఉల్ హాసన్ వేసిన ఇన్నింగ్స్ 44వ ఓవర్‌లో స్క్వేర్ లెగ్‌లో సింగిల్ తీసి సచిన్ ఈ ఘనత అందుకున్నాడు.

అయితే ఈ మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్‌ వన్డేలో 49 సెంచరీలు, టెస్టులో 51 సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే.

Story first published: Friday, March 16, 2018, 15:00 [IST]
Other articles published on Mar 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X